ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపధ్యంలో డిఫెన్స్ రంగ స్టాక్‌లు కొంత లాభాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికాకు చెందిన వాటితోపాటు ఇండియన్ మార్కెట్‌లో లిస్ట్ అయిన డిఫెన్స్‌స్టాక్‌లో ర్యాలీ కనబడుతుంది.
యుద్ధంలో వాడే వార్‌హెడ్‌ల్లో ఉపయోగించే టెక్నాలజీ సంబంధించిన కంపెనీలు సహా ఆయుధాలు తయారు చేసే కంపెనీల షేర్ల లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇండియన్ మార్కెట్‌లో లిస్టయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, మజగావ్‌డాక్ షిప్‌బిల్డర్స్, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ వంటి రక్షణరంగ స్టాక్‌లు లాభాల్లో కొనసాగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలోనూ డెఫెన్స్ స్టాక్స్‌లో మంచి ర్యాలీ కనిపించింది.
అయితే కొన్ని విమానయాన కంపెనీలు ఇజ్రాయెల్‌కు రాకపోకలను నిలిపివేయడంతో ఎయిర్‌లైన్ స్టాక్స్ పడిపోయాయి. బ్లూమ్‌బెర్గ్ వరల్డ్ ఎయిర్‌లైన్స్ ఇండెక్స్ మార్చి తర్వాత 2.6శాతం మేర క్షీణించింది. డెల్టా ఎయిర్ లైన్స్ ఇంక్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ హోల్డింగ్స్ ఇంక్, అమెరికన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ ఇంక్ కంపెనీలు ఇజ్రాయిల్‌కు తమ సేవలను రద్దు చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment