సాక్షి,ముంబై: దలాల్ స్ట్రీట్ మళ్లీ రికార్డులకు కేంద్రంగా మారింది. రెండు రోజుల విరామం తరువాత కీలక సూచీల సరికొత్త గరిష్టాల మధ్య కళకళలాడుతున్నాయి. నిఫ్టీ 15669 పాయింట్ల ఆల్ టైం గరిష్టాన్ని నమోదు చేసింది. అలాగే ఆరంభ లాభాలనుంచి మరింత ఎగిసిన సెన్సెక్స్ 52 వేల, స్థాయికి చేరుకుంది. దాదాపు 400 పాయింట్లు జంప్ చేసింది. నిఫ్టీ ఫార్మాను మినహాయించి, మెటల్ , బ్యాంకింగ్, రియాల్టీ ఇలా అన్ని దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్ల కొనసాగుతున్నాయి. కోటక్, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ లాంటి బ్యాంకింగ్ షేర్లతో పాటు టైటన్, రిలయన్స్, ఓన్‌జీసీ, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్ తదితర షేర్లు లాభాల్లో ఉన్నాయి. రికార్డ్ ఫండ్ రైజింగ్, డెట్ ప్రీపేమెంట్ల తరువాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) దూకుడును కొనసాగిస్తోంది. మరోవైపు బజాజ్ ఆటో, ఇండస్ ఇండ్, నెస్లే, డా.రెడ్డీస్, సన్‌ఫార్మ, భారతి ఎయిరెటెల్, టెక్ మహీంద్ర నష్టపోతున్నాయి.
లాక్‌డౌన్ ఆంక్షలతో దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో వేగంగా ఆర్థిక వ్యవస్థపుంజుకుంటుందనే ఆశలను రేకెత్తిస్తోందని, ఇది మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్‌కు దారి తీసిందని విశ్లేషకులు తెలిపారు. కాగా గురువారం నాటి గణాంకాల ప్రకారం దేశంలో కరోనా కేసుల సంఖ్య1.34 లక్షలకు దిగి వచ్చింది. అలాగే మరణాల సంఖ్య 2,887 వద్ద 3 వేల దిగువకు చేరడం ఊరటనిస్తోంది.
చదవండి : కోవిడ్ బాధిత ఉద్యోగి కుటుంబాలకు రిలయన్స్ భారీ సాయం
Comments
Please login to add a commentAdd a comment