చంద్రయాన్–3 చంద్రుడిపై విజయవంతం నేపథ్యంలో అంతరిక్షం, రక్షణ రంగ కంపెనీల కౌంటర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. బీఎస్‌ఈలో సెంటమ్ ఎలక్ట్రానిక్స్ 15 శాతం దూసుకెళ్లగా.. స్పేస్ టెక్నాలజీస్, ఎంటార్ టెక్నాలజీస్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ 5.5–3.6 శాతం మధ్య జంప్‌చేశాయి.
చంద్రయాన్–3 మిషన్‌కు సెంటమ్ 200కుపైగా కీలక మాడ్యూల్స్‌ను సరఫరా చేసింది. ఇక ఈ బాటలో భారత్ ఫోర్జ్, ఆస్ట్రా మైక్రోవేవ్, ఎల్‌అండ్‌టీ 3–1.5 శాతం మధ్య ఎగశాయి. వీటిలో కొన్ని కౌంటర్లు ఏడాది గరిష్టాలకు చేరడం గమనార్హం!
చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండింగ్ విజయవంతమైంది. శాస్త్రవేత్తల అంచనా మేరకే చంద్రుడి ఉపరితలం వైపు ల్యాండర్ ప్రయాణించింది. చంద్రుడిపైకి విక్రమ్ ల్యాండర్ చేరుకుంది. ఒకవైపు ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్ భారత్ క్షణక్షణం ఉత్కంఠంగా ఎదురు చూసిన అద్భుత ఘట్టం ఆవిషృతమైంది. ఈ విజయంతో భారత్.. అంతరిక్ష రంగంలో చైనా, రష్యా, అమెరికా సరసన చేరింది.
ఇదీ చదవండి: చంద్రయాన్-3 విజయం: ఈ కంపెనీలకు భాగస్వామ్యం
Comments
Please login to add a commentAdd a comment