ప్రైవేట్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు పడిపోయింది
Published Tue, Jul 25 2017 8:16 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM
ముంబై : దేశంలోనే మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు లాభాల్లో పడిపోయింది. మంగళవారం ప్రకటించిన 2017-18 ఆర్థిక సంవత్సర తొలి క్వార్టర్ ఫలితాల్లో ఏడాది ఏడాదికి బ్యాంకు లాభాలు 16 శాతం క్షీణించి రూ.1,306 కోట్లగా నమోదయ్యాయి. అంచనాల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి అంతే. గతేడాది ఇదే క్వార్టర్‌లో బ్యాంకు లాభాలు రూ.1,555.53 కోట్లగా ఉన్నాయి. అయితే క్వార్టర్ క్వార్టర్‌కు బ్యాంకు లాభాలు 7 శాతం పెరిగాయి. బ్యాంకు నికర వడ్డీ ఆదాయాల వృద్ధి తక్కువగా ఉండటంతో పాటు, నిర్వహణ లాభాలు, అత్యధిక మొత్తంలో ప్రొవిజన్లు తమ లాభాలపై ప్రభావం చూపాయని బ్యాంకు చెప్పింది.
బ్యాంకు నికర వడ్డీ ఆదాయం ఏడాది ఏడాదికి 2.36 శాతం తగ్గి రూ.4,616.14 కోట్లగా నమోదైంది. ఇవి విశ్లేషకుల అంచనాలను మిస్ అయ్యాయి. గ్లోబల్‌గా నికర వడ్డీ మార్జిన్లు 3.63 శాతం, దేశీయ వడ్డీ మార్జిన్లు 3.85 శాతం క్షీణించాయి. స్థూల నిరర్థక ఆస్తులు 5.03 శాతం పెరిగినప్పటికీ, ఆస్తుల నాణ్యత స్థిరంగా ఉంది. మార్చి క్వార్టర్‌లో ఈ నిరర్థక ఆస్తులు 5.04 శాతంగా పెరిగిన సంగతి తెలిసిందే. నికర ఎన్పీఏలు స్వల్పంగా 2.11 శాతం నుంచి 2.30 శాతం పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీస్ 10.62 శాతం పెరిగి రూ.2,341.93 కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇవి రూ.2117.17 కోట్లగా ఉన్నాయి. ఫలితాల ప్రకటన నేపథ్యంలో యాక్సిస్ బ్యాంకు షేర్లు నేటి మార్కెట్‌లో 1.94 శాతం పైన ముగిశాయి.
Advertisement
Advertisement