కాగ్నిజెంట్ చైన్నై కార్యాలయం (ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై: ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ 2018 మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చలేకపోయింది. ముఖ్యంగా కంపెనీ నికలర లాభం క్షీణించింది. 6.6 శాతం క్షీణతతో కంపెనీ నికర లాభం 520 మిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ 557 మిలియన్ డాలర్లు లేదా 92 సెంట్ల నికర లాభం సాధించినట్లు కాగ్నిజెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, గత ఏడాది ఇదే త్రైమాసికంలో 3.54 బిలియన్ డాలర్ల నుంచి 3.91 బిలియన్ డాలర్ల రెవెన్యూ వృద్ధిని నమోదు చేసింది. హెల్త్ కేర్, కమ్యూనికేషన్స్, మీడియా, టెక్నాలజీ వంటి అంశాలపై బలమైన వృద్ధిని సాధించినట్టు పేర్కొంది. ఇది మార్చి త్రైమాసికంలో డాలర్ గైడెన్స్ 3.88 బిలియన్ డాలర్లగా ఉంది.
జూన్ త్రైమాసికంలో ఆదాయం 4-4.04 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని తెలిపింది., 2018 నాటికి డాలర్ అదాయం 16.05 నుండి 16.3 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. ఈ మొదటి త్రైమాసికంలో మంచి ఆర్ధిక ఫలితాలను సాధించామనీ, డిజిటల్ సేవలు, సొల్యూషన్స్‌లో మంచి పురోగతిని సాధించామని కాగ్నిజెంట్ సీఈవో ఫ్రాన్సిస్కో డిసౌజా చెప్పారు.మార్చి 2018 త్రైమాసికంలో 2,61,400 మంది ఉద్యోగులున్నారని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment