Helicopter Flew Without Pilot: ఇక నుంచి హెలికాప్టర్లను నడపటానికి ఫైలెట్లు అవసరం ఉండదట. పైగా వాతావరణం అనుకూలించని సమయంలో కూడా పయనించే గలిగే ఫైలెట్ రహిత హెలికాప్టర్ ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ప్రత్యక సాంకేతికతో రూపొందించిన ఈ చాపర్ 30 నిమిషాల పాటు ఆకాశంలో విహరించి చివరికి సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. పైగా దాదాపు 4 వేల అడుగుల ఎత్తులో గంటకు 115 నుంచి 125 మైళ్ల వేగంతో ప్రయాణించింది. ఈ విమానం స్వయం ప్రతిపత్తితో పయనించే హెలికాప్టర్.
ఇది అలియాస్ అనే యూఎస్ డిఫెన్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌లో భాగంగా పూర్తిగా కంప్యూటర్-ఆపరేటెడ్ హెలికాప్టర్. కెంటకీలోని ఫోర్ట్ క్యాంప్‌బెల్ నుంచి ఈ ట్రయల్ పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో పనితీరు ముగిసిన వాటిని తొలగించి, వాటి స్థానంలో అలియాస్ ఈ ఆటోమేటడ్ ఫైలెట్ రహిత హెలికాప్టర్‌లను భర్తీ చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది.
ఈ మేరకు అలియాస్ ప్రోగ్రామ్ మేనేజర్ స్టువర్ట్ యంగ్ మాట్లాడుతూ..."ఈ రకమైన స్వయంప్రతిపత్త హెలికాప్టర్ సాంకేతికతకు మూడు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది భద్రత తోపాటు భూభాగంలోకి దూసుకెళ్లడం, విపత్తులను నివారించడం. రెండవది హెలికాప్టర్ సహాయకారి. మూడవది ఖర్చు తగ్గింపు. అని పేర్కొన్నాడు. ఇది ఆర్మీకి కార్యాచరణ సౌలభ్యాన్ని ఇస్తుంది. అంతేకాదు ఇది తప్పనిసరిగా పగలు లేదా రాత్రి అన్ని సమయాల్లో ఈ పైలట్ రహిత హెలికాప్టర్ సులభంగా పయనించడమే కాక క్లిష్టమైన దృశ్యమన రహిత వాతావరణ పరిస్థితిల్లోనూ, విభిన్న క్లిష్ట పరిస్థితిలోనూ సులభంగా పయనించగలిగే వెసులుబాటుని కల్పిస్తోంది.
WATCH: A Black Hawk helicopter flew for the first time without pilots in Kentucky. The aircraft flew for 30 minutes through a simulated cityscape avoiding imagined buildings before performing a perfect landing pic.twitter.com/SD01LWhUZe
— Reuters Asia (@ReutersAsia) February 12, 2022
(చదవండి: రైల్వే పట్టాలపై పడి ఉన్న బాలిక... వేగంగా వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురెళ్లిన వ్యక్తి....ఐతే..)
Comments
Please login to add a commentAdd a comment