భారత్‌-జపాన్‌ రక్షణ ఒప్పందం | India And Japan Ink Key Defence Pact | Sakshi
Sakshi News home page

ఒప్పందాన్ని స్వాగతించిన ఇరు దేశాధినేతలు

Published Thu, Sep 10 2020 7:28 PM | Last Updated on Thu, Sep 10 2020 8:46 PM

India And Japan Ink Key Defence Pact - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌, జపాన్‌ గురువారం రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వారా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, సామరస్యం వెల్లివిరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాయి. రక్షణ ఒప్పందం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్‌ ప్రధాని అబే షింజో ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. భారత్‌-జపాన్‌ల మధ్య రక్షణ ఒప్పందాన్ని ఇరువురు నేతలు స్వాగతించారని అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ ఒప్పందం కింద ఇరు దేశాలు రక్షణ పరికరాలు, సేవలను ఇచ్చిపుచ్చుకుంటాయి.

ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి చొరవ చూపారంటూ షింజో అబేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇరువురు నేతలు ముంబై-అహ్మదాబాద్‌ మధ్య బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు సహా ఇరు దేశాల మధ్య సహకారంపై సమీక్షించారు. గత కొన్నేళ్లుగా ముమ్మరంగా సాగుతున్న భారత్‌-జపాన్‌ భాగస్వామ్యం ఇక ముందు కూడా ఉత్తేజంగా కొనసాగుతుందని మోదీ, అబే విశ్వాసం వ్యక్తం చేశారు. చదవండి : ‘డిజిటల్‌ వేదికగా ప్రపంచానికి చేరువ’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement