
సాక్షి,ముంబై: కరోనా సెకండ్‌వేవ్ ప్రకంపనల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారంకుప్పకూలాయి. కీలక సూచీలు ఓపెనింగ్‌లోనే రెండున్నరశాతం వరకూ క్షీణించాయి. సెన్సెక్స్ 1400 పైగా క్షీణించి 48,700 కిందికి పతనం కంగా, నిఫ్టీ కీలక మద్దతు స్థాయి 14300 దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ 1377పాయింట్లు కోల్పోయి 47464 వద్ద నిఫ్టీ 395 పాయింట్లు పతనమై 14223 వద్ద కొనసాగుతోంది. అటు బ్యాంక్ నిఫ్టీలో కూడా భారీగా అమ్మకాల ధోరణి కనిపిస్తోంది. అన్ని రంగాల షేర్లు భారీగా నష్టపోతున్నాయి.
ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో రంగ షేర్లు కుప్పకూలాయి. అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్,యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డిఎఫ్‌సీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. ఆటో స్పేస్‌లో టాటా మోటార్స్, ఐషర్ మోటర్స్, హీరో మోటోకార్ప్ కూడా ఒక్కొక్కటి 4 శాతం చొప్పున పడిపోయాయి. కాగా దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. కొత్తగా నమోదవుతున్న రోజువారీ కేసుల సంఖ్య మూడు లక్షల మార్క్ దిశగా అడుగులువేస్తోంది వరుసగా ఐదో రోజు రెండున్నర లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు నమోద వుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2,73,810 మందికి కరోనా బారిన పడగా గడిచిన 24 గంటల్లో 1,619 మంది కరోనాతోమరణించారు.
Comments
Please login to add a commentAdd a comment