Black Hawk helicopter
-
ఆర్మీ హెలికాప్టర్లు ఢీకొని..9 మంది మృతి
ఫోర్ట్కాంప్బెల్(అమెరికా): కెంటకీలో అమెరికా ఆర్మీకి చెందిన రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ఢీకొన్న ఘటనలో 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పోర్ట్ కాంప్‌బెల్‌కు 30 మైళ్లదూరంలో బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. 101 ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు చెందిన హెచ్‌హెచ్–60 బ్లాక్ హాక్ హెలికాప్టర్లు రెండూ రాత్రి వేళ జరుగుతున్న రోజువారీ శిక్షణ సమయంలో ప్రమాదానికి గురికావడంపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొంత అటవి, కొంతమైదానం ఉన్నాయని కెంటకీ గవర్నర్ ఆండీ చెప్పారు. -
హెలికాప్టర్ కూలి 14 మంది మృతి: నార్కో టెర్రరిస్టు అరెస్టే కారణమా?
మెక్సికో : సినాలోవాలో మెక్సికన్ నేవీ హెలికాప్టర్ కూలిన ఘటన విషాదాన్ని నింపింది. ఉత్తర రాష్ట్రమైన సినాలోవాలో బ్లాక్ హాక్ మిలిటరీ హెలికాప్టర్ కూలిపోవడంతో 14 మంది మరణించారని, మరొకరు గాయపడ్డారని మెక్సికన్ నేవీ శుక్రవారం తెలిపింది. ఈ దుర్ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపింది. నావీ మోస్ట్ వాంటెడ్ నార్కో టెర్రరిస్టును అదుపులోకి తీసుకున్న నేపథ్యంలోనే ఈ క్రాష్ జరిగి ఉంటుందా అనే అనుమానాలు వెల్లువెత్తాయి. సినాలోవాలో 69 ఏళ్లడ్రగ్ లార్డ్ రాఫెల్ కారో క్వింటెరో మాక్స్ అనే మిలిటరీ-శిక్షణ పొందిన ఫీమేల్ బ్లడ్హౌండ్కి పట్టుబడ్డాడని నేవీ శుక్రవారం తెలిపింది. అతని అరెస్టు తరువాత హెలికాప్టర్ క్రాష్ కావడం చర్చకు దారితీసింది. అయితే అతని అరెస్టకు ఈ ప్రమాదానికి సంబంధం ఉందన్న సమాచారం ఏమీ లేదని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. 1985లో అమెరికాలోడ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మి నిస్ట్రేషన్ ఏజెంట్ "కికి" కమరేనాను కిడ్నాప్ చేసి. చిత్ర హింసలకు గురిచేసి, హత్య చేసిన కేసులో దోషిగా తేలిన కరుడుగట్టిన డ్రగ్ లార్డ్ రాఫెల్ కారో క్వింటెరోను నావికాదళం అరెస్ట్ చేసింది. కమరేనా హత్యకు క్వింటెరోకు 40 సంవత్సరాల జైలు శిక్ష విధించగా, 28 ఏళ్ల శిక్ష తరువాత 2013లో, మెక్సికన్ న్యాయస్థానం అతనిని విడుదల చేయాలని ఆదేశించింది. ఇది అమెరికా అధికారులకు ఆగ్రహాన్ని తెప్పించింది. మెక్సికో సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని రద్దు చేసే సమయానికి, కారో క్వింటెరో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇరు దేశ దౌత్య సంబంధాలను దెబ్బ తీసింది. ఆ తరువాత సినాలోవా కార్టెల్‌కు తిరిగి వచ్చి డ్రగ్ దందా మొదలు పెట్టాడు క్వింటెరో. ఎఫ్‌బీఐ టాప్ 10 మోస్ట్ వాంటెడ్ ఫ్యుజిటివ్ల జాబితాలో ఉన్న అతనిపై 20 మిలియన్ల యూఎస్ డాలర్ల బహుమతికూడా ఉంది. ఇది డ్రగ్ ట్రాఫికర్‌గా రికార్డు. మరోవైపు క్వింటెరో అరెస్టును అమెరికా ప్రభుత్వం ప్రశంసించింది. అమెరికా అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్, కారో క్వింటెరోను తక్షణమే అప్పగించాలని కోరనున్నట్లు తెలిపారు."ఇది చాలా పెద్దవిషయం" అని వైట్ హౌస్ సీనియర్ లాటిన్ అమెరికా సలహాదారు జువాన్ గొంజాలెజ్ ట్వీట్ చేశారు. క్వింటెరో కారో అరెస్ట్‌తో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో అమెరికా, మెక్సికో మధ్య సంబంధాలు మెరుగుపడనున్నాయని అధికారులు భావిస్తున్నారు. -
పైలట్ లేకుండా నింగిలోకి..
మనం డ్రైవర్‌రహిత కార్లు చూశాం. అయితే అమెరికాలో మొదటిసారి పూర్తిస్థాయిలో పైలట్‌రహిత హెలికాప్టర్ ఆకాశంలోకి ఎగిరింది. మరి దీన్ని యుద్ధక్షేత్రాల్లో కూడా వినియోగించ వచ్చా? దాని విశేషాలు ఏంటి? ఓ లుక్కేద్దాం! –సాక్షి, సెంట్రల్ డెస్క్ 4వేల అడుగుల ఎత్తులో.... బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఈనెల 5న అమెరికా కెంటకీలోని ఫోర్ట్ క్యాంప్‌బెల్ నుంచి పైలట్ లేకుండా టేకాఫ్ అయింది. యూహెచ్–60ఏ బ్లాక్‌హాక్ అనే ఈ హెలికాప్టర్ ప్రయోగ సమయంలో 30 నిమిషాలపాటు గగనతలంలో చక్కర్లు కొట్టింది. 4వేల అడుగుల ఎత్తులో గంటకు 115–125 మైళ్ల వేగంతో ప్రయాణించింది. అమెరికా రక్షణ పరిశోధన సంస్థకు చెందిన ‘అలియాస్’ అనే సాంకేతికతను వినియోగించి అందులో పైలట్ లేకుండాహెలికాప్టర్ను ఆపరేట్ చేశారు. కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు.. పైలట్ దాన్ని నియంత్రించలేని పరిస్థితి వచ్చినప్పుడు స్వయంప్రతిప్రత్తి వ్యవస్థకు అనుసంధానించేలా దీన్ని రూపొందించారు. అంటే పైలట్ బదులు ‘కంప్యూటర్ బ్రెయిన్’ దీన్ని నియంత్రిస్తుంది. అమెరికా రక్షణ ఆయుధాల పరిశోధన ప్రాజెక్టుల సంస్థ (డీఏఆర్‌పీఏ), లాక్‌హీడ్ మార్టిన్ సికోర్స్కీ అనే వైమానిక సంస్థ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. మనుషుల ప్రాణాలను కాపాడొచ్చు... ‘ఎయిర్‌క్రూ లేబర్ ఇన్–కాక్‌పిట్ ఆటోమేషన్ సిస్ట మ్ (అలియాస్)’ అనే సాంకేతికతతో దీన్ని రూపొందించారు. ప్రయాణ సమయంలో ఆటంకాలు వస్తే ఎలా నియంత్రించాలనే అంశాన్ని కూడా ఈ ప్ర యోగంలో పరీక్షించారు. మానవరహిత హెలికాప్ట ర్ నేలమీద ల్యాండ్ అయి దాని బ్లేడ్లు తిరగడం ఆగి న తర్వాత ఇద్దరు పైలట్లు అందులోకి వెళ్లి దాన్ని మానవ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అనంతరం దాన్ని బేస్‌లోకి తీసుకెళ్లారు. పైలట్‌కు ఎలాం టి అపాయం కలగకుండా ఉండేందుకు ఈ అటానమస్ హెలికాప్టర్‌ను యుద్ధక్షేత్రాల్లోకి కూడా పంపవచ్చని అంటున్నారు. యుద్ధానికి అవసరమైన సా మగ్రిని దీని ద్వారా తరలించవచ్చని చెబుతున్నారు. విమానం గగనతలంలో ఎగురుతున్నప్పుడు అకస్మాత్తుగా దృశ్యస్పష్టత తగ్గినప్పుడు పైలట్ ఈ సాంకేతికతను ఉపయోగించి అటానమస్ మోడ్‌కు అనుమతించి ఆ సమస్య నుంచి గట్టెక్కవచ్చని అంటున్నారు. విపత్కర పరిస్థితుల్లో పైలట్లు ఎలాంటి సంకోచం లేకుండా పూర్తి విశ్వాసంతో అటానమస్ మోడ్‌కు అనుసంధానించవచ్చని ఫోర్ట్ క్యాంప్‌బెల్‌కు చెందిన లీడ్ పైలట్ బెంజమిన్ విలియమ్సన్ చెప్పారు. ‘ఎప్పుడు అవసరమైతే అప్పుడు అటానమీ మోడ్‌కు, పైలట్ మోడ్‌కు మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. ప్రమాదకర పరిస్థితులను గుర్తించడంలో, వాటిని అధిగమించడంలో ఈ సాంకేతికత ఎంతగానో దోహదం చేస్తుంది. ప్రమాదాలను కూడా నివారించి మనుషుల ప్రాణాలను కాపాడవచ్చు’ అని పేర్కొన్నారు. సురక్షితంగా ల్యాండింగ్... ‘అలియాస్’ అనే సాంకేతికతను బ్లాక్‌హాక్ హెలికాప్టర్లోగానీ, విమానంలో గానీ వినియోగించడం మొదటిసారి కాదని, మానవరహితంగా గాల్లోకి ఎగరడం, ల్యాండ్ అవడం మాత్రం ఇదే మొదటిసారని సంబంధిత వర్గాలు చెప్పాయి. సాధారణంగా ఎక్కువ విమానాల్లో అటానమస్ సాంకేతికతను పైలట్లకు సహాయకారిగా వాడతారు. అదికూడా చిన్నచిన్న టాస్క్‌ల కోసమే వినియోగిస్తారు. కానీ సంక్లిష్టమైన, ఊహించని పరిస్థితులు తలెత్తినప్పుడు మానవ పైలట్లకే వదిలేస్తారు. కానీ బ్లాక్హాక్లో వినియోగించిన ‘అలియాస్’ అనేది మానవప్రమేయం లేకుండా పూర్తిగా అటానమస్ వ్యవస్థమీద ఆధారపడి పనిచేస్తుంది. చిన్నచిన్న పనులే కాకుండా అన్ని రకాల వ్యవహారాలను చక్కపెడుతుంది. అత్యవసర సమయాల్లో కూడా సురక్షితంగా ల్యాండ్ చేసే నైపుణ్యం దీని సొంతం. ఒకవేళ గాల్లో ఎగురుతున్నప్పుడు ఉన్నట్టుండి రెండు ఇంజన్లు కూడా ఫెయిలైతే అప్పుడు కూడా మానవప్రమేయం లేకుండా సురక్షితంగా ల్యాండ్ అవుతుంది. ఇది పైలట్లు ఉన్నా లేకున్నా కూడా సైనికులకు రాత్రి పగలు అనే తేడా లేకుండా అన్నివేళలా సహాయకారిగా ఉంటుందని అలియాస్ ప్రోగ్రామ్ మేనేజర్ స్టువర్ట్ యంగ్ వెల్లడించారు. -
తొలిసారిగా పైలెట్ లేకుండానే దూసుకెళ్లిన హెలికాప్టర్.. ఎలాగో తెలుసా!!
Helicopter Flew Without Pilot: ఇక నుంచి హెలికాప్టర్లను నడపటానికి ఫైలెట్లు అవసరం ఉండదట. పైగా వాతావరణం అనుకూలించని సమయంలో కూడా పయనించే గలిగే ఫైలెట్ రహిత హెలికాప్టర్ ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ప్రత్యక సాంకేతికతో రూపొందించిన ఈ చాపర్ 30 నిమిషాల పాటు ఆకాశంలో విహరించి చివరికి సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. పైగా దాదాపు 4 వేల అడుగుల ఎత్తులో గంటకు 115 నుంచి 125 మైళ్ల వేగంతో ప్రయాణించింది. ఈ విమానం స్వయం ప్రతిపత్తితో పయనించే హెలికాప్టర్. ఇది అలియాస్ అనే యూఎస్ డిఫెన్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌లో భాగంగా పూర్తిగా కంప్యూటర్-ఆపరేటెడ్ హెలికాప్టర్. కెంటకీలోని ఫోర్ట్ క్యాంప్‌బెల్ నుంచి ఈ ట్రయల్ పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో పనితీరు ముగిసిన వాటిని తొలగించి, వాటి స్థానంలో అలియాస్ ఈ ఆటోమేటడ్ ఫైలెట్ రహిత హెలికాప్టర్లను భర్తీ చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ మేరకు అలియాస్ ప్రోగ్రామ్ మేనేజర్ స్టువర్ట్ యంగ్ మాట్లాడుతూ..."ఈ రకమైన స్వయంప్రతిపత్త హెలికాప్టర్ సాంకేతికతకు మూడు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది భద్రత తోపాటు భూభాగంలోకి దూసుకెళ్లడం, విపత్తులను నివారించడం. రెండవది హెలికాప్టర్ సహాయకారి. మూడవది ఖర్చు తగ్గింపు. అని పేర్కొన్నాడు. ఇది ఆర్మీకి కార్యాచరణ సౌలభ్యాన్ని ఇస్తుంది. అంతేకాదు ఇది తప్పనిసరిగా పగలు లేదా రాత్రి అన్ని సమయాల్లో ఈ పైలట్ రహిత హెలికాప్టర్ సులభంగా పయనించడమే కాక క్లిష్టమైన దృశ్యమన రహిత వాతావరణ పరిస్థితిల్లోనూ, విభిన్న క్లిష్ట పరిస్థితిలోనూ సులభంగా పయనించగలిగే వెసులుబాటుని కల్పిస్తోంది. WATCH: A Black Hawk helicopter flew for the first time without pilots in Kentucky. The aircraft flew for 30 minutes through a simulated cityscape avoiding imagined buildings before performing a perfect landing pic.twitter.com/SD01LWhUZe — Reuters Asia (@ReutersAsia) February 12, 2022 (చదవండి: రైల్వే పట్టాలపై పడి ఉన్న బాలిక... వేగంగా వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురెళ్లిన వ్యక్తి....ఐతే..) -
యెమెన్‌లో కూలిన అమెరికా చాపర్
వాషింగ్టన్: అమెరికా సైన్యానికి చెందిన యూహెచ్ 60- బ్లాక్‌హాక్ హెలికాప్టర్ ఒకటి యెమెన్‌లో కూలిపోయింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో పైలట్ సహా ఆరుగురు సైనికులు ఉన్నారని, వారిలో ఐదుగురు సురక్షితంగా బయటపడగా, ఒకరు మాత్రం గల్లంతయ్యారని యూఎస్ ఆర్మీ ప్రకటించింది. యెమెన్ దక్షిణ తీరంలో ఆరుగురు సభ్యులతో కూడిన బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను శుక్రవారం సిబ్బంది శిక్షణలో వినియోగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం వెనుక ఉగ్రకోణం దాగున్నది, లేనిదీ ఇప్పుడే చెప్పలేమని, దర్యాప్తు కొనసాగుతున్నదని అధికారులు పేర్కొన్నారు.