బేగంపేట విమానాశ్రయాన్ని రక్షణ శాఖకు ఇవ్వకూడదంటూ కేంద్రమంత్రి అశోక గజపతిరాజును తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
న్యూఢిల్లీ: బేగంపేట విమానాశ్రయాన్ని రక్షణ శాఖకు ఇవ్వకూడదంటూ కేంద్రమంత్రి అశోక గజపతిరాజును తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. సోమవారం మంత్రి తుమ్మల ఢిల్లీలో కేంద్రమంత్రి అశోకగజపతిరాజును కలిశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోనూతన విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కోరినట్టు సమాచారం.
అశోక గజపతిరాజు దీనికి సమాధానంగా దేశం కోసం ఆర్మీ పని చేస్తోంది.. ఇవ్వకూడదంటే ఎలా అని తుమ్మలను ప్రశ్నించారు. అదే విధంగా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని తుమ్మలను కోరారు. కొత్తగూడెంలో నూతన ఎయిర్ పోర్టు కోసం స్థలం సేకరిస్తే పరిశీలిస్తామని బదులిచ్చారు. అశోకగజపతిరాజుతో పాటు నితిన్ గడ్కరి, మేనకా గాంధీలను తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేర్వేరుగా కలిశారు. జాతీయ రహదారుల విస్తరణలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ వారికి వివరించారు.