
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్-2023ను పార్లమెంట్‌లో బుధవారం ప్రవేశపెట్టారు. అయితే, విభజన చట్టం హామీల విషయంలో కేంద్రం నిరాశ కలిగించింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం, రైల్వే కారిడార్ గురించి కూడా ప్రస్తావన లేకపోవడంతో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. కాగా, బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల్లోని పలు సంస్థలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి.
►తెలుగురాష్ట్రాల్లోని గిరిజన వర్సిటీలకు రూ.37 కోట్లు
►ఏపీ సెంట్రల్ యూనివర్శిటీకి రూ.47 కోట్లు
►ఏపీ పెట్రోలియం వర్శిటీకి రూ.168 కోట్లు
►విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.683 కోట్లు
►సింగరేణికి రూ.1650 కోట్లు
►ఐఐటీ హైదరాబాద్‌కు ఈఏపీ కింద రూ.300 కోట్లు కేటాయింపు
►మంగళగిరి, బీబీనగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు రూ.6,835 కోట్లు
►సాలర్ జంగ్ సహా అన్ని మ్యూజియాలకు రూ.357 కోట్లు
►మణుగూరు, కోట భారజల కర్మాగాలకు రూ.1,473 కోట్లు
►కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ.41,338 కోట్లు
►కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా రూ.21,470 కోట్లు
చదవండి: వేతన జీవులకు ఊరట, శ్లాబుల్లో మార్పులు
ఆదాయ పన్ను విషయానికొస్తే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులకు ఊరట కల్పించారు. పన్ను పరిమితిని రూ.5 లక్షలనుంచి 7 లక్షలకు పెంచారు. అలాగే ఉద్యోగుల పన్ను శ్లాబులను ప్రస్తుతం 6 నుంచి 5 కు తగ్గించారు. అయితే ఆదాయం రూ.7 లక్షలు దాటితే మాత్రం పన్ను రూ.3 లక్షల నుంచే మొదలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment