సాక్షి, ముంబై: ప్రపంచ మార్కెట్లలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. 2008 తరువాత మొదటిసారి కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ మార్కెట్లను కుదిపివేస్తోంది. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్‌లో కీలక ప్రధాన సూచికలు శుక్రవారం 10 శాతం పతనం కావడంతో 45 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపి వేశారు. తిరిగి ప్రారంభమైన మార్కెట్లు భారీ రికవరీ సాధించాయి. కనిష్టంనుంచి ఏకంగా సెన్సెక్స్ 5381 పాయింట్లు నిఫ్టీ 1604 పాయింట్లకు పైగా ఎగిసింది.
చివరికి సెన్సెక్స్ 1325 పాయింట్లు ఎగిసి 34,103 వద్ద, నిఫ్టీ 365 పాయింట్లు లాభంతో 9955 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీలు వరుసగా 2.5 శాతం, 0.8 శాతం పెరిగాయి. నిఫ్టీ మీడియా మినహా అన్ని రంగాలు లాభపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంకు 11 శాతం, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మెటల్ ఒక్కొక్కటి 5 శాతం పెరిగాయి. టాటా స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ, సన్ ఫార్మా, యూపీఎల్, జీ, హీరో మోటోకార్ప్, ఏషియన్ పెయింట్స్, నెస్లే నష్టపోయాయి. అలాగే అంతకుముందు డాలర్‌తో పోలిస్తే 74.5 రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి కూడా భారీగా పుంజుకుని 73.99 వద్ద 0.4 శాతం లాభపడింది.
Comments
Please login to add a commentAdd a comment