మరోసారి భారీగా కుదేలైన ఎయిర్‌టెల్‌ | Bharti Airtel Q1 profit plunges 75% YoY to Rs 367 crore, beats Street estimates | Sakshi
Sakshi News home page

మరోసారి భారీగా కుదేలైన ఎయిర్‌టెల్‌

Published Tue, Jul 25 2017 6:26 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM

మరోసారి భారీగా కుదేలైన ఎయిర్‌టెల్‌

మరోసారి భారీగా కుదేలైన ఎయిర్‌టెల్‌

న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ మరోసారి భారీగా కుదేలైంది. మంగళవారం ప్రకటించిన 2017-18 ఆర్థిక సంవత్సర తొలి క్వార్టర్‌ ఫలితాల్లో భారతీ ఎయిర్‌టెల్‌ లాభాలు 75 శాతం కిందకి పడిపోయి, రూ.367 కోట్లగా రికార్డయ్యాయి. అయితే విశ్లేషకులు అంచనావేసిన దానికంటే మెరుగైన లాభాలనే ఎయిర్‌టెల్‌ నమోదుచేసింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో కంపెనీ లాభాలు రూ.1462 కోట్లగా ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌ ఆర్ప్‌(ఒక్కో యూజర్‌పై ఆర్జించే సగటు రెవెన్యూ) కూడా క్వార్టర్‌ క్వార్టర్‌ బేసిస్‌లో 2 శాతం పడిపోయి, ఒక్కో నెలకు రూ.154 మాత్రమే ఆర్జించింది. మొత్తం రెవెన్యూలు కూడా కంపెనీవి ఏడాది ఏడాదికి 14 శాతం కిందకి దిగజారాయి. క్వార్టర్‌ రివ్యూలో కంపెనీ మొత్తం రెవెన్యూలు రూ.21,958 కోట్లగా ఉన్నట్టు తెలిసింది. కన్సాలిడేటెడ్‌ మొబైల్‌ డేటా ట్రాఫిక్‌ ఈ క్వార్టర్‌లో 527 మిలియన్‌ ఎంబీగా ఉందని కంపెనీ చెప్పింది. దీనిలో కంపెనీ ఏడాదికి ఏడాది గణనీయమైన వృద్ధి 178 శాతాన్ని నమోదుచేసింది. 
 
కన్సాలిడేటెడ్‌ మొబైల్‌ డేటా రెవెన్యూలు కూడా ఈ క్వార్టర్‌లో 16.8 శాతం క్షీణించి, రూ.3,765 కోట్లగా నమోదయ్యాయి. మొత్తంగా దేశీయంగా కంపెనీ రెవెన్యూలు  క్యూ1లో ఏడాది ఏడాదికి 10 శాతం పడిపోయి, రూ.17,244 కోట్లగా నమోదైనట్టు కంపెనీ ప్రకటించింది.  కాగ, కంపెనీ నికర రుణం రూ.91,400 కోట్ల నుంచి రూ.87,840 కోట్లకు తగ్గింది. మార్కెట్లోకి ప్రవేశించిన కొత్త ఆపరేటర్‌తో ప్రస్తుత క్వార్టర్‌లో కూడా మొబైల్‌ మార్కెట్‌లో తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చవిచూశామని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. మార్కెట్‌లోకి ప్రవేశించిన కొత్త ఆపరేటర్‌తో దేశీయ టెలికాం మార్కెట్‌లో తీవ్ర ధరల అంతరాయం ఏర్పడి ఇండస్ట్రి రెవెన్యూలను కంటిన్యూగా పడిపోతున్నాయని, ఏడాది ఏడాదికి ప్రస్తుతం 15 శాతం ఇండస్ట్రి రెవెన్యూలను కోల్పోయినట్టు భారతీ ఎయిర్‌టెల్‌ భారత్‌, దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్‌ విట్టల్‌ చెప్పారు. ఫలితాల నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు 1.76 శాతం పెరిగాయి. మార్కెట్‌ అవర్స్‌ తర్వాత కంపెనీ ఈ ఫలితాలను ప్రకటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement