వాషింగ్టన్: అమెరికా సైన్యానికి చెందిన యూహెచ్ 60- బ్లాక్‌హాక్ హెలికాప్టర్ ఒకటి యెమెన్‌లో కూలిపోయింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో పైలట్ సహా ఆరుగురు సైనికులు ఉన్నారని, వారిలో ఐదుగురు సురక్షితంగా బయటపడగా, ఒకరు మాత్రం గల్లంతయ్యారని యూఎస్ ఆర్మీ ప్రకటించింది.
యెమెన్ దక్షిణ తీరంలో ఆరుగురు సభ్యులతో కూడిన బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను శుక్రవారం సిబ్బంది శిక్షణలో వినియోగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం వెనుక ఉగ్రకోణం దాగున్నది, లేనిదీ ఇప్పుడే చెప్పలేమని, దర్యాప్తు కొనసాగుతున్నదని అధికారులు పేర్కొన్నారు.
యెమెన్‌లో కుప్పకూలిన అమెరికా హెలికాప్టర్
Published Sat, Aug 26 2017 5:15 PM | Last Updated on Tue, Sep 12 2017 1:02 AM
Advertisement
Advertisement