
కోల్‌కతా: మేకిన్ ఇండియాను మేక్ ఫ్రమ్ ఇండియాగా మార్చే కార్యక్రమానికి మద్దిస్తూ మినీరత్న పీఎస్‌యూ.. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, ఇంజినీర్స్(జీఆర్‌ఎస్‌ఈ) తాజాగా నావల్ గ్రూప్ ఫ్రాన్స్‌తో చేతులు కలిపింది. సర్ఫేస్ నౌకల తయారీకి అనువైన సాంకేతిక సహకారం కోసం అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది.
తద్వారా దేశ, విదేశీ నౌకాదళాలకు అవసరమయ్యే అత్యున్నత యుద్ధనౌకల తయారీని చేపట్టనుంది. ఇందుకు రెండు సంస్థల అధికారులూ ఎంవోయూపై సంతకాలు చేశారు. యూరోపియన్ నౌకాదళ పరిశ్రమలో లీడర్‌గా నిలుస్తున్న నావల్ గ్రూప్‌తో జట్టు కట్టడం ద్వారా జీఆర్‌ఎస్‌ఈ గోవిండ్ డిజైన్ ఆధారిత యుద్ధ నౌకలను జీఆర్‌ఎస్‌ఈ రూపొందించనుంది. ఎగుమతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాంకేతికతో నౌకల తయారీని చేపట్టేందుకు పరస్పరం సహకరించుకోనున్నాయి. వెరసి దేశ, విదేశీ నావికా దళాల కోసం జీఆర్‌ఎస్‌ఈ 100 యుద్ధ నౌకలను నిర్మించనుంది.