న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధఙంచిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. అటు రానున్న ఎన్నికలు, ఇటు మోదీ సర్కార్‌కు చివరి వార్షిక బడ్జెట్ కానున్న నేపథ్యంలో రక్షణ రంగంతో పాటు పలు రంగాలు ఈ బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నాయి. భారత సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గత బడ్జెట్‌లలో రక్షణ వ్యయానికి ప్రాధాన్యతనిచ్చింది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)వద్ద చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య బడ్జెట్ 2023 రక్షణ రంగ కేటాయింపులు 10-15 శాతం పెరగవచ్చని అంచనా.
10-15 శాతం పెరగనున్న కేటాయింపులు
ఈ బడ్జెట్‌లో రక్షణ వ్యయం 10-15 శాతం పెరుగుతుందని రక్షణ రంగం అంచనా వేసింది. రక్షణ రంగంలో, ముఖ్యంగా దేశీయ ఉత్పత్తికి సంబంధించి, పరికరాలు, ఆర్ అండ్ డికి సంబంధించిన ఆర్డర్‌లు వంటి వాటిని అంచనా వేస్తుంది. అదే సమయంలో, ప్రభుత్వ దేశీయ కంపెనీలు తయారీని పెంచడానికి మరింత ప్రోత్సాహాన్ని అందించవచ్చు. 25 శాతం వృద్ధిని, రక్షణ బడ్జెట్ రూ. 6.6 లక్షల కోట్ల వరకు పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఎంఎస్‌ఎంఈలపై దృష్టి
దీంతోపాటు, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) మంత్రిత్వ శాఖ కూడా బడ్జెట్‌లో దృష్టి సారించనుంది. రక్షణ రంగంలో ఎంఎస్‌ఎంఈ భాగస్వామ్యం మరింత పెరగాలని భావిస్తోంది. పరిశోధన అభివృద్ధి కోసం ప్రకటించిన ప్రోత్సాహకాలు లేదా విధానాలతో పాటు, కొత్త పరికరాల సేకరణకు కూడా బడ్జెట్‌లో కేటాయించిన మొత్తంలో పెంపును నిపుణులు అంచనా వేస్తున్నారు.
కాగా రక్షణ మంత్రిత్వ శాఖకు గతేడాది రూ.5.25 లక్షల కోట్ల మొత్తం బడ్జెట్‌ను కేటాయించారు. అలాగే రక్షణ రంగంలో పరిశోధనలకు 25 శాతం పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఏడాది రూ.2.33 లక్షల కోట్లు కేటాయించగా, రక్షణ మంత్రిత్వ శాఖకు రూ.2.39 లక్షల కోట్లు కేటాయించారు. రక్షణ శాఖ పెన్షన్ బడ్జెట్ రూ.1.19 లక్షల కోట్లుగా ఉంది. 'మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్' లో భాగంగా దేశీయ పరిశ్రమలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో దేశీయ స్థాయిలో సామర్థ్య విస్తరణకు రక్షణ రంగం పెద్దపీట వేసింది.
Comments
Please login to add a commentAdd a comment