సాక్షి, ముంబై: కేంద్రంలో ఎన్‌డీఏ సర్కారుకు స్పష్టమైన మెజారిటీ సాధించనుందున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అదానీ గ్రూపు షేర్లకు మంచి జోష్‌నిస్తున్నాయి. నరేంద్ర మోదీ మరోసారి స్పష్టమైన మెజార్టీతో ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో సోమవారం అదాని గ్రూప్ కంపెనీలు షేర్లు 20 శాతం లాభపడుతున్నాయి. ప్రధానంగా అదానీ ఎంటర్ ప్రైజెస్, పవర్, గ్యాస్ అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్స్, అదానీ పోర్ట్స్ షేర్లు భారీ లాభాలతో దూసుకు పోతున్నాయి.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఇంట్రాడేలో 21శాతం పెరిగి రూ.144.30ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. దీంతో టాప్ విన్నర్‌గా ట్రేడ్ అవుతోంది.
అదానీ గ్రీన్ ఎనర్జీ : ఇంట్రాడేలో 17 శాతం పెరిగి రూ.144.30ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది.
అదానీ ట్రాన్స్‌మిషన్స్: ఇంట్రాడేలో 10శాతం పెరిగి రూ.226.50ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది.
అదానీ పవర్: ఇంట్రాడేలో 16శాతం పెరిగి రూ.47.25ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అలాగే అదానీ గ్యాస్ 12 శాతం ఎగిసింది.
మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల హైజంప్ చేశాయి. ఆరంభ లాభాలనుంచి మరింత ఎగిసి సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా ఎగిసింది. తద్వారా 39 వేల స్థాయికి చేరింది. అలాగే నిఫ్టీ 300 పాయింట్లకు పైగా జంప్ చేసి 11800 స్థాయికి చేరువలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment