సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు సమస్యలను భారత్, చైనాలు చర్చల ద్వారా పరిష్కరించుకునేందకు ప్రయత్నిస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత్‌లో రక్షణ వ్యవస్థ సుశిక్షితంగా ఉందని, ఏ దేశం ముందు భారత్ తలవంచబోదని ఆయన స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో భారత్ రక్షణ పరికరాలను, ఆయుధాలను ఎగుమతి చేస్తుందని, స్వయం సమృద్ధి దిశగా మనం ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాఫేల్ యుద్ధవిమానాలు రాఫేల్ బారత రక్షణ సామర్ధ్యాలను బలోపేతం చేస్తుందని ఓ వార్తా చానెల్‌తో మాట్లాడుతూ అన్నారు. నేపాల్‌తోనూ విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని, ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా మంచి సంబంధాలున్నాయని రాజ్‌నాథ్ చెప్పారు. చదవండి : మానస సరోవర్ యాత్రికులకు గుడ్‌న్యూస్
Comments
Please login to add a commentAdd a comment