డిఫెన్స్‌ బడ్జెట్‌ను పెంచిన పాకిస్థాన్‌! | Pakistan announced 15% increase in defence spending Rs 2,122 billion in 2024-25 budget | Sakshi
Sakshi News home page

డిఫెన్స్‌ బడ్జెట్‌ను పెంచిన పాకిస్థాన్‌!

Published Thu, Jun 13 2024 12:06 PM | Last Updated on Thu, Jun 13 2024 12:06 PM

Pakistan announced 15% increase in defence spending Rs 2,122 billion in 2024-25 budget

పాకిస్థాన్ గతేడాదితో పోలిస్తే రక్షణరంగానికి  15 శాతం బడ్జెట్‌ కేటాయింపులు పెంచుతున్నట్లు ప్రకటించింది. పాక్‌ ఇటీవల విడుదల చేసిన 2024-25 బడ్జెట్‌లో డిఫెన్స్‌ రంగానికి రూ.2.1లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పింది.

పాక్‌ బుధవారం రూ.18లక్షలకోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దాయాదిదేశం గతేడాది రక్షణ రంగానికి రూ.1.8లక్షల కోట్లమేర నిధులు ఇచ్చింది. అంతకుముందు 2022-23 ఏడాదికిగాను రూ.1.5లక్షలకోట్లు ఖర్చుచేసింది. క్రమంగా ఆయా నిధులు పెంచుకుంటూ 2024-25 ఏడాదికిగాను డిఫెన్స్‌ రంగానికి రూ.2.1లక్షల కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఇది గతేడాది కేటాయింపుల కంటే 15 శాతం ఎక్కువ. కాగా, రానున్న బడ్జెట్‌ సెషన్‌లో భారత్‌కూడా ఆమేరకు కేటాయింపులు పెంచుతుందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి: సిమ్‌ కార్డు, వై-ఫై కనెక్షన్‌ లేకపోయినా మెసేజ్‌లు పంపాలా..?

అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితులు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌ మొత్తం తన బడ్జెట్‌లో దాదాపు 12 శాతం రక్షణ రంగానికే కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. దాంతో భారత్‌ కూడా ఆ శాఖకు నిధులు గుమ్మురిస్తుందనే వాదనలున్నాయి. ఒకవేళ రానున్న బడ్జెట్‌ సమావేశాల్లో భారత్‌ డిఫెన్స్‌ రంగానికి కేటాయింపులు పెంచితే ఆ రంగంలోని లిస్టెడ్‌ కంపెనీల స్టాక్‌లు మరింత పెరుగుతాయని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement