Shares Rally
-
ఐదేళ్లలో ఏయే టాటా షేరు ఎంత పెరిగిందంటే..
టాటా గ్రూప్ విలువను రతన్ టాటా సారథ్య పగ్గాలు చేపట్టిన తర్వాత పరుగు పెట్టించారు. రూ.10 వేలకోట్లుగా ఉన్న సంస్థల విలువను ఏకంగా రూ.30 లక్షల కోట్లకు చేర్చారు. అంతకుమించి ప్రజల్లో తన సేవానిరతితో చేరిగిపోని చోటు సంపాదించారు. గత ఐదేళ్లలో కంపెనీ షేర్లు ఎంత శాతం పెరిగాయో తెలుసుకుందాం.ఇదీ చదవండి: రోబో కారును ఆవిష్కరించిన టెస్లాటాటా గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల పరుగు..కంపెనీ పేరు షేరు ర్యాలీ(%)టాటా టెలీసర్వీసెస్ 3002 ఆటోమోటివ్ స్టాంపింగ్స్ 2211 ట్రెంట్ 1499 టాటా ఎలక్సీ 1109 టాటా ఇన్వెస్ట్మెంట్ 820 టాటా పవర్ 686 టాటా మోటార్స్ 628 టీఆర్ఎఫ్ 489 టాటా కమ్యూనికేషన్స్ 453 ఓరియంటల్ హోటల్స్ 391 ఇండియన్ హోటల్స్ 376 టాటా స్టీల్ 362 టాటా కెమికల్స్ 347 నెల్కో 333 టాటా కన్జూమర్ 304 టైటన్ కంపెనీ 176 వోల్టాస్ 165 టీసీఎస్ 111 ర్యాలీస్ ఇండియా 81 -
మూన్ మూడ్: చంద్రయాన్–3 షేర్లు జిగేల్
చంద్రయాన్–3 చంద్రుడిపై విజయవంతం నేపథ్యంలో అంతరిక్షం, రక్షణ రంగ కంపెనీల కౌంటర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. బీఎస్ఈలో సెంటమ్ ఎలక్ట్రానిక్స్ 15 శాతం దూసుకెళ్లగా.. స్పేస్ టెక్నాలజీస్, ఎంటార్ టెక్నాలజీస్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ 5.5–3.6 శాతం మధ్య జంప్‌చేశాయి. చంద్రయాన్–3 మిషన్‌కు సెంటమ్ 200కుపైగా కీలక మాడ్యూల్స్‌ను సరఫరా చేసింది. ఇక ఈ బాటలో భారత్ ఫోర్జ్, ఆస్ట్రా మైక్రోవేవ్, ఎల్అండ్టీ 3–1.5 శాతం మధ్య ఎగశాయి. వీటిలో కొన్ని కౌంటర్లు ఏడాది గరిష్టాలకు చేరడం గమనార్హం! చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండింగ్ విజయవంతమైంది. శాస్త్రవేత్తల అంచనా మేరకే చంద్రుడి ఉపరితలం వైపు ల్యాండర్ ప్రయాణించింది. చంద్రుడిపైకి విక్రమ్ ల్యాండర్ చేరుకుంది. ఒకవైపు ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్ భారత్ క్షణక్షణం ఉత్కంఠంగా ఎదురు చూసిన అద్భుత ఘట్టం ఆవిషృతమైంది. ఈ విజయంతో భారత్.. అంతరిక్ష రంగంలో చైనా, రష్యా, అమెరికా సరసన చేరింది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 విజయం: ఈ కంపెనీలకు భాగస్వామ్యం -
Today StockMarketUpdate: నష్టాల ముగింపు, అదానీ ఇన్వెస్టర్లకు భారీ ఊరట
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్న సూచీలు రోజంతా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొ న్నాయి. చివరికి సెన్సెక్స్ 220.86 పాయింట్లు లేదా 0.37 శాతం 60,286 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు లేదా 0.24 శాతం క్షీణించి 17,721.50 వద్ద ముగిసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం తర్వాత రేట్ల పెంపును నిలిపివేస్తుందన్న పెట్టుబడిదారులలో స్వల్ప ఆశావాదంతో సూచీలు చూస్తూనే ఉన్నాయి. ఫైనాన్షియల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు లాభాలతోనూ, ఎఫ్ఎంసిజి షేర్లు నష్టాల్లోముగిసాయి. అలాగే ఫ్లాగ్షిప్ అదానీ ఎంటర్ప్రైజెస్ సహా కొన్ని లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఎగిసాయి. హిండెన్ వర్గ్ వివాదంతో ఎఫ్‌పీవోను కూడా అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ ఈరోజు 20 శాతం ఎగిసింది. ఇదే క్రమంలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ స్టాక్ 3.93 శాతం, అదానీ పోర్ట్స్ స్టాక్ ఏకంగా 8.65 శాతం పుంజుకుంది. దీంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. చివరికి అదానీ ఎంటర్ ప్రైజెస్ 15 శాతం, అదానీ పోర్ట్స్, డా.రెడ్డీస్, ఇండస్ ఇండ్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ టాప్ గెయినర్స్‌గా, టాటా స్టీల్, హిందాల్కో, ఐటీసీ, హీరో మోటో, టాటామెటార్స్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 82.70 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది. సోమవారం 82.73 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. -
టైటన్ స్పీడ్ తగ్గింది, షేర్లు మాత్రం దౌడు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ దిగ్గజం టైటన్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్-డిసెంబర్ (క్యూ3) లో నికర లాభం 10 శాతం క్షీణించి రూ. 913 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 1,012 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 10,094 కోట్ల నుంచి రూ. 11,698 కోట్లకు బలపడింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 8,750 కోట్ల నుంచి రూ. 10,454 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో జ్యువెలరీ విభాగం 11 శాతం పుంజుకుని రూ. 9,518 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ బాటలో వాచీలు, ఇతర విభాగం అమ్మకాలు సైతం 15 శాతం ఎగసి రూ. 811 కోట్లకు చేరాయి. ఐ కేర్ అమ్మకాలు 12 శాతం అధికమై రూ. 174 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో గురువారం నీరసించిన శుక్రవారం టైటాన్ షేర్లు దూసుకుపోయాయి. భారీగా లాభాలతో టాప్ గెయినర్‌గా దాదాపు 7 శాతంఎగిసి రూ. 2458 వద్ద ముగిసింది. -
డిష్ టీవీ ఛైర్మన్ బై..బై! షేర్లు రయ్ రయ్..!
సాక్షి,ముంబై: డైరెక్ట్-టు-హోమ్ ఆపరేటర్ డిష్ టీవీ ఛైర్మన్ జవహర్ లాల్ గోయల్ కంపెనీ బోర్డు నుండి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని డిష్ టీవీ సోమవారంనాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ అతిపెద్ద వాటాదారు యెస్ బ్యాంక్.. ఛైర్మన్ జవహర్ లాల్ గోయెల్ నేతృత్వంలోని ప్రమోటర్ కుటుంబం డిష్ టీవీ బోర్డు ప్రాతినిధ్యంపై వివాదం, లీగల్ ఫైట్ నేపథ్యంలో ఈ రాజీనామా చోటు చేసుకుంది. 24 శాతానికి పైగా వాటా ఉన్న వైబీఎల్ డిష్ టీవీ బోర్డుని పునర్నిర్మించాలని, గోయెల్‌తో పాటు మరికొందరు వ్యక్తులను తొలగించాలని ఒత్తిడి చేస్తోంది. ఈ నెల ప్రారంభంలో, యెస్ బ్యాంక్ ప్రతిపాదించిన ఏడుగురు స్వతంత్ర డైరెక్టర్లలో ముగ్గురిని నియమించడానికి డిష్ టీవీ అంగీకరించింది. మరోవైపు జూన్‌లో జరిగిన కంపెనీ అసాధారణ సాధారణ సమావేశంలో గోయల్‌ను మేనేజింగ్ డైరెక్టర్‌గా, అనిల్ కుమార్ దువాను కంపెనీ హోల్‌టైమ్ డైరెక్టర్‌గా పునః నియమించాలనే ప్రతిపాదనను 75 శాతం షేర్హోల్డర్లు తిరస్కరించారు. కాగా ఆగస్టు 30 నాటి కంపెనీ డిష్ టీవీ, రెగ్యులేటరీ ఫైలింగ్‌లో, ఛైర్మన్ జవహర్ లాల్ గోయెల్ సెప్టెంబర్ 26, 2022న జరగనున్న కంపెనీ ఏజీఎంలో పదవినుంచి వైదొలుగుతారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో డీష్ టీవీ షేరు సోమవారం 10శాతం లాభపడగా, మంగళవారం మరో 6శాతం ఎగిసి 17.80 వద్ద కొనసాగుతోంది. -
కేంద్రం బూస్ట్: దుమ్మురేపిన వొడాఫోన్ ఐడియా
సాక్షి,ముంబై: అప్పుల సంక్షోభం, ఇతర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న టెలికాం రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రభారీ ఊరట కల్పించిన నేపథ్యంలో గురువారం నాటి మార్కెట్లో టెలికాం షేర్లు భారీ లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో లాభాల పరంగా, వినియోగదారుల పరంగా బాగా వెనుకబడిన వొడాఫోన్ ఐడియా కు మళ్లీ జీవం వచ్చినట్టైంది. ఈ కంపెనీ షేర్లు 15 శాతం ఎగిసి అప్పర్ సర్క్యూట్ అయింది. అంతేకాదు గత 10 ట్రేడింగ్ రోజుల్లో స్టాక్ 72 శాతం పుంజుకోవడం విశేషం. టెలికాం రంగానికి సంబంధించి పలు నిర్మాణాత్మక సంస్కరణలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు బుధవారం టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించినసంగతి తెలిసిందే. ఏజీఆర్ బకాయిలపై నాలుగేళ్ల పాటు మారటోరియం విధించింది. ఏజీఆర్‌కు సంబంధించి ప్రస్తుతమున్న నిర్వచనం ఈ రంగంపై భారానికి ప్రధాన కారణమని పేర్కొన్న ఆయన ఏజీఆర్ నిర్వచనాన్ని హేతుబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ రంగంలో నూరు శాతం ఎఫ్‌డీఐలు అనుమతించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందనీ, టెలికాం రంగంలో ఆరోగ్యకరమైన పోటీ నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. చదవండి : టెలికాం రంగానికి కేంద్రం భారీ ఊరట కాగా ఎయిర్టెల్ జియో, వొడాఫోన్ ఐడియా మూడు ప్రైవేట్ రంగ సంస్థల ఉమ్మడి నికర రుణాలు రూ. 3.6 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. ఎడెల్వీస్ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం, వోడాఫోన్ ఐడియా స్పెక్ట్రం , ఏజీఆర్ బకాయిల విలువ .1.6 లక్షల కోట్లు. అంటే సంస్థ మొత్తం బకాయిల్లో 84 శాతం. బ్యాంకింగ్ రంగంలో వొడాఫోన్ ఐడియాకు మొత్తం రూ . 29,000 కోట్ల రుణాలుండగా, దేశంలోని అతిపెద్ద బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటా రూ .11,000 కోట్లు. దీంతోపాటు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి ఇతర మధ్యతరహా బ్యాంకుల రుణాలున్నాయి. -
ఎఫ్ఐఐల ఫేవరెట్ షేర్ల స్పీడ్
ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో దేశీ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) భారీగా పెట్టుబడులు కుమ్మరించారు. క్యూ2(జులై- సెప్టెంబర్)లో రూ. 35,000 కోట్లకుపైగా ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేశారు. తద్వారా దాదాపు 400 కంపెనీలలో వాటాలను పెంచుకున్నారు. వీటిలో 100 కంపెనీల షేర్లు మార్చి నుంచి చూస్తే 100 శాతంపైగా ర్యాలీ చేశాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చిలో స్టాక్ మార్కెట్లు 52 వారాల కనిష్టాలను తాకిన సంగతి తెలిసిందే. దీంతో పలు కౌంటర్లు ఏడాది కనిష్టాలకు చేరాయి. ఈ స్థాయిల నుంచీ పలు షేర్లు లాభాల దౌడు తీస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. మార్చి నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వాటాలు పెంచుకున్న సుమారు 385 కంపెనీలలో మార్చి నుంచి చూస్తే.. 107 స్టాక్స్ 100-500 శాతం మధ్యలో జంప్ చేశాయి. మార్చి కనిష్టాల నుంచి రెట్టింపైన కౌంటర్లలో చాలా వరకూ మిడ్, స్మాల్ క్యాప్ విభాగం నుంచే చోటు చేసుకోవడం గమనార్హం. జాబితాలో ఎంఅండ్ఎం, ఇమామీ, ప్రకాష్ ఇండస్ట్రీస్, జిందాల్ పాలీ, అదానీ గ్యాస్, గ్లెన్ మార్క్ ఫార్మా, అదానీ గ్రీన్, అఫ్లే ఇండియా, డిక్సన్ టెక్నాలజీస్ తదితరాలున్నాయి. గత రెండేళ్లుగా మిడ్, స్మాల్ క్యాప్స్ అక్కడక్కడే అన్నట్లుగా నిలిచిపోవడంతో కొద్ది రోజులుగా ర్యాలీ బాట పట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు పటిష్ట యాజమాన్యం, నాణ్యమైన బిజినెస్ వంటి అంశాలు కొన్ని కౌంటర్లకు జోష్ నిస్తున్నట్లు చెప్పారు. లార్జ్ క్యాప్స్ కంటే రానున్న ఏడాది కాలంలో లార్జ్ క్యాప్స్ ను మించి దూకుడు చూపగల మిడ్, స్మాల్ క్యాప్స్ వైపు ఎఫ్ఐఐలు చూపు సారించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. షేర్ల రిటర్నులకు ప్రాధాన్యం ఇవ్వకుండా గుర్తింపు కలిగిన, పటిష్ట వ్యాపార అవకాశాలు అధికంగాగల కంపెనీలను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలియజేశారు. నిజానికి 2018 జనవరి నుంచీ మిడ్, స్మాల్ క్యాప్స్ వెనకడుగులో నిలిచిపోయినట్లు మార్కెట్ విశ్లేషకులు ఈ సందర్భంగా వివరించారు. అయితే ఇటీవల బిజినెస్ లు మందగించిన లార్జ్ క్యాప్ కంపెనీల నుంచి పెద్ద కంపెనీలుగా ఆవిర్భవించగల మిడ్ క్యాప్స్ వైపు ఎఫ్ఐఐలు చూపును మరల్చినట్లు తెలియజేశారు. భారీ లాభాలలో ఎఫ్ఐఐలు ఇన్వెస్ట్ చేసిన కొన్ని కంపెనీలు, షేర్ల జోరు తీరు ఎలా ఉన్నదంటే.. ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లో ఎఫ్ఐఐల వాటా క్యూ2లో 5.2 శాతం నుంచి 6.99 శాతానికి ఎగసింది. ఈ షేరు 544 శాతం ర్యాలీ చేసింది. ఈ బాటలో సీజీ పవర్లో వాటా 0.23 శాతం నుంచి 0.3 శాతానికి పెరిగింది. షేరు 459 శాతం దూసుకెళ్లింది. ఆర్తి డ్రగ్స్ లో వాటా 1.82 శాతం నుంచి 2.19 శాతానికి బలపడగా.. షేరు 408 శాతం జంప్ చేసింది. ఇదే విధంగా అదానీ గ్రీన్‌లో ఎఫ్ఐఐల వాటా 21.52 శాతం నుంచి 22.43 శాతానికి చేరగా.. షేరు 405 శాతం పురోగమించింది. లారస్ ల్యాబ్స్ లో వాటా 4.68 శాతంమేర పెరిగి 20.74 శాతాన్ని తాకింది. షేరు 400 శాతం లాభపడింది. ఇతర కౌంటర్లలో ఇంటలెక్ట్ డిజైన్, మాస్టెక్, టాటా కమ్యూనికేషన్స్, గ్లోబస్ స్పిరిట్స్, మార్క్ సన్స్ ఫార్మా, మజెస్కో 330-254 శాతం మధ్య ఎగశాయి. వీటిలో ఎఫ్ఐఐల వాటా 1.4-0.2 శాతం మధ్య పెరిగింది. -
అదానీకి ఎగ్జిట్ పోల్స్ కిక్
సాక్షి, ముంబై: కేంద్రంలో ఎన్డీఏ సర్కారుకు స్పష్టమైన మెజారిటీ సాధించనుందున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అదానీ గ్రూపు షేర్లకు మంచి జోష్‌నిస్తున్నాయి. నరేంద్ర మోదీ మరోసారి స్పష్టమైన మెజార్టీతో ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో సోమవారం అదాని గ్రూప్ కంపెనీలు షేర్లు 20 శాతం లాభపడుతున్నాయి. ప్రధానంగా అదానీ ఎంటర్ ప్రైజెస్, పవర్, గ్యాస్ అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్స్, అదానీ పోర్ట్స్ షేర్లు భారీ లాభాలతో దూసుకు పోతున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ ఇంట్రాడేలో 21శాతం పెరిగి రూ.144.30ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. దీంతో టాప్ విన్నర్‌గా ట్రేడ్ అవుతోంది. అదానీ గ్రీన్ ఎనర్జీ : ఇంట్రాడేలో 17 శాతం పెరిగి రూ.144.30ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అదానీ ట్రాన్స్మిషన్స్: ఇంట్రాడేలో 10శాతం పెరిగి రూ.226.50ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అదానీ పవర్: ఇంట్రాడేలో 16శాతం పెరిగి రూ.47.25ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అలాగే అదానీ గ్యాస్ 12 శాతం ఎగిసింది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల హైజంప్ చేశాయి. ఆరంభ లాభాలనుంచి మరింత ఎగిసి సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా ఎగిసింది. తద్వారా 39 వేల స్థాయికి చేరింది. అలాగే నిఫ్టీ 300 పాయింట్లకు పైగా జంప్ చేసి 11800 స్థాయికి చేరువలో ఉంది. -
ఆటో షేర్ల ర్యాలీ
♦ సెన్సెక్స్ 109 పాయింట్లు అప్ ♦ 8,800 పైన ముగిసిన నిఫ్టీ ముంబై: ఒక రోజు విరామం అనంతరం మార్కెట్ అప్‌ట్రెండ్ పునర్ప్రారంభమయ్యింది. ఆటో మొబైల్ షేర్లు ర్యాలీ జరపడంతో శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 109 పాయింట్లు పెరిగి 16 నెలల గరిష్టస్థాయి 28,532 పాయింట్ల వద్ద ముగిసింది. గత రెండు ట్రేడింగ్ సెషన్ల నుంచి 8,800 స్థాయిపైన స్థిరపడలేకపోతున్న ఎన్ఎస్ఈ నిఫ్టీ ఎట్టకేలకు ఆ శిఖరంపైన పాగా వేసింది. 35 పాయింట్లు ఎగిసి 8,810 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారంలో సెన్సెక్స్ 750 పాయింట్లు, నిఫ్టీ 237 పాయింట్ల చొప్పున పెరిగాయని, గత 2 నెలల్లో ఒకేవారంలో సూచీలు ఇంతగా పెరగడం ఇదే ప్రధమమని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ తెలిపారు. అమెరికా జాబ్స్ డేటాతో జాగ్రత్త అమెరికాలో జాబ్స్ డేటా వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించడంతో ర్యాలీ పరిమితంగానే వుందని విశ్లేషకులు చెప్పారు. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై ప్రభావం చూపే జాబ్స్ డేటా మన మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడింది. ఆగస్టు నెలలో కొత్తగా 1,80,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నది మార్కెట్ అంచనా కాగా, 1,60,000 మందికి మాత్రమే ఉపాధి లభించినట్లు తాజా గణాంకాలు తెలుపుతున్నాయి. దాంతో రేట్లు ఈ సెప్టెంబర్ సమావేశంలో రేట్లు పెరగకపోవొచ్చన్న అంచనాలు ఏర్పడటంతో యూరప్ మార్కెట్లు 2 శాతం పెరిగాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా మార్కెట్ స్వల్ప పెరుగుదలతో ట్రేడవుతోంది. ఆటో మొబైల్ షేర్లలో మారుతి సుజుకి అధికంగా 2 శాతం ఎగిసి రూ. 5,158 వద్ద ముగిసింది. -
లాభాల బూమ్‌తో హెచ్‌సీఎల్ షేర్లు జంప్
దేశీయ నాలుగో అతిపెద్ద ఐటీ సర్వీసుల ఎగుమతిదారు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అన్ని కొలమానాలో విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. బుధవారం ప్రకటించిన 2016-17 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసిక లాభాల్లో కంపెనీ 6 శాతం ఎగిసి, రూ.2,047 కోట్లగా నమోదుచేసింది. రెవెన్యూలు సైతం 6.3 శాతం పెంచుకుని రూ.11,336 కోట్లగా రికార్డు చేసింది. అయితే హెచ్‌సీఎల్ కేవలం రూ.1,860 కోట్ల లాభాలను మాత్రమే ఆర్జిస్తుందని విశ్లేషకులు అంచనావేశారు. విశ్లేషకుల అంచనాలు అధిగమించి హెచ్‌సీఎల్ లాభాలు రికార్డు చేయడంతో, నేటి ట్రేడింగ్‌లో ఆ కంపెనీ షేర్లు మెరుపులు మెరిపిస్తున్నాయి. 7 శాతం మేర దూసుకెళ్తున్నాయి. డాలర్ రెవెన్యూలోనూ దేశీయ టాప్ ఐటీ కంపెనీలో కెల్లా హెచ్‌సీఎల్ కంపెనీనే మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ఈ కంపెనీ డాలర్ రెవెన్యూలు 6.5 శాతం ఎగిసి, క్వార్టర్ ఆన్ క్వార్టర్‌కు రూ. 1,691 మిలియన్ డాలర్లుగా రికార్డు అయ్యాయి. రెవెన్యూ, మార్జిన్ గైడెన్స్‌తో ఆర్థిక సంవత్సరం 2017లో కంపెనీ వృద్ధి అంచనాలను పెంచేసింది. స్థిరమైన కరెన్సీతో రెవెన్యూ వృద్ది 12-14 శాతం ఉంటుందని హెచ్‌సీఎల్ టెక్ అంచనావేస్తోంది. ఈ వృద్ధి డాలర్లో 11.2 శాతం నుంచి 13.2 శాతం ఉంటుందని పేర్కొంది. ఆపరేటింగ్ మార్జిన్లు 19.5 శాతం నుంచి 20.5 శాతం మధ్యలో ఎగుస్తాయని హెచ్‌సీఎల్ తెలిపింది. మెరుగైన ఆర్థిక ఫలితాలతో హెచ్‌సీఎల్ ఒక్క షేరుకు 6 రూపాయల డివిడెంట్ ప్రకటించింది. ఆగస్టు 19 నుంచి ఈ డివిడెంట్ చెల్లించనున్నట్టు తెలిపింది. -
బజాజ్ ఫినాన్స్ బోనస్ బొనాంజా
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ బజాజ్ ఫినాన్స్ ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. జూన్ త్రైమాసికంలో అంచనాలకు మించి ఫలితాలను నమోదు చేసింది. మంగళవారం కంపెనీ ప్రకటించిన క్యూ 1 ఫలితాల్లో 54 శాతం వృద్ధితో రూ.424 కోట్ల నికర లభాలను ఆర్జించింది. ఆదాయంలో 38 శాతం వృద్థితో రూ. 2,166 కోట్ల నికర ఆదాయాన్ని సాధించింది. మెరుగైన ఫలితాలను ప్రకటించిన బజాజ్ ఫినాన్స్ బోర్డ్ 1:1 బోనస్ ప్రకటించింది. అలాగే 10రూ. గా ఫేస్ వాల్యూ వున్న షేరును విడగొట్టి (స్ప్లిట్) 2 రూ.నిర్ణయించింది. అంటే ప్రతీ షేరుకు అయిదు షేర్లు అదనంగా వాటాదారులకు అందించనుంది. దీంతో మార్కెట్లో ఈ కంపెనీ షేరు లాభాల్లో దూసుకుపోతోంది. ఈ బంపర్ బొనాంజాతో దాదాపు 5 శాతం లాభాలతో ఫ్లాట్ గా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లో ప్రధాన విజేతగా నిలిచింది. కాగా పుణేకు చెందిన బజాజ్ ఫినాన్స్ రూ.373కోట్ల నికర లాభాలను, 2039కోట్ల నికర ఆదాయన్ని నమోదు చేస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు. ఈ అంచనాలకు భిన్నంగా బజాజ్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడం విశేషం. -
బంపర్ బొనాంజాతో దూసుకుపోతున్న ఐటీసీ
ముంబై : ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ఐటీసీ సోమవారం నాటి మార్కెట్ లో దూసుకుపోతోంది. 12 వరుస త్రైమాసికాల క్షీణత తర్వాత ఈసారి లాభాలను నమోదు చేయడంతో ఐటీసీ షేర్లు మార్కెట్లో జోరుగా ట్రేడవుతున్నాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక లాభాల్లో 5.67 శాతం వృద్ధిని నమోదు చేసింది. శుక్రవారం ఐటీసీ క్యూ 4 ఫలితాల్లో రూ 10, 060 కోట్ల అమ్మకాలతో దాదాపు రూ 2,500 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.2,361.18 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర అమ్మకాలు 9.51 శాతం పెరిగి రూ.10,062.38 కోట్లకు చేరాయని ఐటీసీ బీఎస్ఈకి వెల్లడించింది. 2014-15 ఇదే త్రైమాసికంలో రూ.9,188 కోట్ల అమ్మకాలను నమోదు చేసింది. బోనస్: మెరుగైన ఫలితాల నేపథ్యంలో 1:2 నిష్పత్తిలో (ప్రతి రెండు షేర్లు ఒక షేరు ) బోనస్ షేర్లను ప్రకటించింది. బోనస్ షేర్ల జారీతో పాటు ఒక రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో సాధారణ షేరుకు రూ.8.50 డివిడెండ్‌ను(షేరుకు రూ .2 ప్రత్యేక డివిడెండ్ సహా ) ఇచ్చేందుకు బోర్డు సమ్మతి తెలిపింది. ఫలితంగా బీఎస్ఈలో సంస్థ షేరు పరుగులు తీస్తోంది. . బుల్లిష్ ట్రెండ్: ఐటీసీ లాభాలపై మార్కెట్ ఎనలిస్టులు, అంచనా సంస్థలు పాజిటివ్ గా స్పందించాయి. రాబోయే 2017సం.రానికి ఐటీసీ మరింత పుంజుకుని రెండంకెల ఆదాయ వృద్ధిని నమోదు చేస్తుందని క్రెడిట్ స్యూజ్ కంపెనీ భరోసా ఇస్తోంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఎబిట్(ఈబీఐటి) 9 శాతం ఆదాయాన్ని సాధించి అగ్రస్థానంలో నిలస్తుందని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.అటు డ్యుయిష్ బ్యాంక్ సహా ట్రేడింగ్ సంస్థలన్నీ ఐటీసీ షేరు ధరలు మరింత పెరగనున్నాయని అంచనావేశాయి. సాధారణ వర్షపాతం అంచనాలతో ఎఫ్ ఎంసీజీ వ్యాపారాన్ని జోరు పెంచిందనా అంచనావేస్తున్నారు. ఒక్కో షేరు 400 రూ. లను చేరుతుందని భావిస్తున్నారు. కాగా సోమవారం ఐటిసి 5 అధిక శాతం పెరిగి రూ 347 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీలో అత్యధిక లాభాలతో మార్కెట్ ను లీడ్ చేస్తోంది. ఐటీసీ వ్యాపారంలో ప్రధానమైన సిగరెట్లపై10 శాతం ఎక్సైజ్ సుంకం వృద్ధితో కంపెనీ సిగరెట్ ధరలను 10-13 శాతం పెంచిందని షేర్ ఖాన్ తెలిపింది. ఐటీసీ అగ్రి వ్యాపారం రూ 1,800 కోట్లకు పెరగ్గా, కంపెనీ హోటళ్లు / పేపర్ వ్యాపారం 4.8 శాతం పెరిగింది.