ఇజ్రాయెల్ దళాలు గాజాలో నిరంతరం దాడులకు తెగబడుతూనే ఉన్నాయి తాజాగా గాజాకు దక్షిణ నగరమైన రఫాలోని పాలస్తీనియన్ల శరణార్థి శిబిరాలపై దాడికి దిగాయి. ఈ దాడిలో 25 మంది పాలస్తీనియన్లు మృత్యువాతపడ్డారు. 50 మంది గాయపడ్డారు.
ఈ సందర్భంగా అల్-అహ్లీ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హెడ్ ఫడేల్ నయీమ్ మాట్లాడుతూ 30 మృతదేహాలను ఇక్కడికి తీసుకువచ్చారని, గాజా నగరానికి ఇది క్రూరమైన రోజు అని వ్యాఖ్యానించారు. రఫాలోని సివిల్ డిఫెన్స్ ప్రతినిధి అహ్మద్ రద్వాన్ తెలిపిన వివరాల ప్రకారం తీర ప్రాంతంలోని రెండు ప్రదేశాలల్లో బాంబు దాడుల అనంతరం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన, గాయపడిన వారి వివరాలు తెలియజేసింది.
మీడియాకు అందిన వివరాల ప్రకారం మువాసి పరిధిలో ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది. పాలస్తీనియన్లకు ఇక్కడ రక్షణ శిబిరాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ బలగాలు రెండుసార్లు దాడులకు తెగబడ్డాయని బాధితులు తెలిపారు. మరోవైపు తమ దేశ పౌరుల మరణాలకు ఉగ్రవాదులే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఉగ్రవాదులు జనం మధ్య తిరుగాడుతున్నారని, అందుకే ఈ దాడుల్లో పౌరులు కూడా మరణిస్తున్నారని ఇజ్రాయెల్ చెబుతోంది. కాగా సెంట్రల్ గాజాలో జరిగిన పోరులో ఇద్దరు సైనికులు కూడా మరణించారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అదే సమయంలో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment