Q1 profit
-
బ్యాంక్ ఆఫ్ ఇండియా మెరుగైన పనితీరు.. భారీగా పెరిగిన లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో తన పనితీరును గణనీయంగా మెరుగుపరుచుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం భారీగా పెరిగి రూ.1,551 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.561 కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం సైతం రూ.11,124 కోట్ల నుంచి రూ.15,821 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ.14,359 కోట్లుగా ఉంది. స్థూల మొండి బకాయిలు జూన్ చివరికి 6.67%కి తగ్గాయి. నికర ఎన్పీఏలు 1.65%కి తగ్గాయి. ఎన్పీఏలకు కేటాయింపులు తాజాగా ముగిసిన త్రైమాసికంలో ఇవి రూ.777 కోట్లకు పరిమితమయ్యాయి. -
ఝన్‌ఝన్‌వాలా జాక్‌పాట్:టైటన్ మెరిసెన్
న్యూఢిల్లీ: ఆభరణాలు, వాచ్‌లు, కళ్లద్దాలు తదితర వేరబుల్ ఉత్పత్తుల విక్రయంలోని ప్రముఖ కంపెనీ టైటాన్ జూన్ త్రైమాసికంలో పనితీరు పరంగా మెప్పించింది.దేశంలోని అతిపెద్ద బ్రాండెడ్ ఆభరణాల తయారీదారు అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 13 రెట్లు పెరిగి రూ.790 కోట్లుగా నమోదైంది. ఆదాయం కూడా మూడు రెట్ల వృద్ధితో రూ.9,487 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.18 కోట్లు, ఆదాయం రూ.3,519 కోట్ల చొప్పున ఉన్నాయి. జ్యుయలరీ విభాగం ఆదాయం రూ.8,351 కోట్లుగా ఉంది. ఇది అంతక్రితం ఏడాది ఇదే కాలానికి రూ.3,050 కోట్లుగా ఉంది. వాచ్‌లు, వేరబుల్ కేటగిరీ ఆదాయం రూ.293 కోట్ల నుంచి రూ.786 కోట్లకు వృద్ధి చెందింది. కళ్లద్దాల విభాగం నుంచి ఆదాయం రూ.183 కోట్లకు పెరిగింది. అంతక్రితం రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ మొదటి త్రైమాసికంపై కరోనా మహమ్మారి ప్రభావం ఉందని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌లో సాధారణ వ్యాపార కార్యకలాపాలు ఉండడం మెరుగైన పనితీరుకు దోహదపడినట్టు కంపెనీ తెలిపింది. కాగా Trendlyne ప్రకారం, జూన్ 30 నాటికి ఝన్‌ఝన్‌వాలా, ఆయన భార్య రేఖ టైటాన్ ఎన్ఎస్ఇలో 0.38 శాతం 5.05 శాతం వాటాను కలిగి ఉన్నారు, దీని విలువ శుక్రవారం నాటికి రూ. 10,937 కోట్లు కావడం విశేషం. -
తగ్గేదెలే! ఆపిల్ ఇండియా దూకుడు
న్యూయార్క్: ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఇండియా ఆదాయం దాదాపు రెండింత లైంది. జూన్ 2022తో ముగిసిన మూడవ త్రైమాసికంలో 83 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. గతఏడాదితో పోలిస్తే 2శాతం వృద్ధితో రికార్డు స్థాయిలో 83 బిలియన్ డాలర్ల ఆదాయ సాధించినట్లు ఆపిల్ తెలిపింది. జూన్ 25తో ముగిసిన 2022 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలను ఆపిల్ గురువారం వెల్లడించింది. తాము అంచనా వేసిన దానికంటే ఎక్కువ ఆదాయాన్ని సాధించామని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. సరఫరా పరిమితులు, బలమైన విదేశీ మారకపు సవాళ్లు, రష్యా ప్రభావం ఉన్నప్పటికీ ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను సాధించామని చెప్పారు. అలాగే అమెరికా, యూరప్, మిగిలిన ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జూన్ త్రైమాసికంలో రికార్డు నెలకొల్పామన్నారు. బ్రెజిల్, ఇండోనేషియా, వియత్నాంలో రెండంకెల వృద్ధిని, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో జూన్ త్రైమాసిక ఆదాయ రికార్డు సృష్టించామని తెలిపారు. ఈ క్రమంలో ఇండియాలో దాదాపు రెట్టింపు ఆదాయాన్ని సాధించామని కుక్ వెల్లడించారు. జూన్ త్రైమాసికంలో కంపెనీ సేవల ఆదాయం 19.6 బిలియన్ల డాలర్ల రికార్డు ఆదాయం నమోదు చేశామని యాపిల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లూకా మిస్త్రి తెలిపారు. మైక్రో ఎకానమీ కష్టాలు, రష్యాలో తమ వ్యాపారం లాంటి ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ 12 శాతం ఎగిసినట్టు వెల్లడించారు. -
ముత్తూట్ ఫైనాన్స్ లాభం అప్
కొచ్చి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ముత్తూట్ ఫైనాన్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 14 శాతం ఎగసి రూ. 979 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 858 కోట్లు మాత్రమే ఆర్జించింది. గోల్డ్‌లోన్ విభాగం నికర లాభం 16 శాతం వృద్ధితో రూ. 971 కోట్లను తాకింది. నిర్వహణలోని స్థూల రుణ ఆస్తులు(ఏయూఎం) 25 శాతం బలపడి రూ. 58,135 కోట్లకు చేరాయి. మొత్తం ఆదాయం సైతం 14 శాతం పుంజుకుని రూ. 2,963 కోట్లకు చేరింది. -
మెప్పించిన ఇన్ఫీ!
బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఆశావహ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (2019–20, క్యూ1) కంపెనీ రూ.3,802 కోట్ల కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.3,612 కోట్లుగా నమోదైంది. ఇక మొత్తం ఆదాయం కూడా 13.9 శాతం ఎగబాకి రూ.19,128 కోట్ల నుంచి రూ.21,803 కోట్లకు చేరింది. మార్కెట్ విశ్లేషకులు కంపెనీ క్యూ1లో రూ. 3,702 కోట్ల నికర లాభాన్ని, రూ.21,776 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా వేశారు. దీనికి మించి ఫలితాలు వెలువడ్డాయి. సీక్వెన్షియల్‌గా ఇలా... గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (2018–19, క్యూ4) నికర లాభం రూ.4,078 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా కంపెనీ లాభంలో 6.8% తగ్గుదల నమోదైంది. ఆదాయం మాత్రం 1.2 శాతం పెరిగింది. గతేడాది క్యూ4లో రూ.21,539 కోట్లుగా ఉంది. గైడెన్స్ అప్... ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయ వృద్ధి అంచనాను (గైడెన్స్) ఇన్ఫీ పెంచింది. గడిచిన క్వార్టర్ ఫలితాల సందర్భంగా ఈ ఏడాది ఆదాయ వృద్ధి 7.5–9.5% ఉండొచ్చని అంచనా వేయగా.. దీన్ని ఇప్పుడు 8.5–10 శాతానికి పెంచింది. ఇక నిర్వహణ మార్జిన్ గైడెన్స్ 21–23 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ► డాలర్ల రూపంలో కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన క్యూ1లో 534 మిలియన్ డాలర్ల నుంచి 546 మిలియన్ డాలర్లకు పెరిగింది. 2.3 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 2.83 బిలియన్ డాలర్ల నుంచి 3.13 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. 12.4 శాతం వృద్ధి సాధించింది. ► క్యూ1లో 2.7 బిలియన్ డాలర్ల విలువైన భారీస్థాయి కాంట్రాక్టులను ఇన్ఫీ దక్కించుకుంది. 100 మిలియన్ డాలర్ల కేటగిరీలో రెండు కాంట్రాక్టులు, 10 మిలియన్ డాలర్లకు మించిన విభాగంలో ఆరు కాంట్రాక్టులు లభించాయి. ► కంపెనీకి డిజిటల్ విభాగం నుంచి 1,119 మిలియన్ డాలర్ల ఆదాయం క్యూ1లో సమకూరింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 41.9 శాతం ఎగసింది. కంపెనీ మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 35.7 శాతానికి చేరింది. ► ఇంధనం–యుటిలిటీస్ విభాగం ఆదాయం 4.7 శాతం(సీక్వెన్షియల్), కమ్యూనికేషన్ 4.6 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ► ఇక ప్రాంతాలవారీగా చూస్తే... ఉత్తర అమెరికా నుంచి ఆదాయం సీక్వెన్షియల్‌గా 3 శాతం వృద్ధి చెందింది. మిగత దేశాల నుంచి ఆదాయంలో 2.3 శాతం వృద్ధి నమోదైంది. ► కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాది జూన్ చివరినాటికి 2,29,029కి చేరింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి (2018–19, క్యూ4) ఈ సంఖ్య 2,28,123 మాత్రమే. దీనిప్రకారం చూస్తే నికరంగా 906 మంది ఉద్యోగులు మాత్రమే జతయ్యారు. ఇక ఉద్యోగుల వలసల రేటు(అట్రిషన్) క్యూ1లో 23.4 శాతానికి పెరిగింది. క్యూ4లో ఇది 20.4 శాతం మాత్రమే. ► డేటా ప్రిపరేషన్ సాఫ్ట్వేర్ సేవల అనుబంధ సంస్థ ట్రైఫాక్టాలో అదనంగా 6 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో మొత్తం పెట్టుబడి 10 మిలియన్ డాలర్లకు చేరుతుందని ఇన్ఫీ పేర్కొంది. ఇన్ఫీ షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో 1% లాభపడి రూ.727 వద్ద ముగిసింది. ట్రేడింగ్ మగిశాక ఫలితాలను ప్రకటించింది. కాగా, అమెరికా నాస్డాక్ ఎక్సే్ఛంజ్‌లో ఇన్ఫీ షేరు(ఏడీఆర్) శుక్రవారం కడపటి సమాచారం మేరకు 6 శాతానికిపైగా లాభాలతో ట్రేడవుతోంది. ఇక లాభాల్లో 85% ఇన్వెస్టర్లకే.. ఇన్వెస్టర్లకు మరింత విలువ జోడించేందుకు తమ నిధుల కేటాయింపు ప్రణాళికను మారుస్తున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లకుగాను కంపెనీ వార్షిక నికర లాభాల్లో (ఫ్రీ క్యాష్‌ఫ్లో) 85 శాతం వరకూ తిరిగి ఇన్వెస్టర్లకు పంచేయాలని నిర్ణయించినట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) నీలాంజన్ రాయ్ తెలిపారు. ప్రస్తుత 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడున్నట్లే డివిడెండ్లు లేదా ప్రత్యేక డివిడెండ్లు లేదా షేర్ల బైబ్యాక్‌ల రూపంలో ఇది ఉంటుందన్నారు. కంపెనీ బ్యాలెన్స్ షీట్ చాలా పటిష్టంగా ఉందని, ఇప్పటికీ తమవద్ద 3.5 బిలియన్ డాలర్ల నగదు నిల్వలున్నాయని రాయ్ వివరించారు. ఇప్పటివరకూ ఏటా 70 శాతం వరకూ ఫ్రీ క్యాష్‌ను ఇన్వెస్టర్లకు తిరిగి ఇచ్చే విధానాన్ని ఇన్ఫీ అనుసరిస్తోంది. కాగా, రూ.8,260 కోట్ల షేర్ల బైబ్యాక్ కొనసాగుతోందని ఇప్పటివరకూ రూ.5,934 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుత త్రైమాసికంలోనూ బైబ్యాక్ కొనసాగింపునకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. కాగా, తాజా బడ్జెట్లో 20 శాతం బైబ్యాక్ పన్ను విధించిన నేపథ్యంలో భవిష్యత్తులో కంపెనీల షేర్ల బైబ్యాక్‌లకు అడ్డుకట్ట పడొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఇన్వెస్టర్లకు మరింతగా నగదు నిల్వలను పంచే ప్రణాళికను ఇన్ఫీ ప్రకటించడం గమనార్హం. ‘ఈ ఆర్థిక సంవత్సరాన్ని చాలా పటిష్టమైన ఫలితాలతో మేం బోణీ చేశాం. డాలర్ల రూపంలో ఆదాయం 12.4 శాతం ఎగబాకడం, ముఖ్యంగా డిజిటల్ విభాగం నుంచి 41.9 శాతం ఆదాయ వృద్ధి నమోదు కావడం శుభపరిణామం. క్లయింట్లతో మెరుగైన సంబంధాలు, వారిపై మరింత దృష్టిపెట్టడం, తదనుగుణంగా మేం చేస్తున్న పెట్టుబడులే మెరుగైన ఫలితాలకు తోడ్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆదాయ గైడెన్స్‌ను కూడా పెంచాం’. – సలీల్ పరేఖ్, ఇన్ఫీ సీఈఓ, ఎండీ -
భారీగా పడిపోయిన భారతీ ఎయిర్టెల్
ముంబై : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ క్వార్టర్ ఫలితాల్లో భారీగా పడిపోయింది. నేడు ప్రకటించిన జూన్ క్వార్టర్ ఫలితాల్లో భారతీ ఎయిర్టెల్ లాభాలు 74 శాతం క్షీణించి రూ.97.30 కోట్లగా రికార్డయ్యాయి. ఈ టెలికాం దిగ్గజం గతేడాది ఇదే క్వార్టర్లో రూ.367.30 కోట్ల లాభాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ క్వార్టర్లో భారతీ ఎయిర్టెల్ రూ.479 కోట్ల నికర నష్టాలను నమోదు చేస్తుందని తెలిసింది. కానీ నికర నష్టాల బాధ నుంచి ఎయిర్టెల్ తప్పించుకుంది. కానీ కంపెనీ లాభాలు మాత్రం భారీగానే దెబ్బకొట్టి, బాగా క్షీణించాయి. ఈ క్వార్టర్లో కంపెనీ కన్సాలిడేటెడ్ రెవెన్యూలు రూ.20,080 కోట్లకు పడిపోయాయని ప్రకటించింది. ఇవి గతేడాది ఇదే క్వార్టర్లో రూ.21,958.10 కోట్లగా ఉన్నట్టు తెలిపింది. కానీ 2019 ఆర్థిక సంవత్సరం క్యూ1లో స్టాండలోన్ బేసిస్‌లో కంపెనీ రూ.1,457.20 కోట్ల నికర నష్టాలను నమోదు చేసిందని తన ఫలితాల ప్రకటనలో పేర్కొంది. కన్సాలిడేటెడ్ మొబైల్ డేటా ట్రాఫిక్ ఈ క్వార్టర్లో 2,236 బిలియన్ ఎంబీగా ఉన్నట్టు కంపెనీ చెప్పింది. ఏడాది ఏడాదికి ఇది 328 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు తెలిపింది. ఆపరేషనల్ వైపు, ఈబీఐటీడీఏ లు సీక్వెన్షియల్‌గా 3 శాతం తగ్గి రూ.6,837 కోట్లగా ఉన్నాయి. దేశీయ వైర్లెస్ వ్యాపారాలు ఈ క్వార్టర్లో సీక్వెన్షియల్‌గా 1 శాతం పెరిగి రూ.10,480 కోట్లగా రికార్డయ్యాయి. ఒక్కో యూజర్ సగటు రెవెన్యూ జూన్ క్వార్టర్లో రూ.105గా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. గత క్వార్టర్లో ఇది రూ.116గా ఉంది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ షేర్లు 1.63 శాతం పెరిగి రూ.357.60గా నమోదయ్యాయి. -
దుమ్మురేపిన జుబిలంట్ ఫుడ్స్
న్యూఢిల్లీ: డామినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ పేరుతో రిటైల్ స్టోర్లను నిర్వహించే జుబిలంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్ జూన్ త్రైమాసికం ఫలితాల్లో అదరగొట్టింది. స్టోర్ల వారీ విక్రయాల్లో మంచి వృద్ధి ఉండడంతో లాభం మూడు రెట్లు దూసుకుపోయి రూ.74.67 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన లాభం కేలం రూ.23.84 కోట్లు. ప్రస్తుత స్టోర్ల వారీగా అమ్మకాల్లో వృద్ధి 25.9 శాతంగా ఉండడమే ఈ స్థాయి లాభాలకు దోహదపడినట్టు కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం సైతం 26 శాతం వృద్ధితో రూ.681 కోట్ల నుంచి రూ.862 కోట్లకు చేరింది. ‘‘అద్భుతమైన ఉత్పత్తులు, డబ్బుకు తగ్గ విలువను అందించడం, డిజిటల్ తోడ్పాటు వల్లే డామినోస్ విక్రయాల్లో బలమైన వృద్ధి సాధ్యమైంది. దీనికితోడు డంకిన్ డోనట్స్ విభాగాన్ని ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బ్రేక్ ఈవెన్ (లాభ, నష్ట రహిత స్థితి) దశకు తీసుకురావడంపై దృష్టి పెట్టినందున లాభాల వృద్ధి కొనసాగుతుంది’’ అని జుబిలంట్ ఫుడ్స్ చైర్మన్ శ్యామ్ ఎస్ భర్తియా, కో చైర్మన్ హరి ఎస్ భర్తియా తెలిపారు. ప్రస్తుతం కంపెనీ 1,144 డామినోస్ పిజ్జా అవుట్లెట్లను, 37 డంకిన్డోనట్ అవుట్లెట్లను నిర్వహిస్తోంది. జూన్ త్రైమాసికంలో కొత్తగా కంపెనీ 13 డామినోస్ పిజ్జా స్టోర్లను ప్రారంభించగా, మూడు చోట్ల దుకాణాలను మూసేసింది. డంకిన్ డోనట్స్ విషయంలో ఒకటి మూసేసి, మరో చోట ఇంకో స్టోర్‌ను తెరిచింది. ఫలితాల నేపథ్యంలో జుబిలంట్ స్టాక్ ఒకదశలో 3 శాతానికి పెరిగి రూ.1490ని చేరుకున్నా... చివరకు లాభాల స్వీకరణ కారణంగా 2.5 శాతం నష్టపోయి రూ.1,400 వద్ద క్లోజ్ అయింది. -
కాగ్నిజెంట్ లాభాలు డౌన్
సాక్షి, ముంబై: ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ 2018 మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చలేకపోయింది. ముఖ్యంగా కంపెనీ నికలర లాభం క్షీణించింది. 6.6 శాతం క్షీణతతో కంపెనీ నికర లాభం 520 మిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ 557 మిలియన్ డాలర్లు లేదా 92 సెంట్ల నికర లాభం సాధించినట్లు కాగ్నిజెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, గత ఏడాది ఇదే త్రైమాసికంలో 3.54 బిలియన్ డాలర్ల నుంచి 3.91 బిలియన్ డాలర్ల రెవెన్యూ వృద్ధిని నమోదు చేసింది. హెల్త్ కేర్, కమ్యూనికేషన్స్, మీడియా, టెక్నాలజీ వంటి అంశాలపై బలమైన వృద్ధిని సాధించినట్టు పేర్కొంది. ఇది మార్చి త్రైమాసికంలో డాలర్ గైడెన్స్ 3.88 బిలియన్ డాలర్లగా ఉంది. జూన్ త్రైమాసికంలో ఆదాయం 4-4.04 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని తెలిపింది., 2018 నాటికి డాలర్ అదాయం 16.05 నుండి 16.3 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. ఈ మొదటి త్రైమాసికంలో మంచి ఆర్ధిక ఫలితాలను సాధించామనీ, డిజిటల్ సేవలు, సొల్యూషన్స్‌లో మంచి పురోగతిని సాధించామని కాగ్నిజెంట్ సీఈవో ఫ్రాన్సిస్కో డిసౌజా చెప్పారు.మార్చి 2018 త్రైమాసికంలో 2,61,400 మంది ఉద్యోగులున్నారని వెల్లడించింది. -
పీఎన్బీ లాభాలు 12శాతం అప్
దేశంలో నాలుగో అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు అంచనాలను మిస్ చేసింది. అంచనావేసిన దానికంటే తక్కువగానే లాభాలు పెరిగాయి. బ్యాంకు బుధవారం ప్రకటించిన జూన్ క్వార్టర్ ఫలితాల్లో నికర లాభం 12.09 శాతం పైకి ఎగిసి, రూ.343.40 కోట్లగా నమోదైనట్టు తెలిసింది. విశ్లేషకులు మాత్రం పీఎన్బీ రూ.404 కోట్ల నికరలాభాలన్ని ఆర్జిస్తుందని భావించారు. ఆశ్చర్యకరంగా బ్యాంకు మొండిబకాయిల ప్రొవిజన్లు గతేడాది కంటే 19 శాతం మేర తగ్గాయి. గతేడాది ఇదే క్వార్టర్లో రూ.3165.67 కోట్లగా ఉన్న మొండిబకాయిలు ఈ ఏడాది జూన్ క్వార్టర్లో రూ.2559.71 కోట్లగా నమోదయ్యాయి. స్థూలంగా మాత్రం మొండిబకాయిలు మార్చి క్వార్టర్లో 12.53 శాతముంటే, జూన్ క్వార్టర్‌కు వచ్చేసరికి 13.66 శాతానికి పెరిగాయి. ఫలితాల ప్రకటన నేపథ్యంలో పీఎన్బీ షేర్లు 1.52 శాతం పైన ట్రేడవుతున్నాయి. రూ.159.95 మార్కు వద్ద ప్రారంభమైన ఈ షేర్లు రూ.162 వద్ద గరిష్ట స్థాయిని, రూ.157.80 వద్ద కనిష్ట స్థాయిని తాకాయి. ఓ వైపు స్టాక్‌మార్కెట్లు ఆర్బీఐ పాలసీ ప్రకటన నేపథ్యంలో స్తబ్దుగా ట్రేడవుతున్నాయి. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 4.22 శాతం పైకి ఎగిసి, రూ.3855.13 కోట్ల వద్ద నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ ఆదాయం రూ.3,698.97 కోట్లగా ఉంది. కాగ, నికర ఎన్పీఏలు బ్యాంకువి క్వార్టర్ క్వార్టర్‌కు 8.67 శాతం పెరిగాయి. -
పడిపోయిన ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ
ముంబై : ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకులో అగ్రగామిగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ప్రైవేట్ లిమిటెడ్ లాభాల్లో పడిపోయింది. గురువారం ప్రకటించిన 2017-18 ఆర్థిక సంవత్సర క్యూ1 ఫలితాల్లో బ్యాంకు నికర లాభాలు 8.2 శాతం తగ్గాయి. మొండిబకాయిలు విపరీతంగా పెరగడంతో పాటు, క్రెడిట్ గ్రోత్ మందగించడంతో బ్యాంకు లాభాలకు గండికొట్టాయి. గతేడాది ఇదే క్వార్టర్లో రూ.2,232.35 కోట్లగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు లాభాలు ఈ ఏడాది జూన్ క్వార్టర్లో రూ.2,049 కోట్లకు తగ్గాయి. గత క్వార్టర్ నుంచి అడ్వాన్స్‌లు ఏ మాత్రం మారకుండా... రూ.4.64 ట్రిలియన్లగానే ఉన్నాయి. సీక్వెన్షియల్ ఆధారితంగా బ్యాంకు డిపాజిట్లు 0.77 శాతం క్షీణించి రూ.4.86 ట్రిలియన్లుగా నమోదైనట్టు ఐసీఐసీఐ తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తులు ఏకంగా బ్యాంకువి 56.5 శాతం పెరిగాయి. దీంతో గతేడాది రూ.27,562.93 కోట్లగా ఉన్న బ్యాంకు ఎన్పీఏలు ఈ ఏడాది రూ.43,147.64 కోట్లకు ఎగిశాయి. క్వార్టర్ క్వార్టర్‌కు కూడా బ్యాంకు ఎన్పీఏలు 1.4 శాతం పెరిగినట్టు ఐసీఐసీఐ తెలిపింది. మొత్తం రుణాల్లో ఎన్పీఏలు 7.89 శాతం నుంచి 7.99 శాతం పెరిగాయి. నికర ఎన్‌పీలు, మొండిబకాయిలు లోన్ బుక్‌లో 4.86 శాతం ఎగిసినట్టు తెలిసింది. ఇటీవలే బ్యాంకులకు భారీగా రుణాలు ఎగొట్టిన మాల్యా వంటి ఘనులు 12 మంది ఉన్నట్టు ఆర్బీఐ గుర్తించిన సంగతి తెలిసిందే. వారిపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలని బ్యాంకులను ఆదేశించింది. ఈ ఎగొట్టిన రుణాల్లో ఐసీఐసీఐ బ్యాంకుకు ఉన్నవి రూ.6,889.46 కోట్లు. ఈ రుణగ్రహీతల నుంచి వచ్చే డిఫాల్ట్ ప్రమాదాన్ని ముందస్తుగా ఎదుర్కొనడానికి బ్యాంకు రూ.2,827.66 కోట్లను పక్కకు తీసి పెట్టింది. రుణాలు ఇవ్వడంతో బ్యాంకు ఆర్జించే ప్రధాన ఆదాయం లేదా నికర వడ్డీ ఆదాయం 8.36 శాతం పెరిగి, రూ.5,589.84 కోట్లగా నమోదయ్యాయి. ఫీజులు, కమిషన్లను నుంచి వచ్చిన వడ్డీరహిత ఆదాయాలు 1.21 శాతం తగ్గాయి. గతేడాది రూ.3,429.26 కోట్లగా ఉన్న ఈ ఆదాయాలు ఈ ఏడాది రూ.3,387.91 కోట్లకు తగ్గినట్టు తెలిసింది. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు ఈ క్వార్టర్లో 3.75 శాతం పెరిగినట్టు బ్యాంకు తెలిపింది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు 1 శాతం డౌన్ అయి, రూ.307.05 గా ముగిశాయి. -
జియో దెబ్బ: ఐడియాకి భారీగా తగిలింది
ముంబై : టెలికాం మార్కెట్లోకి సంచలనాలు రేపుతూ ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో దెబ్బ నుంచి టెలికాం దిగ్గజాలు కోలుకోలేకపోతున్నాయి. దేశీయ అతిపెద్ద టెలికాం కంపెనీ ఎయిర్టెల్ ఇటీవలే భారీగా తన లాభాలను కోల్పోగా.. మరో టెలికాం అగ్రగామి ఐడియా సెల్యులార్ కూడా జియో తాకిడిని తట్టుకోలేక కుదేలైంది. గురువారం ప్రకటించిన 2017-18 తొలి క్వార్టర్ ఫలితాల్లో ఐడియా సెల్యులార్ నికర నష్టాలు రూ.815 కోట్లగా నమోదుచేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ కంపెనీ లాభాలు రూ.220 కోట్లగా ఉన్నాయి. గత మార్చి క్వార్టర్లో కూడా కంపెనీ రూ.325.60 కోట్ల నష్టాలను నమోదుచేసింది. ఈ క్వార్టర్లో ఐడియా నష్టాలు మరింత ఎగిశాయి. కంపెనీ ఆదాయం కూడా 14 శాతం మేర పడిపోయి రూ.8,182 కోట్లగా ఉన్నట్టు ఐడియా తెలిపింది. విశ్లేషకుల అంచనాల ప్రకారం ఐడియా రూ.671 కోట్ల నష్టాలను మాత్రమే ఎదుర్కొంటుందని భావించారు. కానీ వారి అంచనాలకు మించిపోయి మరింత నష్టాల్లోకి ఐడియా కూరుకుపోయింది. జియో ఆఫర్ చేస్తున్న అపరిమిత కాలింగ్, డేటా ప్లాన్స్ వల్ల తాము కుదేలవుతున్నట్టు ఐడియా చెప్పింది. జియోకు తగ్గ ప్లాన్స్‌ను అమలుచేస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంటుందని తెలిపింది. గతేడాది మార్కెట్లోకి వచ్చిన ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియోతో, దేశీయ టెలికాం మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అప్పటి నుంచి కంపెనీలు భారీగా నష్టాలను చవిచూస్తున్నాయి. జియో ధరల యుద్ధంతో కంపెనీలు తట్టుకోలేకపోతున్నాయి. కాగ, మొత్తం రెవెన్యూలు ఐడియా కంపెనీవి క్వార్టర్ క్వార్టర్‌కు 0.5 శాతం పెరిగాయి. కానీ ఏడాది ఏడాదికి 13.9 శాతం తగ్గాయి. జియోను దెబ్బతీయడానికి ఐడియా, వొడాఫోన్ ఇండియాతో విలీనం కాబోతుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించబోతున్నాయి. -
హెచ్‌సీఎల్ లాభం డౌన్..గైడెన్స్ భేష్
ముంబై: ఐటీ మేజర్ , సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రొవైడర్ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తొలి త్రైమాసికంలో లాభాలు భారీగా క్షీణించాయి. గురువారం ప్రకటించిన క్వార్టర్ 1 ఫలితాల్లో నికర లాభాలు 11 శాతం పడిపోయాయి. సీక్వెన్షియల్ లాభాలు 6.6 శాతం క్షీణించి రూ.2,171 కోట్లకు పడిపోయాయి. తక్కువ ఆదాయం అధిక పన్ను వ్యయంతో హెచ్‌సీఎస్ ఫలితాలు ప్రభావితమైనట్టు అంచనా. అయితే బెటర్ ఆపరేషనల్ పెర్ఫామెన్స్ కారణంగా కంపెనీ వృద్ధి క్షీణతకు బ్రేక్ వేసింది. అయితే ఎబిటా మార్జిన్లు 1.6 వృద్ధిని నమోదు చేసి రూ. 2,444 కోట్లను సాధించింది. మార్జిన్లు 20.1 శాతం పుంజుకున్నాయి. వీటిని 19.5 పెరిగి రూ.2383గా ఉంటుందని విశ్లేషకులు అంచనావేశారు. ఈ త్రైమాసికంలో ఆదాయం 0.8 శాతం పెరిగి రూ .12,149 కోట్లకు చేరింది. డాలర్ల ఆదాయం 3.7 శాతం పెరిగి 1,884.2 మిలియన్ డాలర్లకు చేరింది. 2018 ఆర్థిక సం.రం గైడెన్స్‌ను 10.5-12.5 గా ప్రకటించింది. దీంతో హెచ్‌సీఎల్ టెక్ 52 వారాల గరిష్ట స్థాయికి చేరింది. హెచ్‌సీఎల్ కౌంటర్ 4 శాతం పైగా లాభంతో ట్రేడవుతోంది. 1-2-3 పెరుగుదల వ్యూహంలో ముందుకు సాగుతున్నామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో విజరుకుమార్ చెప్పారు. డాలర్ పరిధిలో క్వార్టర్ ఆన్ క్వార్టర్ 2.6శాతం, ఇయర్ ఆన్ ఇయర్ 12.2 శాతం రెవెన్యూ వృద్ధిని సాధించామన్నారు. అయితే 2018 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన గైడెన్స్‌ను ప్రకటించడం విశేషం. -
మరోసారి భారీగా కుదేలైన ఎయిర్టెల్
-
ప్రైవేట్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు పడిపోయింది
ముంబై : దేశంలోనే మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు లాభాల్లో పడిపోయింది. మంగళవారం ప్రకటించిన 2017-18 ఆర్థిక సంవత్సర తొలి క్వార్టర్ ఫలితాల్లో ఏడాది ఏడాదికి బ్యాంకు లాభాలు 16 శాతం క్షీణించి రూ.1,306 కోట్లగా నమోదయ్యాయి. అంచనాల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి అంతే. గతేడాది ఇదే క్వార్టర్లో బ్యాంకు లాభాలు రూ.1,555.53 కోట్లగా ఉన్నాయి. అయితే క్వార్టర్ క్వార్టర్‌కు బ్యాంకు లాభాలు 7 శాతం పెరిగాయి. బ్యాంకు నికర వడ్డీ ఆదాయాల వృద్ధి తక్కువగా ఉండటంతో పాటు, నిర్వహణ లాభాలు, అత్యధిక మొత్తంలో ప్రొవిజన్లు తమ లాభాలపై ప్రభావం చూపాయని బ్యాంకు చెప్పింది. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం ఏడాది ఏడాదికి 2.36 శాతం తగ్గి రూ.4,616.14 కోట్లగా నమోదైంది. ఇవి విశ్లేషకుల అంచనాలను మిస్ అయ్యాయి. గ్లోబల్‌గా నికర వడ్డీ మార్జిన్లు 3.63 శాతం, దేశీయ వడ్డీ మార్జిన్లు 3.85 శాతం క్షీణించాయి. స్థూల నిరర్థక ఆస్తులు 5.03 శాతం పెరిగినప్పటికీ, ఆస్తుల నాణ్యత స్థిరంగా ఉంది. మార్చి క్వార్టర్లో ఈ నిరర్థక ఆస్తులు 5.04 శాతంగా పెరిగిన సంగతి తెలిసిందే. నికర ఎన్పీఏలు స్వల్పంగా 2.11 శాతం నుంచి 2.30 శాతం పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీస్ 10.62 శాతం పెరిగి రూ.2,341.93 కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇవి రూ.2117.17 కోట్లగా ఉన్నాయి. ఫలితాల ప్రకటన నేపథ్యంలో యాక్సిస్ బ్యాంకు షేర్లు నేటి మార్కెట్లో 1.94 శాతం పైన ముగిశాయి. -
మరోసారి భారీగా కుదేలైన ఎయిర్టెల్
న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ మరోసారి భారీగా కుదేలైంది. మంగళవారం ప్రకటించిన 2017-18 ఆర్థిక సంవత్సర తొలి క్వార్టర్ ఫలితాల్లో భారతీ ఎయిర్టెల్ లాభాలు 75 శాతం కిందకి పడిపోయి, రూ.367 కోట్లగా రికార్డయ్యాయి. అయితే విశ్లేషకులు అంచనావేసిన దానికంటే మెరుగైన లాభాలనే ఎయిర్టెల్ నమోదుచేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ లాభాలు రూ.1462 కోట్లగా ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్ ఆర్ప్(ఒక్కో యూజర్‌పై ఆర్జించే సగటు రెవెన్యూ) కూడా క్వార్టర్ క్వార్టర్ బేసిస్‌లో 2 శాతం పడిపోయి, ఒక్కో నెలకు రూ.154 మాత్రమే ఆర్జించింది. మొత్తం రెవెన్యూలు కూడా కంపెనీవి ఏడాది ఏడాదికి 14 శాతం కిందకి దిగజారాయి. క్వార్టర్ రివ్యూలో కంపెనీ మొత్తం రెవెన్యూలు రూ.21,958 కోట్లగా ఉన్నట్టు తెలిసింది. కన్సాలిడేటెడ్ మొబైల్ డేటా ట్రాఫిక్ ఈ క్వార్టర్లో 527 మిలియన్ ఎంబీగా ఉందని కంపెనీ చెప్పింది. దీనిలో కంపెనీ ఏడాదికి ఏడాది గణనీయమైన వృద్ధి 178 శాతాన్ని నమోదుచేసింది. కన్సాలిడేటెడ్ మొబైల్ డేటా రెవెన్యూలు కూడా ఈ క్వార్టర్లో 16.8 శాతం క్షీణించి, రూ.3,765 కోట్లగా నమోదయ్యాయి. మొత్తంగా దేశీయంగా కంపెనీ రెవెన్యూలు క్యూ1లో ఏడాది ఏడాదికి 10 శాతం పడిపోయి, రూ.17,244 కోట్లగా నమోదైనట్టు కంపెనీ ప్రకటించింది. కాగ, కంపెనీ నికర రుణం రూ.91,400 కోట్ల నుంచి రూ.87,840 కోట్లకు తగ్గింది. మార్కెట్లోకి ప్రవేశించిన కొత్త ఆపరేటర్‌తో ప్రస్తుత క్వార్టర్లో కూడా మొబైల్ మార్కెట్లో తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చవిచూశామని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. మార్కెట్లోకి ప్రవేశించిన కొత్త ఆపరేటర్‌తో దేశీయ టెలికాం మార్కెట్లో తీవ్ర ధరల అంతరాయం ఏర్పడి ఇండస్ట్రి రెవెన్యూలను కంటిన్యూగా పడిపోతున్నాయని, ఏడాది ఏడాదికి ప్రస్తుతం 15 శాతం ఇండస్ట్రి రెవెన్యూలను కోల్పోయినట్టు భారతీ ఎయిర్టెల్ భారత్, దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్ చెప్పారు. ఫలితాల నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ షేర్లు 1.76 శాతం పెరిగాయి. మార్కెట్ అవర్స్ తర్వాత కంపెనీ ఈ ఫలితాలను ప్రకటించింది. -
సరికొత్త గరిష్టాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు
దేశంలోనే రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు అంచనాలకు తగ్గ ఫలితాలను విడుదల చేసింది. రెవెన్యూలో అన్ని వైపుల నుంచి బ్యాంకు గణనీయమైన వృద్ధిని నమోదుచేసింది. దీంతో బ్యాంకు లాభాలు 2017-18 తొలి క్వార్టర్లో 20.2 శాతం పైకి ఎగిసి, రూ.3,893.84 కోట్లగా నమోదయ్యాయి. ప్రొవిజన్లు పెరిగినప్పటికీ, బ్యాంకు ఈ మేర లాభాలు నమోదుచేయడం గమనార్హం. తొలుత స్టాక్ మార్కెట్లో బ్యాంకు అసెట్ క్వాలిటీపై ఆందోళనలు రేకెత్తడంతో షేర్లు పడిపోయాయి. కానీ తమ ఆస్తుల నాణ్యత పెరగడానికి ప్రధాన కారణం, జూన్‌లో రాష్ట్రాలు ప్రకటించిన వ్యవసాయ రుణ మాఫీనేనని చెప్పడంతో బ్యాంకు షేర్లు సరికొత్త గరిష్ట స్థాయిలను తాకాయి. ప్రస్తుతం 1.59 శాతం జంప్‌చేసి, రూ.1,733 వద్ద ట్రేడవుతోంది. కాగ, బ్యాంకు స్థూల ఎన్‌పీఏల్లో 60 శాతం వ్యవసాయ రంగానివేనని హెచ్డీఎఫ్సీ తెలిపింది. అన్ని దిగ్గజ బ్యాంకుల్లో కెల్లా హెచ్డీఎఫ్సీ బ్యాంకుకే తక్కువ మొండిబకాయిలు ఉంటాయి. నికర వడ్డీ ఆదాయాలు, ఇతర ఆదాయాల నుంచి బ్యాంకుకు లాభాలు చేకూరాయని హెచ్డీఎఫ్సీ సోమవారం బీఎస్ఈకి సమర్పించిన నివేదికలో తెలిపింది. నికర వడ్డీ ఆదాయం(వడ్డీ ద్వారా పొందే ఆదాయాలు, వడ్డీల రూపంలో పెట్టే ఖర్చుల మధ్య ఉన్న తేడా) బ్యాంకుకు 20.4 శాతం పెరిగి, రూ.9,370.4 కోట్లగా నమోదైంది. బ్యాంకు సగటు రుణాల వృద్ధి కూడా 20.7 శాతం పెరిగింది. కోర్ నికర వడ్డీ మార్జిన్లు ఈ క్వార్టర్లో 4.4 శాతంగా ఉన్నాయి. ఈ క్వార్టర్లో అడ్వాన్సులు 23.4 శాతం పెరిగి రూ.5.8 లక్షల కోట్లగా ఉండగా.. రిటైల్ రుణాల వృద్ధి 21.9 శాతం, హోల్ సేల్ రుణాలు 25.5 శాతం ఉన్నట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. బ్యాంకు డిపాజిట్లు కూడా 17 శాతం పెరిగి ఏడాది ఏడాదికి రూ.6.71 లక్షల కోట్లగా నమోదైనట్టు పేర్కొంది. డిపాజిట్లలో సేవింగ్ అకౌంట్ డిపాజిట్లు 26.5 శాతం పెరుగగా, కరెంట్ అకౌంట్ డిపాజిట్లు 34.1 శాతం పెరిగాయి. -
విప్రో 11వేల కోట్ల బైబ్యాక్ ఆఫర్
న్యూఢిల్లీ : దేశీయ మూడో అతిపెద్ద టెక్నాలజీ సంస్థ విప్రో అంచనాల్లో అధిగమించినప్పటికీ, లాభాల్లో పడిపోయింది. గురువారం ప్రకటించిన 2017-18 జూన్ క్వార్టర్ ఫలితాల్లో విప్రో 8 శాతం సీక్వెన్షియల్ డ్రాప్‌ను నమోదుచేసి, నికర లాభాలు రూ.2,076.50 కోట్లగా ఉన్నట్టు తెలిపింది. గత మార్చి క్వార్టర్లో ఈ లాభాలు రూ.2,261.10 కోట్లగా ఉన్నాయి. కంపెనీ రెవెన్యూలు రూ.13,205.6 కోట్లగా ఉన్నాయి. ఇవి విశ్లేషకులు అంచనావేసిన రూ.12,828 కోట్ల కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఈబీఐటీ మార్జిన్లు కూడా విశ్లేషకుల అంచనాల కంటే అధికంగానే 16.8 శాతం నమోదయ్యాయి. కానీ కంపెనీ డాలర్ రెవన్యూ గైడెన్స్‌లో నిరాశపరిచింది. తమ ఐటీ సర్వీసుల నుంచి వచ్చే రెవెన్యూలు -0.5 శాతం నుంచి 1.5 శాతం వరకు ఉంటాయని కంపెనీ అంచనావేస్తోంది. కాగ కంపెనీ మొత్తం ఆదాయం రూ. 13,661.40 కోట్లకు పెరిగింది. ఇది మార్చి క్వార్టర్లో రూ.14,470.20 కోట్లగా ఉంది. ముందస్తు ప్రకటించిన మాదిరిగానే షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనపై విప్రో స్పష్టతనిచ్చింది. రూ.11వేల కోట్ల షేర్ల బైబ్యాక్‌కు బోర్డు ఆమోదించినట్టు కంపెనీ తెలిపింది. ఈ బైబ్యాక్‌లో ఒక్కో షేరును రూ.320కు కొనుగోలు చేయనుంది. 343.75 మిలియన్ల వరకు షేర్ బైబ్యాక్‌ను విప్రో చేపడుతోంది. వరుసగా రెండేళ్ల నుంచి విప్రో బైబ్యాక్ ప్రకటన చేస్తూ వస్తోంది. గతంలో 40 మిలియన్ షేర్లను మాత్రమే బైబ్యాక్ చేసింది. ఒక్కో షేరుకు రూ.625 చొప్పున మొత్తం రూ.2500 కోట్ల మేర బైబ్యాక్‌ను చేపట్టింది. ఇప్పటికే పెద్ద కంపెనీల్లో ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్‌లు, మిడ్‌క్యాప్, చిన్న కంపెనీల్లో మైండ్‌ట్రి బైబ్యాక్‌లను ప్రకటించాయి. -
రూపీ దెబ్బ: టెక్ దిగ్గజం టీసీఎస్ డౌన్
ముంబై: రూపాయి విలువ పెరగడం దేశీయ అతిపెద్ద టెక్నాలజీ దిగ్గజం టీసీఎస్‌కు దెబ్బకొట్టింది. నేడు ప్రకటించిన 2017-18 ఆర్థిక సంవత్సర జూన్ త్రైమాసిక ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలు తప్పి, క్వార్టర్ క్వార్టర్‌కు 10 శాతం పడిపోయింది. కంపెనీ నికర లాభాలు రూ.5,945 కోట్లగా నమోదైనట్టు కంపెనీ పేర్కొంది. కంపెనీ నికర లాభాలు ఈ క్వార్టర్లో రూ.6,203 కోట్లగా ఉంటాయని విశ్లేషకులు అంచనావేశారు. కానీ విశ్లేషకుల అంచనాలు తప్పాయి. రెవెన్యూలు సైతం క్వార్టర్ క్వార్టర్‌కు స్వల్పంగా 0.2 శాతం పడిపోయి రూ.29,584 కోట్లగా నమోదయ్యాయి. ఇవి విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే వచ్చాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా ఒక్కో షేరుకు 7 రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నట్టు ఈ ఐటీ దిగ్గజం ప్రకటించింది. ఈ క్వార్టర్లో డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి విలువ అమాంతం పెరగడంతో రూ.650 కోట్ల మేర నష్టపోయినట్టు కంపెనీ సీఎఫ్ఓ రామకృష్ణన్ చెప్పారు. స్థిరమైన కరెన్సీ విలువల్లో రెవెన్యూ వృద్ధి ఈ క్వార్టర్లో 2 శాతం పెరిగింది. వాల్యుమ్ గ్రోత్ కూడా 3.5 శాతానికి పెరిగినట్టు కంపెనీ నేడు బీఎస్ఈకి సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది. గత క్వార్టర్లో 29.10 శాతంగా ఉన్న ఈబీఐటీ మార్జిన్లు ఈ క్వార్టర్లో 26.6 శాతానికి పడిపోయాయి. 1 మిలియన్ బ్యాండ్‌లో కంపెనీ 8 మంది క్లయింట్లను చేర్చుకోగా... 10 మిలియన్ బ్యాండ్‌లో 12 మంది ఉన్నారు. కంపెనీలో మొత్తం ఉద్యోగులు 3,85,809 మంది ఉండగా, గ్రాస్ అడిక్షన్ కింద 11,202 ఉద్యోగులున్నారు. అయితే గత ఆర్థిక సంవత్సరం పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో నియామకాలు తక్కువగానే ఉంటాయని కంపెనీ చెప్పింది. -
పర్వాలేదనిపించిన ఎస్బీఐ
ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) శుక్రవారం ప్రకటించిన తొలి త్రైమాసిక ఫలితాల నికర లాభాల్లో పడిపోయింది. అయితే మార్కెట్ విశ్లేషకుల అంచనాలను కంటే తక్కువగానే పడిపోయి రూ.2520.96 కోట్ల నికర లాభాలను నమోదుచేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగిసిన త్రైమాసికం నాటికి నికరలాభాలు యేటికేటికీ 31.7 శాతం పడిపోయినట్టు ఎస్బీఐ వెల్లడించింది. యేటికేటికీ నికర వడ్డీరేట్ల ఆదాయాలు 4.2 శాతం ఎగిసి, రూ.14,312.31 కోట్లగా ఉన్నట్టు తెలిపింది. మార్కెట్ విశ్లేషకులు బ్యాంకు నికర లాభాలు రూ. 2,504.9 కోట్లగా, నికర వడ్డీ ఆదాయాలు రూ.14,489.5 కోట్లగా నమోదుచేస్తుందని అంచనావేశారు. స్టేబుల్ అసెట్ క్వాలిటీని కొనసాగిస్తున్నట్టు బ్యాంకు ఈ ఫలితాల నేపథ్యంలో ప్రకటించడంతో, మార్నింగ్ ట్రేడింగ్‌లో 2 శాతం మేర డౌన్ అయిన ఎస్బీఐ షేర్లు, మధ్యాహ్నం సెషన్లో9 శాతం మేర లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఎస్బీఐ ఇతర ఆదాయాలు 44 శాతం మేర జంప్ అయ్యాయని బ్యాంకు పేర్కొంది. ఇతర ఆదాయాలు, నిర్వహణ లాభాలు, తక్కువ పన్నుధరలు బ్యాంకు లాభాలకు సపోర్టుగా నిలిచినట్టు ఎస్బీఐ వెల్లడించింది. అయితే బ్యాంకుకు మళ్లీ స్థూల బ్యాడ్ లోన్స్ బెడదగానే ఉన్నాయి. ఈ లోన్స్ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.1,01,541 కోట్లకు ఎగిశాయి. మార్చి త్రైమాసికంలో ఇవి రూ.98,713 కోట్లగా ఉన్నాయి. బ్యాడ్ లోన్స్ పెంపు స్ట్రీట్ అంచనాల కంటే తక్కువగానే ఉన్నాయి. నికర నిరర్థక ఆస్తులు 3.8 శాతం నుంచి 4.05 శాతానికి ఎగిశాయి.బ్యాడ్ లోన్స్ ప్రొవిజన్లు జూన్ త్రైమాసికంలో రూ. 6,340 కోట్లకు పెరిగాయి. మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఈ లోన్స్ తక్కువగానే నమోదయ్యాయి. మార్చి త్రైమాసికంలో బ్యాడ్ లోన్స్ ప్రొవిజన్లు రూ.12,139 కోట్లు. -
'ఐడియా' ఫ్లాప్: లాభాలు పతనం
ముంబై : దేశంలో మూడో అతిపెద్ద టెలికాం దిగ్గజం ఐడియా సెల్యులార్ విశ్లేషకుల అంచనాలను మిస్ చేసింది. సోమవారం ప్రకటించిన 2016-17 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాల్లో తన కన్సాలిడేటెడ్ నికర లాభాలు 74శాతం పతనమై రూ.220 కోట్లగా నమోదుచేసినట్టు వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభాలు రూ.851.6 కోట్లగా ఉన్నాయి. స్పెక్ట్రమ్ ధరలు, తక్కువ వాయిస్ రెవెన్యూలు వల్ల తమ ఆదాయాల పడిపోయినట్టు తెలిపింది. థామ్సన్ రాయిటర్స్ డేటా ప్రకారం ఐడియా రూ.435 కోట్ల నికర లాభాలను ఆర్జిస్తుందని అంచనావేశారు. స్పెక్ట్రమ్ కొనుగోలు చేయడానికి ఒక ఆఫ్ ఖర్చులు లాభాలు పతనమవడానికి దోహదం చేశాయని పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కమర్షియల్ గా ఆవిష్కరించబోయే జియో సేవల నేపథ్యంలో టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా యూనిట్లతో పాటు ఐడియా సైతం తన 3జీ,4జీ సర్వీసులపై ఎక్కువగా పెట్టుబడులు పెట్టి, తన డేటా రేట్లలో కోత విధించింది. దీంతో గతేడాది ఒక యూజర్‌కు రూ.147 లుగా ఉన్నమొబైల్ డేటా సగటు రెవెన్యూ, ఈ ఏడాది రూ.142లకు పడిపోయినట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఐడియా 4జీ నెట్ వర్క్‌కు 1.8 మిలియన్ కస్టమర్లు ఉన్నారు. అదేవిధంగా రిలయన్స్‌కు 1.5 మిలియన్ సబ్ స్క్రైబర్లు ఉన్నట్టు తాజా వార్షిక రిపోర్టులు పేర్కొన్నాయి. మరోవైపు ఐడియా సెల్యులార్ షేర్లు నేటి మార్కెట్లో 2.83 శాతం పతనమై రూ.103.1వద్ద నమోదైంది. -
లాభాల బూమ్‌తో హెచ్‌సీఎల్ షేర్లు జంప్
దేశీయ నాలుగో అతిపెద్ద ఐటీ సర్వీసుల ఎగుమతిదారు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అన్ని కొలమానాలో విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. బుధవారం ప్రకటించిన 2016-17 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసిక లాభాల్లో కంపెనీ 6 శాతం ఎగిసి, రూ.2,047 కోట్లగా నమోదుచేసింది. రెవెన్యూలు సైతం 6.3 శాతం పెంచుకుని రూ.11,336 కోట్లగా రికార్డు చేసింది. అయితే హెచ్‌సీఎల్ కేవలం రూ.1,860 కోట్ల లాభాలను మాత్రమే ఆర్జిస్తుందని విశ్లేషకులు అంచనావేశారు. విశ్లేషకుల అంచనాలు అధిగమించి హెచ్‌సీఎల్ లాభాలు రికార్డు చేయడంతో, నేటి ట్రేడింగ్‌లో ఆ కంపెనీ షేర్లు మెరుపులు మెరిపిస్తున్నాయి. 7 శాతం మేర దూసుకెళ్తున్నాయి. డాలర్ రెవెన్యూలోనూ దేశీయ టాప్ ఐటీ కంపెనీలో కెల్లా హెచ్‌సీఎల్ కంపెనీనే మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ఈ కంపెనీ డాలర్ రెవెన్యూలు 6.5 శాతం ఎగిసి, క్వార్టర్ ఆన్ క్వార్టర్‌కు రూ. 1,691 మిలియన్ డాలర్లుగా రికార్డు అయ్యాయి. రెవెన్యూ, మార్జిన్ గైడెన్స్‌తో ఆర్థిక సంవత్సరం 2017లో కంపెనీ వృద్ధి అంచనాలను పెంచేసింది. స్థిరమైన కరెన్సీతో రెవెన్యూ వృద్ది 12-14 శాతం ఉంటుందని హెచ్‌సీఎల్ టెక్ అంచనావేస్తోంది. ఈ వృద్ధి డాలర్లో 11.2 శాతం నుంచి 13.2 శాతం ఉంటుందని పేర్కొంది. ఆపరేటింగ్ మార్జిన్లు 19.5 శాతం నుంచి 20.5 శాతం మధ్యలో ఎగుస్తాయని హెచ్‌సీఎల్ తెలిపింది. మెరుగైన ఆర్థిక ఫలితాలతో హెచ్‌సీఎల్ ఒక్క షేరుకు 6 రూపాయల డివిడెంట్ ప్రకటించింది. ఆగస్టు 19 నుంచి ఈ డివిడెంట్ చెల్లించనున్నట్టు తెలిపింది.