లాభాల బూమ్తో హెచ్సీఎల్ షేర్లు జంప్
దేశీయ నాలుగో అతిపెద్ద ఐటీ సర్వీసుల ఎగుమతిదారు హెచ్సీఎల్ టెక్నాలజీస్ అన్ని కొలమానాలో విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. బుధవారం ప్రకటించిన 2016-17 జూన్తో ముగిసిన తొలి త్రైమాసిక లాభాల్లో కంపెనీ 6 శాతం ఎగిసి, రూ.2,047 కోట్లగా నమోదుచేసింది. రెవెన్యూలు సైతం 6.3 శాతం పెంచుకుని రూ.11,336 కోట్లగా రికార్డు చేసింది. అయితే హెచ్సీఎల్ కేవలం రూ.1,860 కోట్ల లాభాలను మాత్రమే ఆర్జిస్తుందని విశ్లేషకులు అంచనావేశారు. విశ్లేషకుల అంచనాలు అధిగమించి హెచ్సీఎల్ లాభాలు రికార్డు చేయడంతో, నేటి ట్రేడింగ్లో ఆ కంపెనీ షేర్లు మెరుపులు మెరిపిస్తున్నాయి. 7 శాతం మేర దూసుకెళ్తున్నాయి.
డాలర్ రెవెన్యూలోనూ దేశీయ టాప్ ఐటీ కంపెనీలో కెల్లా హెచ్సీఎల్ కంపెనీనే మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ఈ కంపెనీ డాలర్ రెవెన్యూలు 6.5 శాతం ఎగిసి, క్వార్టర్ ఆన్ క్వార్టర్కు రూ. 1,691 మిలియన్ డాలర్లుగా రికార్డు అయ్యాయి. రెవెన్యూ, మార్జిన్ గైడెన్స్తో ఆర్థిక సంవత్సరం 2017లో కంపెనీ వృద్ధి అంచనాలను పెంచేసింది. స్థిరమైన కరెన్సీతో రెవెన్యూ వృద్ది 12-14 శాతం ఉంటుందని హెచ్సీఎల్ టెక్ అంచనావేస్తోంది. ఈ వృద్ధి డాలర్లో 11.2 శాతం నుంచి 13.2 శాతం ఉంటుందని పేర్కొంది. ఆపరేటింగ్ మార్జిన్లు 19.5 శాతం నుంచి 20.5 శాతం మధ్యలో ఎగుస్తాయని హెచ్సీఎల్ తెలిపింది. మెరుగైన ఆర్థిక ఫలితాలతో హెచ్సీఎల్ ఒక్క షేరుకు 6 రూపాయల డివిడెంట్ ప్రకటించింది. ఆగస్టు 19 నుంచి ఈ డివిడెంట్ చెల్లించనున్నట్టు తెలిపింది.