న్యూఢిల్లీ: టాటా గ్రూప్ దిగ్గజం టైటన్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్-డిసెంబర్ (క్యూ3) లో నికర లాభం 10 శాతం క్షీణించి రూ. 913 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 1,012 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 10,094 కోట్ల నుంచి రూ. 11,698 కోట్లకు బలపడింది.
మొత్తం వ్యయాలు సైతం రూ. 8,750 కోట్ల నుంచి రూ. 10,454 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో జ్యువెలరీ విభాగం 11 శాతం పుంజుకుని రూ. 9,518 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ బాటలో వాచీలు, ఇతర విభాగం అమ్మకాలు సైతం 15 శాతం ఎగసి రూ. 811 కోట్లకు చేరాయి. ఐ కేర్ అమ్మకాలు 12 శాతం అధికమై రూ. 174 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో గురువారం నీరసించిన శుక్రవారం టైటాన్ షేర్లు దూసుకుపోయాయి. భారీగా లాభాలతో టాప్ గెయినర్‌గా దాదాపు 7 శాతంఎగిసి రూ. 2458 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment