సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్న సూచీలు రోజంతా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొ న్నాయి. చివరికి సెన్సెక్స్ 220.86 పాయింట్లు లేదా 0.37 శాతం 60,286 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు లేదా 0.24 శాతం క్షీణించి 17,721.50 వద్ద ముగిసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం తర్వాత రేట్ల పెంపును నిలిపివేస్తుందన్న పెట్టుబడిదారులలో స్వల్ప ఆశావాదంతో సూచీలు చూస్తూనే ఉన్నాయి. ఫైనాన్షియల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు లాభాలతోనూ, ఎఫ్‌ఎంసిజి షేర్లు నష్టాల్లోముగిసాయి. అలాగే ఫ్లాగ్‌షిప్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ సహా కొన్ని లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఎగిసాయి.
హిండెన్ వర్గ్ వివాదంతో ఎఫ్‌పీవోను కూడా అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ ఈరోజు 20 శాతం ఎగిసింది. ఇదే క్రమంలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ స్టాక్ 3.93 శాతం, అదానీ పోర్ట్స్ స్టాక్ ఏకంగా 8.65 శాతం పుంజుకుంది. దీంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారు.
చివరికి అదానీ ఎంటర్ ప్రైజెస్ 15 శాతం, అదానీ పోర్ట్స్, డా.రెడ్డీస్, ఇండస్ ఇండ్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ టాప్ గెయినర్స్‌గా, టాటా స్టీల్, హిందాల్కో, ఐటీసీ, హీరో మోటో, టాటామెటార్స్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 82.70 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది. సోమవారం 82.73 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment