సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. కీలక సూచీలు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే కుదేలయ్యాయి. రోజంతా అదే ధోరణి కొనసాగింది. చివర్లో స్వల్పంగా కోలుకున్నప్పటికీ బ్యాంకింగ్, ఐటీ, ఆటో సహా అన్ని రంగాల షేర్లు నష్టాలను చవి చూశాయి. మూడవ సెషన్‌లో పతనాన్ని నమోదు చేయడమే కాదు, వరుసగా నాల్గవ వారాంతంలోనూ క్షీణించాయి.
సెన్సెక్స్ 1020 పాయింట్లు కుప్పకూలి 58098 వద్ద ముగిసింది. తద్వారా 58,500 స్థాయిని కూడా కోల్పోయింది. నిఫ్టీ 302 పాయింట్లు పతనమై 17327వద్ద స్థిరపడింది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పీఎన్‌బీ, యాక్సిస్, ఇండస్ ఇండ్ తదితర బ్యాంకింగ్ షేర్లతోపాటుపవర్‌గ్రిడ్, హిందాల్కో, అపోలో, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ నష్టపోయాయి. మరోవైపు దివీస్ లాబ్స్, సన్‌ఫార్మా, సిప్లా, ఐటీసీ, టాటా స్టీల్ లాభపడ్డాయి. అటు అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 25 పైసలు పడిపోయి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 81.04 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment