ships
-
పనామా కాలువను ఓడలు ఎలా దాటుతాయంటే? చూస్తేనే అర్థమవుతుంది
మానవ నిర్మితమైన 'పనామా కాలువ' (Panama Canal) పసిఫిక్ మహాసముద్రాన్ని, అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతోంది. ఈ కాలువ ఉత్తర, దక్షిణ అమెరికాలు విడదీస్తుంది. ఈ కాలువ నిర్మాణం పూర్తయిన తరువాత ప్రయాణించే దూరం ఏకంగా 9500 కిమీ తగ్గిపోయింది. సాధారణంగా సముద్రం మీద వెళ్లినట్లు ఈ కాలువలో షిప్పులు ప్రయాణించడం సాధ్యం కాదు, ఎందుకంటే ఇక్కడ భూభాగం ఎగుడు దిగుడుగా ఉండటం వల్ల ఇది అసాధ్యం. దీనిని దృష్టిలో ఉంచుకుని లాకింగ్ సిస్టం అనే పద్దతి ద్వారా షిప్పులను జాగ్రత్తగా ఒకవైపు నుంచి మరో వైపుకు పంపడం చూడవచ్చు. పనామా కాలువలో షిప్పులు ఎలా ముందుకు వెళతాయి అనేదానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో ఒక స్టేట్ నుంచి మరో స్టేజికి వెళ్లాలంటే లాకింగ్ పద్దతిని అనుసరించి వెళ్లాల్సి ఉంటుంది. అంటే నీటిని ఓకే సమతుల్య స్థానానికి తీసుకు వచ్చిన తరువాత ఇవి ముందుకు కదులుతాయి. ఇలా లాకింగ్ పద్దతిని అనుసరించి అట్లాంటిక్ సముద్రం నుంచి పసిఫిక్ సముద్రంలోకి షిప్పులు కదులుతాయి. How ships cross the Panama Canal.. ❤️pic.twitter.com/G5GeuBxK92 — #NaMo Again 🚩 (@BhaktSanatani_) February 29, 2024 -
ఎర్ర సముద్ర ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్
న్యూఢిల్లీ : ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అది చాలా ముఖ్యమైన నౌకామార్గం అయినందున ఎర్ర సముద్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి రన్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ విషయమై గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘మాకు వాణిజ్య స్వేచ్ఛ, రవాణా స్వేచ్ఛ రెండూ ముఖ్యమే. ఎర్ర సముద్రంలో జరుగుతున్న ఘటనలు కేవలం మమ్మల్నే కాదు. ప్రపంచంలోని చాలా దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి’అని జైస్వాల్ అన్నారు. డ్రోన్ దాడి కారణంగా గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో చిక్కుకున్న భారత్‌కు చెందిన వాణిజ్య నౌకలోని సిబ్బందిని భారత నేవీకి చెందిన ఐఎన్ఎస్ విశాఖపట్నం బుధవారం రాత్రి కాపాడింది. ఈ నేపథ్యంలో ఎర్ర సముద్ర ఘటనలపై భారత్ స్పందించడం గమనార్హం. గాజాపై ఇజ్రాయెల్ దాడికి నిరసనగా గత కొద్ది రోజులుగా ఎర్ర సముద్రం నుంచి వెళుతున్న వాణిజ్య నౌకలపై హౌతీ మిలిటెంట్లు డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆసియా నుంచి యూరప్, ఆసియా వెళ్లే వాణిజ్య నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కంపెనీలకు షిప్పింగ్ ఖర్చు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇదీచదవండి.. ట్రంప్ చేతిపై ఎర్రమచ్చలేంటి.. ఫ్యాన్స్‌లో జోరుగా చర్చ -
నౌకలపై దాడులు.. ఇంధన సరఫరాపై ప్రభావం: జై శంకర్
టెహ్రాన్: ఎర్రసముద్రంలో వాణిజ్య రాకపోకలకు పెరుగుతున్న ముప్పుపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశ ఇంధనం, ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు. భారతదేశానికి సమీపంలో నౌకలపై దాడులు తీవ్ర ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఇలాంటి చర్యలు ఎవరికీ ప్రయోజనం కలిగించబోవని చెప్పారు. ఎర్రసముద్రంలో ఓడలపై జరుగుతున్న దాడుల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమిరబ్దొల్లాహియాన్తో చర్చల తర్వాత మీడియాతో మాట్లాడారు. "భారతదేశ సమీపంలోనూ కొన్ని దాడులు జరిగాయి. ఇది అంతర్జాతీయ సమాజానికి చాలా ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి చర్యలు భారతదేశ ఇంధనం, ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ఈ చర్యలతో ఎవరికీ ప్రయోజనం ఉండదు.” అని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. గాజాలో యుద్ధం ఆందోళన కలిగించే అంశమని జైశంకర్ అన్నారు. పౌరుల ప్రాణనష్టం, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలపై దాడులతో మానవతా సంక్షోభం నెలకొంది. దీనిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గాజాకు భారత్ స్వయంగా సామగ్రిని పంపి సహాయం చేసిందని స్పష్టం చేశారు. పాలస్తీనాలో నెలకొన్న పరిస్థితుల్ని పరిష్కరించేలా భారత్ మద్దతు ఉంటుందని తెలిపారు. ఇదీ చదవండి: సిరియా, ఇరాక్‌పై ఇరాన్ క్షిపణి దాడులు -
Red Sea: హౌతీ పైరేట్లు... చైనా మిత్రులా?
టెహ్రాన్: ఎర్ర సముద్రంలో హౌతీ మిలిటెంట్ల దాడులు తప్పించుకోవడానికి వాణిజ్య నౌకలు కొత్త టెక్నిక్‌ను వాడుతున్నట్లు తెలుస్తోంది. చైనాతో సంబంధాలున్నట్లుగా సంకేతాలిస్తూ నౌకలు హౌతీల దాడుల నుంచి తప్పించుకుంటున్నాయి. నౌకలో అందరూ చైనా సిబ్బంది ఉన్నట్లు లేదంటే నౌక చైనాకు వెళుతోందని సంకేతాలిస్తే హౌతీలు దాడి చేయకుండా విడిచి పెడుతుండడంతో వాణిజ్య నౌకలు ఈ టెక్నిక్‌ను వాడుతుండటం విశేషం. ఎలాంటి ఆటంకాలు లేకుండా తాజాగా ఎర్ర సముద్రాన్ని దాటిన ఐదు వాణిజ్య నౌకలు ఇదే టెక్నిక్‌ను వాడాయని సమాచారం. నిజానికి గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌తో లింకులున్న దేశాలకు చెందిన నౌకలపై మాత్రమే దాడి చేస్తామని ప్రటించిన హౌతీలు ఇజ్రాయెల్‌తో ఎలాంటి లింకులేని దేశాల వాణిజ్య నౌకలపైనా దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం హౌతీలపై అమెరికా, బ్రిటన్లకు చెందిన బలగాలు వైమానిక దాడులకు దిగాయి. ఈ దాడులు ఇక ముందు కూడా కొనసాగుతాయని అమెరికా హెచ్చరించింది. ఆసియా నుంచి అమెరికా, యూరప్‌లకు వెళ్లేందుకు కీలక మార్గంగా ఉన్న ఎర్ర సముద్రంలో హౌతీలు దాడులకు దిగుతుండడంతో నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి గమ్యస్థానాలకు వెళుతున్నాయి. ఇదీచదవండి..హౌతీలపై అమెరికా మిత్ర పక్షాల దాడులు -
Houthi Attacks: హౌతీ గ్రూపు మాస్ వార్నింగ్..
టెహ్రాన్: ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రక్షణపై అమెరికా ఏర్పాటు చేసిన కూటమిలో భాగస్వామ్య దేశాలంతా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ గ్రూపు హెచ్చరించింది. కూటమి దేశాలన్నీ ఎర్ర సముద్రంలో తమ నౌకల భద్రతను కోల్పోవాల్సి వస్తుందని హౌతీ గ్రూపు సుప్రీం రివల్యూషనరీ కమిటీ సీనియర్ అధికారి మహ్మద్ అలీ అల్ హౌతీ తాజాగా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నింగ్ ఇచ్చాడు. తాము దాడులను పూర్తిగా ఆపే వరకు కూటమి దేశాల నౌకలకు ముప్పు తప్పదని స్పష్టం చేశాడు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ రెబెల్స్ జరుపుతున్న దాడులను ఎదుర్కొనేందుకు 12 దేశాలతో కలిసి అమెరికా ఒక కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో యూకే,ఆస్ట్రేలియా జపాన్ తదితర దేశాలున్నాయి. అయితే ఈ కూటమిలో తాము లేమని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా తూర్పు, పశ్చిమ దేశాల సముద్ర రవాణాకు కీలకమైన ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్ మండెబ్ జలసంధి వద్ద వాణిజ్య నౌకలపై హౌతీలు డ్రోన్లతో ఇటీవల దాడులు చేస్తున్నారు. హౌతీల దాడులు మొదలైన తర్వాత ఈ రూట్లో భారత షిప్పింగ్ కంపెనీలు తమ నౌకల రవాణాను రద్దు చేసుకుని భారీ ఖర్చుతో కూడిన ఆఫ్రికా రూట్లో నౌకలను పంపుతున్నాయి.ఈ రూట్లో ఇండియా నుంచి నౌకలు అమెరికా, యూరప్‌లను చేరుకోవడానికి 14 రోజులు ఎక్కువ సమయం పడుతోంది. ఇదీచదవండి..ట్రంప్ పై బ్యాన్.. రివ్యూకు సుప్రీం కోర్టు ఓకే -
సైనిక చర్యకు దిగుతాం.. హౌతీలకు అమెరికా వార్నింగ్
న్యూయార్క్: హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఓడలపై దాడులను నిలిపివేయాలని అమెరికా సహా 12 మిత్రదేశాలు పిలుపునిచ్చాయి. లేనిపక్షంలో సైనిక చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాయి. ఇదే చివరిసారి మరోసారి హెచ్చరికలు ఊహించకూడదని పేర్కొంటూ ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా హౌతీ ఉగ్రవాదులు ఎర్ర సముద్రంలో డిసెంబర్ 19 నుంచి ఇప్పటివరకు 23 దాడులకు పాల్పడ్డారు. "చట్టవిరుద్ధమైన దాడులను తక్షణమే ముగించాలి. నిర్బంధించిన ఓడలు, సిబ్బందిని తక్షణమే విడుదల చేయాలని పిలుపునిస్తున్నాం. హౌతీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారు. జలమార్గాలలో వాణిజ్య ప్రయాణాలపై బెదిరింపులకు పాల్పడితే తర్వాత జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది." అని అమెరికా మిత్రదేశాలు హెచ్చరించాయి. ఎర్రసముద్రంలో ఓడలపై హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో అంతర్జాతీయ సహనం దెబ్బతింటుందని అమెరికా మిత్రదేశాలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ ప్రకటనపై అమెరికా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బెల్జియం, కెనడా, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్ సంతకాలు చేశాయి. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదుల దాడితో యుద్ధం ప్రారంభం అయింది. హమాస్ ఉగ్రవాదులను అంతం చేసే దిశగా ఇజ్రాయెల్ ముందుకు వెళుతోంది. గాజాపై భీకర యుద్ధం చేస్తోంది. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో హమాస్ వైపు 22 వేలకు పైగా మంది మరణించారు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసిస్తూ యెమెన్ ఆధారిత హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఓడలపై దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు సంబంధం ఉన్న ప్రతి నౌకపై దాడి చేస్తున్నారు. ఇదీ చదవండి: 73కు చేరిన ‘జపాన్’ మరణాల సంఖ్య -
ఎరుపెక్కిన సముద్ర వర్తకం
సమీపకాలంలో భారత్‌కు అత్యంత ఆందోళనకర పరిణామం ఇది. బలవత్తరమైన శక్తిగా ఎదగడానికి సముద్ర వర్తకం ముఖ్యమైన వేళ... వాణిజ్య నౌకలపై వరుస దాడులు నిరంతర అప్రమత్తత అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. వేర్వేరు వాణిజ్య నౌకలపై అరేబియా సముద్రంలో ఇటీవల జరిగిన దాడులతో, భారత నౌకాదళం మూడు క్షిపణి విధ్వంసక నౌకలను మోహరించాల్సి వచ్చింది. వాటిని వివిధ ప్రాంతాల్లో గస్తీకి నిలిపి, ముష్కరుల దొంగదాడులకు మన నేవీ చెక్ పెట్టే పనిలో పడింది. వారం రోజుల్లో... భారతీయ సిబ్బందితో కూడిన రెండు వాణిజ్య నౌకలు మన దేశానికి వస్తూ, దాడికి గురవడం మన సముద్ర వర్తకం భద్రతపై ప్రశ్నలు రేపింది. పోర్బందర్కు 217 నాటికల్ మైళ్ళ దూరం నుంచి 21 మంది భారతీయ సిబ్బందితో కూడిన ఎమ్వీ చెమ్ ప్లూటోపై డిసెంబర్ 23న డ్రోన్ దాడి జరిగింది. అప్రమత్తమైన భారత నౌకాదళం, భారత తటరక్షక దళం సదరు వర్తక నౌకకు రక్షణగా నిలిచాయి. తర్వాత కొద్ది గంటలకే... పాతిక మంది భారతీయ సిబ్బందితో కూడిన వాణిజ్య క్రూడాయిల్ ట్యాంకర్ ఎమ్వీ సాయిబాబాపై ఎర్రసముద్రం దక్షిణ ప్రాంతంలో డ్రోన్ దాడి జరిగింది. దీంతో,నౌకాదళం గస్తీ పెంచింది. దాడులు జరిపిన ముష్కరులు సముద్ర గర్భంలో దాగివున్నా సరే, వెతికి పట్టుకొని, కఠిన చర్యలు తీసుకుంటామంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. లెక్కలు తీస్తే... నవంబర్ 19 నుంచి ఇప్పటికి ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై 30 డ్రోన్ దాడులు, సముద్రపు దొంగల దాడులు జరిగాయి. అంటే, దాదాపు రోజుకో దాడి. ఈ 30 దాడుల్లో సగం ప్రపంచంలోనే అతి రద్దీగా ఉండే సముద్ర వర్తక మార్గంలో ఎర్ర సముద్రంలో జరిగినవే. ఇది ఆందోళనకరం. తాజాగా ఎమ్వీ చెమ్ ప్లూటోపై జరిగిన దాడి తాలూకు శిథిలాలను సేకరించి, దాడి తీరుతెన్ను లను కనిపెట్టే ప్రయత్నం సాగుతోంది. దాడి మరో నౌకపై నుంచి చేశారా, లేక తీర ప్రాంతం నుంచి జరిగిందా లాంటి అంశాలను నిర్ధారణ చేసే పనిలో ఇండియన్ నేవీ నిమగ్నమైంది. ఒకపక్క గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధంతో ఉద్రిక్తతలు పెరగగా, అదే సమయంలో వాణిజ్య నౌకలపై ఇలా డ్రోన్ దాడులు జరగడం యాదృచ్ఛికమేమీ కాదు. అక్కడి యుద్ధం తాలూకు ప్రభావం ఇక్కడకు విస్తరించింది. యెమెన్‌లో అధిక ప్రాంతాలను తమ నియంత్రణలో పెట్టుకున్న హౌథీ రెబల్స్ నవంబర్ మధ్య నుంచి ఎర్ర సముద్రంలో వెళుతున్న నౌకలపై డ్రోన్లు, క్షిపణులు ప్రయోగిస్తున్నారు. గాజా లోని హమాస్‌కు సంఘీభావంగా రెబల్స్ ఈ దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌తో స్పష్టమైన సంబంధం లేని నౌకలపైనా ఈ దాడులు సాగడం గమనార్హం. వీరికి ఇరాన్ అండదండలున్నట్టు కథనం. దాడులకు బాధ్యత తమదేనంటూ ఈ యెమనీ రెబల్స్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఎమ్వీ సాయిబాబాపై హౌథీలు దాడి జరిపారనీ, ఎమ్వీ చెమ్‌ప్లూటోపై ఇరాన్ నుంచి డ్రోన్‌ను ప్రయో గించారనీ అమెరికా కేంద్ర కమాండ్ సమాచారం. దాడులకు ఎర్ర సముద్రాన్ని ఎంచుకోవడంలో ముష్కరులకు పెద్ద వ్యూహం ఉంది. ప్రపంచ నౌకా రవాణాలో 30 శాతం, వ్యాపారంలో 12 శాతం, సముద్రజలాలపై పెట్రోలియమ్ వాణిజ్యంలో 10 శాతం మధ్యధరా ప్రాంతాన్ని హిందూ మహాసముద్రంతో కలిపే ఎర్ర సముద్రం మీదుగానే జరుగుతాయి. దాడుల వల్ల నౌకలు రూటు మార్చి, ఒకప్పటిలా గుడ్‌హోప్ అగ్రం చుట్టూ తిరిగిరావాలి. దూరం, దరిమిలా ప్రయాణకాలం పెరిగే ఈ సుదీర్ఘయానం వల్ల చమురు, దిగుమతుల ధరలు గణనీయంగా పెరుగుతాయి. పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు మరింత ప్రియమవుతుంది. చమురు సరఫరాలకు ప్రధానంగా ఆ ప్రాంతంపై ఆధారపడే భారత్‌కు ఇది దెబ్బ. ఇజ్రాయెల్ – హమాస్ పోరు ప్రారంభమైనప్పటి నుంచి ముడి చమురు ధరలు అంతకంతకూ పెరగడమే అందుకు నిదర్శనం. అమెరికా, ఇజ్రాయెల్లను సైద్ధాంతికంగా వ్యతిరేకించే హౌథీల దాడుల దెబ్బకు ఎర్ర సముద్రం ఇప్పుడు యుద్ధ క్షేత్రమైపోయింది. గాజాకు మానవతా సాయం అందేవరకు ప్రపంచ సరఫరా వ్యవస్థలకు అవరోధాలు కల్పించాలన్న వారి ఆలోచన ఫలిస్తోంది. దీన్ని ప్రతిఘటించి, ముష్కరుల దాడుల నుంచి రక్షణ కోసం అమెరికా గత వారం ‘ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్’ పేర బహుళ దేశీయ నౌకా దళాన్ని ప్రారంభించింది. అయితే, అగ్రరాజ్య సారథ్యంలోని ఈ బలగంలో పలు దేశాలు చేరలేదు. సూయజ్ కాలువ ద్వారా వర్తకం తగ్గినందు వల్ల భారీగా నష్టపోయే ఈజిప్ట్ ఇంతవరకు హౌథీల దుశ్చర్యలను ఖండించలేదు. చివరకు యెమెనీ గ్రూపుతో శాంతి ప్రక్రియ చర్చలు సాగిస్తున్న సౌదీ అరేబియా సైతం అమెరికా సారథ్య నౌకాబలగాన్ని సమర్థించలేదు. ఉత్తరాన హిమాలయాలు, పశ్చిమాన శత్రుత్వం వహించే పాకిస్తాన్ ఉన్నందున, మిగిలిన దిక్కుల్లో వాణిజ్యానికి సంబంధించి ఆచరణలో భారత్ ద్వీపదేశమే. అందుకే, మనకు సముద్ర వర్తకం కీలకం. మన దేశ వాణిజ్య పరిమాణంలో 98 శాతం, విలువలో 68 శాతం సముద్ర మార్గాల్లోనే సాగుతాయి. దానికి తగ్గట్టే హిందూ మహాసముద్ర ప్రాంతానికి కావలి పాత్రను భారత్ పోషిస్తోంది. వాణిజ్యం పెరగాలంటే, మిత్రదేశాలతో కలసి ఈ సముద్ర మార్గాలను సురక్షితంగా ఉంచాలి. ఆ పనే భారత్ చేస్తోంది. అయితే, ఇజ్రాయెల్ – గాజా యుద్ధంలో సమదూరం పాటిస్తూ వచ్చిన మనకు తాజా పరిస్థితులు కొత్త బరువ నెత్తిన పెట్టాయి. సోమాలీ సముద్ర దొంగల్ని నిరోధించేందుకు ఈ సరికే గస్తీ సాగిస్తున్న భారత్, ఇకపై వాణిజ్య నౌకల్ని భద్రంగా ఎర్ర సముద్రం దాటించే పని తప్పదు. ఒకవేళ దాడులు సాగితే, అది మరో యుద్ధభేరి అవుతుంది. అందుకే, ఈ సమస్యలన్నిటికీ అసలు పరిష్కారం గాజాలో యుద్ధానికి తెర పడడం, శాంతి నెలకొనడమే! -
Drone Attacks: భారత నేవీ కీలక నిర్ణయం
ముంబై: అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుసగా డ్రోన్ దాడులు జరుగుతుండడంతో ఇండియన్ నేవి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సముద్రంలో గస్తీ కోసం మూడు ఐఎన్ఎస్ వార్‌షిప్పులను రంగంలోకి దింపింది. వీటితో పాటు తీరంలో పెట్రోలింగ్ విమానాలతో నిఘా ఉంచనుంది. ‘ఇటీవల వాణిజ్య నౌకలపై పెరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకుని మూడు వార్‌షిప్పులను పశ్చిమ తీరంలో గస్తీ కోసం రంగంలోకి దింపాం. వీటికి మిసైళ్లను, డ్రోన్లను అడ్డుకుని నాశనం చేసే సామర్థ్యం ఉంది. ఇవి కాక లాంగ్ రేంజ్ పెట్రోలింగ్ విమానాలు తీరం వెంబడి నిఘా పెడతాయి. కోస్ట్‌గార్డ్‌లతో సమన్వయం చేసుకుని పరిస్థితిని నిషితంగా పరిశీలిస్తున్నాం’ అని నేవీ వెస్టర్న్ కమాండ్ అధికారి ఒకరు తెలిపారు. సౌదీ అరేబియా నుంచి భారత్‌లోని మంగళూరు వస్తున్న క్రూడాయిల్ నౌక కెమ్ ఫ్లూటోపై పోర్బందర్ తీరానికి 400 నాటికల్ మైళ్ల దూరంలో ఇటీవలే డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ డ్రోన్ ఇరాన్ నుంచి వచ్చిందని అమెరికా రక్షణశాఖ ముఖ్య కార్యాలయం పెంటగాన్ ప్రటించడం సంచలనం రేపింది. ఈ ఘటన తర్వాత ఎర్ర సముద్రంలో మరో క్రూడాయిల్ నౌకపైనా డ్రోన్ దాడి జరిగింది. మరోవైపు దాడి తర్వాత ముంబై డాక్‌యార్డుకు చేరుకున్న కెమ్ ఫ్లూటోను ఫోరెన్సిక్ అధికారులు తనిఖీ చేశారు. ఇదీచదవండి..ఉత్తరాదిని ‘కమ్ముకున్న పొగమంచు’ -
తైవాన్ దిశగా చైనా నౌకలు, యుద్ధ విమానాలు
తైపీ: తైవాన్‌పై కన్నేసిన డ్రాగన్ దేశం చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. మంగళవారం, బుధవారం పెద్ద సంఖ్యలో నావికాదళం నౌకలను, ఫైటర్ జెట్లు, బాంబర్లతో కూడిన యుద్ధ విమానాలను తైవాన్ దిశగా పంపించింది. ఈ విషయాన్ని తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. చైనా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శత్రువుల దండయాత్ర నుంచి తనను తాను కాపాడుకోవడమే లక్ష్యంగా తైవాన్ ప్రతిఏటా నిర్వహించే సైనిక విన్యాసాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తన నౌకలను, యుద్ధ విమానాలను తైవాన్ దిశగా నడిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా ప్రజా విముక్తి సైన్యం(పీఎల్ఏ) మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం వరకూ 38 యుద్ధ విమానాలను, 9 నౌకలను తైవాన్ వైపు మళ్లించింది. అంతేకాకుండా మరో 30 విమానాలు దూసుకొచ్చాయి. ఇందులో జె–10, జె–16 ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని విమానాలు చైనా–తైవాన్ మధ్య జలసంధిలో అనధికారిక సరిహద్దు అయిన మిడ్లైన్ను దాటి ముందుకెళ్లినట్లు సమాచారం. చైనాకు చెందిన హెచ్–6 బాంబర్లు కూడా దక్షిణ తైవాన్ సమీపంలో సంచరించినట్లు తెలుస్తోంది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని డ్రాగన్ చెబుతోంది. ఎప్పటికైనా కలిపేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. -
వీళ్లకు వీర‘తాళ్లు’ వేయాల్సిందే
భారీ ఓడలు సముద్రంలో లంగరు వేయాలన్నా.. ఆలయ వీధుల్లో రథాలు పరుగులు తీయాలన్నా.. ఆ ఊళ్లో తయారయ్యే భారీ తాళ్లు, పగ్గాలను వాడాల్సిందే. తాళ్ల తయారీలో యంత్రాలు రంగప్రవేశం చేసినా.. ఆ ఊరి కార్మికుల పనితనం ముందు దిగదుడుపే. నౌకల్లో ఉపయోగించే భారీ మోకులు.. తాళ్లు.. పగ్గాల తయారీకి వందల ఏళ్ల నుంచీ తాళ్లరేవు గ్రామం ప్రసిద్ధి చెందింది. సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ–అమలాపురం మధ్య జాతీయ రహదారిపై వెళ్లే ప్రతి ఒక్కరి చూపు తాళ్లరేవు రాగానే టక్కున ఆగిపోతుంది. తాళ్లే కదా.. ఎక్కడైనా తయారవుతాయనుకుంటే పొరబడ్డట్టే. ఇక్కడ తయారయ్యే తాళ్లకు పెద్ద చరిత్రే ఉంది. పెద్ద, పెద్ద కర్మాగారాల్లో తయారయ్యే తాళ్లు ఇక్కడ చేతితో తయారుచేసే తాళ్ల ముందు నిలవలేవంటే ఆశ్చర్యమేస్తుంది. అత్యధిక నాణ్యత.. 50 శాతం తక్కువ ధరల్లో ఇక్కడ తాళ్లు లభిస్తాయి. పాత తాళ్లు కొత్తగా అలంకరించుకోవాలన్నా.. తక్కువ ధరకే అవి దొరకాలన్నా తాళ్లరేపు పేరును తలవాల్సిందే. సెకండ్ హ్యాండ్ (పాత తాళ్ల)ను రీ ప్రాసెసింగ్ చేసి కొత్తవిగా తయారు చేయడంలో చేయి తిరిగిన నైపుణ్యం అక్కడి వారి సొంతం. 200 ఏళ్ల క్రితం సంభవించిన జల ప్రళయంతో.. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం కోసం ఇక్కడకు వచ్చి స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంతో ఇప్పుడున్న కోరంగి అభయారణ్య ప్రాంతం అప్పట్లో పట్టణంగా విరాజిల్లింది. అమెరికా, రష్యా, ఇరాన్, ఇరాక్ తదితర దేశాల నుంచి ఓడలు కోరంగి రేవు ద్వారానే ఎగుమతి, దిగుమతులు సాగించేవి. కోరంగి నుంచి కేంద్రపాలిత యానాం వరకు విస్తరించి ఉన్న సముద్ర తీరానికి ఓడలు, పెద్దపెద్ద బోట్లు రాకపోకలు సాగించేవి. 2 వేల నుంచి 20 వేల టన్నుల సామర్థ్యం గల ఓడలు సైతం ఇక్కడకు వచ్చేవి. సుమారు 200 ఏళ్ల క్రితం సంభవించిన జల ప్రళయంలో ఓడలు, ఓడరేవుతో సహా కొట్టుకుపోయాయి. అప్పట్లో వేటకు వెళ్లిన వందలాది మత్స్యకారులు మృత్యువాతపడ్డారు. ఇంటి యజమానులు మృత్యువాత పడటంతో జీవనోపాధి కోసం ఇక్కడి మహిళలు కొబ్బరి, తాటి నారతో తాళ్లు తయారుచేసి విక్రయించడం ప్రారంభించారు. అలా మొదలైన తాళ్ల తయారీ తాళ్లరేవులో కుటీర పరిశ్రమగా మారింది. ప్రస్తుతం మహిళలు, పురుషులు సైతం తాళ్లను తయారు చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. తాళ్లరేవు ప్రాంతంలో కొబ్బరి, తాటి, నైలాన్, ప్లాస్టిక్ తాళ్లను తయారు చేస్తున్నారు. అర అంగుళం నుంచి అడుగున్నర మందంతో భారీ తాళ్లను సైతం ఇక్కడ తయారు చేస్తున్నారు. ఓడలకు, ఫైబర్ బోట్లకు వినియోగించే తాళ్లు కూడా ఇక్కడ తయారవుతున్నాయి. రథాలకు వినియోగించే పగ్గాలను సైతం ఇక్కడే తయారు చేస్తున్నారు. ఏటా 900 టన్నుల తాళ్ల ఎగుమతి ఏటా 900 టన్నుల వరకు తాళ్లు ఇక్కడ తయారవుతున్నాయి. తెలంగాణ, గుజరాత్, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాలకు ఇక్కడి తాళ్లను ఎగుమతి చేస్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార లావాదేవీలు ప్రారంభించిన సందర్భంలో కోరంగిలో ఓడలు రాకపోకలకు వీలుగా ఓడ రేవును ఏర్పాటు చేయడమే తాళ్ల పరిశ్రమలు ఏర్పాటుకు దోహదం చేసింది. మేడిది.. పెమ్మాడి వంశీకులతో మొదలై.. తొలుత ఈస్ట్ ఇండియా వ్యాపారులతో పెనవేసుకున్న తాళ్ల బంధం కాస్తా వారసత్వ సంపదగా మారింది. తొలినాళ్లలో తాళ్లరేవుకు చెందిన మేడిది, పెమ్మాడి వంశీయులు తాళ్లు తయారుచేసే వారు. తాళ్ల తయారీ వంశపారంపర్యంగా మారి నాలుగు తరాలుగా నేటికీ కొనసాగుతుండటం విశేషం. ఇక్కడ తయారయ్యే తాళ్లను టన్నుల కొద్దీ చెన్నై, కేరళ, ముంబై, కోల్‌కతా, గుజరాత్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఓడలు, బోట్లలో వినియోగించిన అనంతరం వృథాగా వదిలేసే పగ్గాలను తక్కువ ధరకు తాళ్లరేవు గ్రామస్తులు వేలంలో కొనుగోలు చేస్తుంటారు. రాష్ట్రంలోని పలు పోర్టులతోపాటు ఇతర రాష్ట్రాల్లోని పోర్టులలో వేలం వేసే పాత తాళ్లను కొనుగోలు చేస్తుంటారు. వాటిని గ్రేడింగ్ చేసి.. శుద్ధిచేసి కొత్త తాళ్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. బ్రిటిష్ కాలం నుంచీ.. బ్రిటిష్ కాలం నుంచి తాళ్లరేవు, కోరంగిలలో తాళ్లు తయారు చేస్తున్నాం. నాలుగు తరాలుగా తాళ్ల తయారీలో నిపుణులు ఇక్కడ ఉన్నారు. కోరంగిలో ఓడరేవు ఉండడంతో ఓడలు భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చేవి. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులు, బ్రిటిషర్లు కోరంగిని వ్యాపార కేంద్రంగా ఎంచుకోవడంతో భారీ నౌకలు, బోట్లు, నావలను తాళ్లరేవులో తయారు చేసేవారు. అలా ఓడలకు అవసరమైన తాళ్లు, మేకులు తదితర పరిశ్రమలు అప్పట్లో కోరంగి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. ఇప్పటికీ తాళ్ల తయారీని కొనసాగుతోంది. – పెమ్మాడి కాశీ విశ్వనాథం, బోట్ల తయారీ యూనిట్ ప్రతినిధి ప్రత్యేక ప్రావీణ్యత ఉంది మా తాత ముత్తాతల నుంచి తాళ్లు తయారు చేస్తున్నాం. తాళ్ల తయారీయే వృత్తిగా కొనసాగుతోంది. రోజుకు రూ.300 నుంచి రూ.600 వరకు సంపాదిస్తాం. తాళ్ల తయారీకి సంబంధించి మాకు ప్రత్యేక ప్రావీణ్యత ఉంది. మా దగ్గర తాడు తీసుకెళ్లిన వారు మళ్లీమళ్లీ కొనుగోలు చేస్తుంటారు. – మందపల్లి జ్యోతిబాబు, తాళ్ల తయారీ కార్మికుడు -
సత్తా చాటిన భారత నౌకాదళం
న్యూఢిల్లీ: ఇటీవలికాలంలో ఎన్నడూలేనంతగా భారత నౌకా దళం ఒకేసారి భారీ సంఖ్యలో నౌకలు, జలాంతర్గాములతో యుద్ధవిన్యాసం చేసి ఔరా అనిపించింది. అరేబియా సముద్రం ఇందుకు వేదికైంది. ట్విన్ క్యారియర్ బ్యాటిల్ గ్రూప్(సీబీజీ) ఆపరేషన్స్ పేరిట నిర్వహించిన ఈ యుధ్ధవిన్యాసం నౌకాదళ పోరాట పటిమను ప్రపంచానికి మరోమారు తెలియజెప్పిందని భారత నౌకాదళ తర్వాత ఒక వీడియోను ట్విట్‌చేసింది. యుద్ధవిమాన వాహకనౌకలైన ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్‌లుసహా పలు రకాల యుద్ధనౌకలు, జలాంతర్గాములు, 35కుపైగా యుద్ధవిమానాలను సమన్వయం చేసుకుంటూ ఏకకాలంలో ఈ ఆపరేషన్స్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు భారత నౌకాదళం ప్రకటించింది. మిగ్–29కే, ఎంహెచ్ 60ఆర్, కమోవ్, అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు సైతం ఈ విన్యాసాల్లో పాలుపంచుకున్నాయని నేవీ అధికారులు శనివారం చెప్పారు. అయితే ఈ ఆపరేషన్స్‌ను ఎప్పుడు నిర్వహించారో వెల్లడించలేదు. సముద్ర ఆధారిత గగనతల శక్తిసామర్థ్యాలు, హిందూమహా సముద్ర జలాలు, ఆవల సైతం భద్రతా భాగస్వామిగా భారత కీలకపాత్రను ఈ ఆపరేషన్ చాటిచెప్పిందని నేవీ ప్రతినిధి వివేక్ మథ్వాల్ వ్యాఖ్యానించారు. దేశీయ తయారీ ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సెప్టెంబర్‌లో విధుల్లోకి తీసుకున్నాక చేపట్టిన తొలి భారీ విన్యాసమిది. యుద్ధవిమాన వాహకనౌకలు, జలాంతర్గాములు, ఫ్రిగేట్, డెస్ట్రాయర్, ఇతర నౌకలు, హెలికాప్టర్లు, విమానాలు ఇలా అన్నింటి కలపుకుంటూ కదనరంగంలోకి దిగితే ఈ బృందాన్ని క్యారియర్ బ్యాటిల్ గ్రూప్(సీబీజీ)/ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ అంటారు. -
Real Ghost Ships Photos: భూమ్మీది టాప్ 15 దెయ్యం నౌకలు.. ఉత్త ప్రచారం మాత్రం కాదు!
-
విశాఖ: ఇది ఆరంభం మాత్రమే.. హిందుస్థాన్ షిప్ యార్డ్ కొత్త రికార్డు!
నౌకల నిర్మాణం, మరమ్మతుల విషయంలోనూ హిందుస్థాన్ షిప్ యార్డు తనదైన ముద్ర వేస్తోంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల నిర్మాణంలో దూసుకుపోతూ.. మరోవైపు సాంకేతికతకు పదును పెడుతోంది. భారత నౌకాదళం కోసం నిరి్మస్తున్న షిప్లో తొలిసారిగా 3 మెగావాట్ల భారీ డీజిల్ జనరేటర్ ఏర్పాటు చేసి అబ్బురపరిచింది. సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ దేశాలకు చెందిన సంస్థలు జత కడుతున్న నేపథ్యంలోనౌకా నిర్మాణంలో హిందుస్థాన్ షిప్‌యార్డు సరికొత్త అధ్యాయాల్ని లిఖిస్తోంది. ఎలాంటి నౌకలు, సబ్మెరైన్ల మరమ్మతులు, నిర్మాణాలనైనా రికార్డు సమయంలో పూర్తి చేస్తూ ఆయా సంస్థలకు అప్పగిస్తున్న హిందుస్థాన్ షిప్‌యార్డు దేశంలోనే అతిపెద్ద ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా దూసుకుపోతోంది. తాజాగా భారత నౌకాదళం కోసం డైవింగ్ సపోర్ట్ వెసల్ షిప్లో తొలిసారిగా 3 మెగావాట్ల భారీ డీజిల్ జనరేటర్ ఏర్పాటు చేసి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల తయారీకి ఉపక్రమించిన హిందుస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) భారత నౌకాదళానికి చెందిన షిప్ తయారీలో ప్రత్యేక వ్యవస్థని అందుబాటులోకి తీసుకొచి్చంది. సాంకేతిక సంస్కరణలు చేసుకుంటూ నౌకా నిర్మాణం, మరమ్మతుల విషయంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. డీప్సీ డైవింగ్, సబ్‌మెరైన్ రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఐఎన్ఎస్ నిస్టార్, ఐఎన్ఎస్ నిపుణ్ యుద్ధనౌకల్ని తయారు చేస్తోంది. తొలిసారిగా యుద్ధ నౌకలో 3 మెగావాట్ల డీజిల్ జనరేటర్ ఏర్పాటు చేసి చారిత్రక అధ్యాయాన్ని లిఖించింది. ఐఎన్ఎస్ నిస్టారాలో గురువారం ఉదయం ఈ భారీ జనరేటర్‌ని ఏర్పాటు చేశారు. సాధారణంగా ప్రతి యుద్ధ నౌకలోనూ 5 జనరేటర్లు ఉంటాయి. నిర్మాణ సమయంలో మొదటి జనరేటర్ సేవలు ప్రారంభిస్తే.. నౌకానిర్మాణం దాదాపు పూర్తయినట్లేనని భావిస్తారు. ఈ జనరేటర్ ప్రారంభమైతే.. షిప్‌కు కావాల్సిన విద్యుత్ ఉత్పత్తి మొదలవుతుంది. ఇప్పటివరకూ 2 మెగావాట్ల డీజిల్ జనరేటర్లు మాత్రమే వినియోగించారు. కానీ.. నిస్టార్కు మాత్రం 3 మెగావాట్ల జనరేటర్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. షిప్‌యార్డు డిజైన్ మేనేజర్ ఉషశ్రీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కారి్మకులు నిరంతరం శ్రమించి దీనిని రూపొందించారు. ఈ జనరేటర్ ప్రారంభంతో నిస్టార్ షిప్ పనులు 90 శాతం వరకూ పూర్తయ్యాయని షిప్‌యార్డు వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది చివరి నాటికి ఐఎన్ఎస్ నిస్టార్ను భారత నౌకాదళానికి అప్పగించేందుకు షిప్‌యార్డు బృందం నిరంతరం శ్రమిస్తోంది. ఈ యుద్ధనౌక నిర్మాణ ప్రాజెక్టును రూ.2,100 కోట్ల వ్యయంతో హెచ్ఎస్ఎల్ చేపడుతోంది. -
అత్యాధునిక డీప్ సీ డ్రైవింగ్ నౌకలను ప్రారంభించిన నేవీ
-
Russia Ukraine War: విదేశీ నౌకలకు సేఫ్ కారిడార్
కీవ్/దావోస్: నల్ల సముద్రంలోని ఓడ రేవుల నుంచి విదేశీ నౌకలు భద్రంగా బయటకు వెళ్లేందుకు వీలుగా సేఫ్ కారిడార్ తెరుస్తామని రష్యా రక్షణ శాఖ హామీ ఇచ్చింది. మారియూపోల్ నుంచి నౌకలు వెళ్లడానికి మరో కారిడాన్ ప్రారంభించనున్నట్లు రష్యా రక్షణశాఖ ప్రతినిధి మైఖేల్ మిజింజ్‌సెవ్ చెప్పారు. ఒడెసా, ఖేర్సన్, మైకోలైవ్‌తో సహా నల్లసముద్రంలోని ఆరు పోర్టుల్లో ప్రస్తుతం 16 దేశాలకు చెందిన 70 నౌకలు ఉన్నాయని అన్నారు. కారిడార్లు ప్రతిరోజూ తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. మారియూపోల్ పోర్టులో కార్యకలాపాలు మూడు నెలల తర్వాత పునఃప్రారంభమైనట్లు రష్యా సైన్యం తెలియజేసింది. నల్లసముద్రంలోని ఓడ రేవుల్లో రష్యా సైన్యం పాగావేసింది. నౌకల రాకపోకలను అడ్డుకుంటోంది. దీనివల్ల ఉక్రెయిన్ నుంచి విదేశాలకు ఆహార ధాన్యాల సరఫరా నిలిచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో రష్యా దిగివచ్చింది. ఉక్రెయిన్ ఆయుధ సామగ్రి ధ్వంసం: రష్యా ఉక్రెయిన్‌లోని పొక్రోవ్స్క్లో ఓ రైల్వేస్టేషన్ వద్ద ఉక్రెయిన్ ఆయుధ సామగ్రిని తమ సైన్యం ధ్వంసం చేసిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. యుద్ధ విమానాలతో రైల్వేస్టేషన్‌పై దాడి చేసినట్లు చెప్పారు. మైకోలైవ్ రీజియన్‌లోని దినిప్రొవ్‌స్కీలో ఉక్రెయిన్ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సెంటర్‌ను నేలమట్టం చేశామని వివరించారు. ఈ ఘటనలో11 మంది ఉక్రెయిన్ సైనికులు, 15 మంది విదేశీ నిపుణులు మరణించారని పేర్కొన్నారు. గత 24 గంటల్లో ఉక్రెయిన్‌పై భీకర దాడులు జరిపినట్లు కొనాషెంకోవ్ వివరించారు. 500 టార్గెట్లపై విరుచుకుపడినట్లు తెలిపారు. లుహాన్స్క్, డొనెట్స్క్లో ప్రస్తుతం 8,000 మంది ఉక్రెయిన్ జవాన్లు తమ ఆధీనంలో ఉన్నారని వేర్పాటువాదుల ప్రతినిధి రొడియోన్ మిరోష్నిక్ చెప్పారు. వాస్తవాన్ని ఉక్రెయిన్ గుర్తించాలి: పెస్కోవ్ క్రిమియాపై రష్యా సార్వభౌమత్వాన్ని ఉక్రెయిన్ గుర్తిస్తుందని ఆశిస్తున్నామని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ గురువారం అన్నారు. ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల సరఫరా పునఃప్రారంభం కావాలంటే రష్యాపై కొన్ని ఆంక్షలను పశ్చిమ దేశాలు సడలించాలని పెస్కోవ్ తెలిపారు. మళ్లీ వడ్డీ రేటు తగ్గించిన రష్యా సెంట్రల్ బ్యాంకు ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడానికి గాను రష్యా సెంట్రల్ బ్యాంకు రుణాలపై వడ్డీ రేటును 14 శాతం నుంచి 11 శాతానికి తగ్గించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వడ్డీ రేటును ఏకంగా 20 శాతం పెంచింది. అప్పటి నుంచి వడ్డీ రేటును మూడు పాయింట్లు తగ్గించడం ఇది మూడోసారి. -
యుద్ధ నౌకల తయారీకి, నావల్ గ్రూప్‌తో జీఆర్ఎస్ఈ జట్టు
కోల్‌కతా: మేకిన్ ఇండియాను మేక్ ఫ్రమ్ ఇండియాగా మార్చే కార్యక్రమానికి మద్దిస్తూ మినీరత్న పీఎస్‌యూ.. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, ఇంజినీర్స్(జీఆర్ఎస్ఈ) తాజాగా నావల్ గ్రూప్ ఫ్రాన్స్‌తో చేతులు కలిపింది. సర్ఫేస్ నౌకల తయారీకి అనువైన సాంకేతిక సహకారం కోసం అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది. తద్వారా దేశ, విదేశీ నౌకాదళాలకు అవసరమయ్యే అత్యున్నత యుద్ధనౌకల తయారీని చేపట్టనుంది. ఇందుకు రెండు సంస్థల అధికారులూ ఎంవోయూపై సంతకాలు చేశారు. యూరోపియన్ నౌకాదళ పరిశ్రమలో లీడర్‌గా నిలుస్తున్న నావల్ గ్రూప్‌తో జట్టు కట్టడం ద్వారా జీఆర్ఎస్ఈ గోవిండ్ డిజైన్ ఆధారిత యుద్ధ నౌకలను జీఆర్ఎస్ఈ రూపొందించనుంది. ఎగుమతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాంకేతికతో నౌకల తయారీని చేపట్టేందుకు పరస్పరం సహకరించుకోనున్నాయి. వెరసి దేశ, విదేశీ నావికా దళాల కోసం జీఆర్ఎస్ఈ 100 యుద్ధ నౌకలను నిర్మించనుంది. -
కరోనా కలకలం : పోర్టుల్లో హై అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ : వేగంగా విస్తరిస్తున్న కోవిడ్-19ను నిలువరించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. చైనా సహా కరోనా ప్రభావిత దేశాల నుంచి నౌకల్లో భారత్‌కు వచ్చిన 16.075 మంది ప్రయాణీకులు, నౌకా సిబ్బందిని భారత పోర్టుల్లోకి అనుమతించడం లేదని నౌకాయాన మంత్రిత్వ శాఖ అధికారి వెల్లడించారు. 452 నౌకల్లో భారత్‌కు చేరుకున్న ప్రయాణీకులు, సిబ్బందికి అవసరమైన సాయం చేస్తున్నామని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా వీరికి ఆయా పోర్టుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నౌకల్లో తరలివచ్చిన వారికి జ్వరం ఇతర లక్షణాలు బయటపడితే ప్రోటోకాల్‌ను అనుసరించి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు. పారదీప్ పోర్టులో ఓ నౌక ఉద్యోగి జ్వరంతో బాధపడుతుంటే అతడితో పాటు భార్యను కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీకి తరలించి పరీక్షలు చేస్తున్నారని చెప్పారు. చైనాలోని జపు నుంచి ఫిబ్రవరి 10న బయలుదేరిన ఈ నౌక మార్చి 1 పారదీప్‌కు చేరుకుంది. చదవండి : కరోనా పుణ్యమా.. గూగుల్ వేటలో అదే టాప్ -
మంటల్లో చిక్కుకున్న రెండు నౌకలు
-
నడి సంద్రంలో భారీ అగ్ని ప్రమాదం
మాస్కో : భారత్, టర్కిష్, లిబయాన్ సిబ్బందితో వెళ్తున్న రెండు నౌకలు నడి సంద్రంలో అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 11 మంది మరణించిగా.. 9 మంది గల్లైంతనట్లు రష్యా న్యూస్ ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి. రష్యా నుంచి క్రిమియా ద్వీపకల్పాన్ని వేరు చేసే కెర్చ్ జలసంధి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. వివరాలు.. సోమవారం ప్రమాదానికి గురైన రెండు షిప్పుల్లో ఒకటి సహజవాయువును మోసుకువెళ్తుండగా.. మరొకటి ట్యాంకర్ నౌక అని స్థానిక మీడియా తెలిపింది. ఒక నౌక నుంచి మరొక నౌకలోకి ఇంధనం మార్చుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన క్యాండీ అనే షిప్పులో 17 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 9మంది టర్కీ పౌరులు కాగా, ఎనిమిది మంది భారతీయులు. మరో నౌక మేస్ట్రోలో 15 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 7గురు టర్కీ పౌరులు, ఏడుగురు భారతీయులు కాగా మరోకరు లిబియాకు చెందిన వారని రష్యా అధికారులు తెలిపారు. ఒక నౌకలో పేలుడు సంభవించటంతో చెలరేగిన మంటలు మరో షిప్పుకు అంటుకున్నాయని పేర్కొన్నారు. మంటలు వ్యాపించగానే రెండు నౌకల్లోని మొత్తం 32 మంది సిబ్బంది సముద్రంలోకి దూకారని, వారిలో ఇప్పటి వరకూ 12 మందిని సహాయక సిబ్బంది రక్షించి తీరానికి చేర్చారని వెల్లడించారు. కాగా ఈ ప్రమాదంలో 11మంది చనిపోయారని, మరో 9 మంది ఆచూకీ తెలియరాలేదని తెలిపారు. అయితే మృతుల్లో భారతీయులు ఉన్నారా లేరా అనే విషయం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల తీవ్ర ఆటంకం ఏర్పడుతోందన్నారు అధికారులు. -
కొత్తరకం విధ్వంసక నౌకను నిర్మిస్తున్న చైనా
బీజింగ్: శత్రువుల యుద్ధ విమానాలు, క్షిపణులు, నౌకలు, జలాంతర్గాములను నాశనం చేయగలిగిన కొత్తరకం విధ్వంసక నౌకను చైనా నిర్మిస్తోందని ఆ దేశ మీడియా శుక్రవారం వెల్లడించింది. పది వేల టన్నుల బరువుండే ఈ విధ్వంసక నౌక నిర్మాణం ప్రస్తుతం తుది దశలో ఉందనీ, షాంఘైలోని జియాంగ్నన్ రేవులో పనులు జరుగుతున్నాయని జిన్హువా న్యూస్ తెలిపింది. ఆర్మీ అధికారులు, సైనికుల నుంచి అభిప్రాయాలు సేకరించిన అనంతరం విధ్వంసక నౌకలో ప్రస్తుతం స్వల్ప మార్పులు చేస్తున్నారనీ, తర్వాత సముద్రంలో పరీక్షించాల్సి ఉందని వార్తా సంస్థ పేర్కొంది. -
చైనాపై ఫిలిప్పీన్స్‌కు అండగా జపాన్
టోక్యో: చైనాతో దక్షిణ చైనా సముద్ర ప్రాదేశిక జలాల విషయంలో పోరాడుతున్న ఫిలిప్పీన్స్‌కు జపాన్ బాసటగా నిలిచింది. దక్షిణ చైనా సముద్రంపై తన వాటా కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ఫిలిప్పీన్స్‌కు అండగా ఉంటామని, వారి సేనలకు తాము యుద్ధ నౌకలతోపాటు నిఘా విమానాలను పంపిస్తామని చెప్పింది. ఈ మేరకు జపాన్ ప్రధాని షింజో అబే మంగళవారం ఒక ప్రకటన కూడా చేశారు. రెండు పెట్రోల్ యుద్ధ నౌకలను, ఐదు నిఘా యుద్ధ విమానాలను ఫిలిప్పీన్స్‌కు సహాయంగా పంపించేందుకు తాము అంగీకరిస్తున్నట్లు జపాన్ ప్రధాని తెలిపారు. దక్షిణ చైనా సముద్రంపై చైనాతో ఉన్న వివాదాన్ని శాంతియుత పరిష్కరించే క్రమంలో భాగంగా ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డుటెర్టీ, జపాన్ ప్రధాని షింజో ఒక ఒప్పందానికి వచ్చినట్లు జపాన్ డిప్యూటీ కేబినెట్ చీఫ్ సెక్రటరీ కోయిచి హగుదా చెప్పారు. -
అతిపెద్ద మానవరహిత నౌక
శాన్ డియాగో(అమెరికా): డ్రోన్లు, డ్రైవర్ లేని కార్లలాగానే కెప్టెన్లు లేకుండా ప్రయాణించే నౌకలు వచ్చేస్తున్నాయి. ప్రపంచంలో అతి పెద్ద మానవరహిత నౌకను పెంటగాన్‌లో మంగళవారం ప్రదర్శించారు. 132 అడుగులున్న ఈ నౌక... నీటి లోపలున్న జలాంతర్గాములను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇది 10,000 నాటికల్ మైళ్ల వరకు ప్రయాణించగలదని సైనిక పరిశోధన విభాగం డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ తెలిపింది. నౌకను రెండు సంవత్సరాల పాటు శాన్‌డియాగో తీరంలో పరీక్షించనున్నారు. -
ఇక మనదేశంలోనూ ఆ తరహా పెళ్లిళ్లు
ఆహ్లాదకరమైన వాతావరణంలో, జీవితాంతం గుర్తుండిపోయేలా తమ పెళ్లి వేడుక జరుపుకోవాలని అనుకోవడం మామూలే. కాసులకు వెరవకుండా.. నింగిపై.. నేలపై అంటూ విభిన్నంగా ఆలోచించే జంటలకు కూడా మన దేశంలో కొదవలేదు. ఈ ఆలోచనలనే మన ప్రభుత్వం క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. అందుకే నడి సముద్రంలో ముచ్చటగా మూడు ముళ్ల తంతును అత్యంత రొమాంటిక్‌గా జరిపించడానికి కేంద్రప్రభుత్వం ఆలోచిస్తోంది. కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. విదేశాల్లో కాసులు కురిపిస్తున్న ఈ తరహా పెళ్లిళ్లను త్వరలో మన దేశంలో కూడా పరిచయం చేయబోతున్నట్టు తెలిపారు. సముద్రంలో విహారానికి వినియోగించే విహార ఓడలను వివాహ వేదికలుగా అద్దెకు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, సముద్రంలోను, ఆకాశమార్గాన విహరించేందుకు సీ ప్లేన్ సేవలను కూడా ప్రారంభించనున్నామని వెల్లడించారు. నడి సముద్రంలో ఓడలపై కొత్త తరహా పెళ్లి వేదికలకు శ్రీకారం చుట్టునున్నామని ఆయన తెలిపారు. వీటి ఆమోదం కోసం పౌరవిమానయాన సంస్థ డైరెక్టర్ జనరల్‌కు పంపామన్నారు. దీంతోపాటు అదనంగా విందు, వినోదం లాంటి సకల సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. అంటే ఇక హిందూ మహాసముద్రంపైనో.. బంగాళాఖాతం నట్ట నడిమధ్యనో లేదా అరేబియా సముద్రంపైనో విలాసంగా వధూవరులు విహరించవచ్చన్నమాట. అయితే మొదట కొచ్చిన్ , చెన్నై, ముంబైలలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు వీలుగా షిప్పింగ్, పర్యాటకశాఖ సంయుక్త ఆధ్వర్యంలో కొత్త పర్యాటక విధానాలను రూపొందించనున్నట్టు తెలిపారు. భూమి మీద, నీటి మీద కూడా ల్యాండయ్యే విమానాలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామన్నారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్లు, సముద్ర విమానాల లాంటి సేవలతో పాటు ఈ క్రూయిజ్ పర్యాటక పెట్టుబడిలో ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నట్టు గడ్కరీ తెలిపారు. ఇప్పటికే 101 జలమార్గాలలో ఇలాంటి 25 విమానాలను నడిపేందుకు ప్రైవేట్ సంస్థ నుంచి ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే మెరుగ్గా 7,500 కి.మీ పొడవైన తీరప్రాంతం ఉన్నా.. భారతదేశంలో ఈ తరహా పర్యాటక అభివృద్ధి తక్కువగా ఉందన్నారు. అందుకే ఈ తరహా అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు. -
నౌకలు.. నిధుల జాడలు..
చరిత్రలో నౌకా ప్రమాదాలు చాలానే జరిగాయి. గమ్యం చేరకుండానే సముద్ర గర్భంలో కలిసిపోయిన పడవలు ఎన్నో. ప్రమాదాలు, వేరే పడవలు ఢీకొనడం, సముద్రపు దొంగల దాడులు.. ఇలా అనేక కారణాలతో పడవలు మునిగిపోతాయి. అలా సముద్రం ఒడి చేరిన చాలా నౌకల్లో కోట్ల విలువ చేసే సంపద కలిగినవి ఎన్నో ఉన్నాయి. సముద్ర గర్భంలో దాగిన సంపదను కనుక్కోవడం ఒకప్పుడుసాధ్యమయ్యేది కాదు. కానీ ఇప్పుడు అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని నౌకల జాడలను కనుగొని వాటిలోని విలువైన నిధుల్ని వెలికి తీస్తున్నారు. అనేక సంస్థలు, దేశాలు సాగిస్తున్న అన్వేషణ ద్వారా మునిగిపోయిన నౌకల నుంచి భారీ సంపద వెలుగులోకొచ్చింది. అలా ఓడల నుంచి వెలికి తీసిన సంపద గురించి తెలుసుకుందాం... ద డైమండ్.. నౌకల ద్వారా లభించిన నిధుల్లో మరో చెప్పుకోదగ్గ సంపద కలిగిన పడవ ద డైమండ్. పోర్చుగీసుకు చెందిన ఈ నౌక 1533లో మునిగిపోయినట్లు అంచనా. ఈ పడవలో వివిధ లోహపు కడ్డీలు, ఫిరంగులు, కత్తులు, 50కి పైగా ఏనుగు దంతాలు, బంగారు నాణేలు వంటి ఇతర సంపద ఉంది. ఇన్ని నిధులతో మునిగిపోయిన ఈ నౌకను కనుగొనేందుకు సముద్రాల్లో పెద్దగా అన్వేషణ ఏమీ జరగలేదు. ఎందుకంటే దీని గురించి బయటివారికి తెలిసింది తక్కువే. మరి ఈ పడవ ఎలా లభించిందీ అనుకుంటున్నారా? 16వ శతాబ్దంలో మునిగిపోయిన ఈ పడవ ఆఫ్రికాలో సముద్రపు ఒడ్డున ఓ బీచ్‌కి ఎప్పుడో కొట్టుకువచ్చింది. అనంతరం ఇసుకలో కూరుకుపోయి అలాగే ఉండిపోయింది. దీన్ని స్థానికులు కూడా సాధారణ పడవే అయి ఉండొచ్చని ఎవరూ పట్టించుకోలేదు. కానీ డీబీర్స్ అనే వజ్రాల సంస్థ తరపున కొందరు నిపుణులు బీచ్‌లోని ఇసుకలో అన్వేషణ సాగిస్తుండగా ఈ నిధి లభ్యమైంది. ఇలా అనుకోకుండా భారీ సంపద కలిగిన నౌక గురించి ప్రపంచానికి తెలిసింది. ది ఆటోకా మదర్లోడ్.. అత్యంత భారీ సంపదతో మునిగిపోయిన పడవల్లో ఆటోకా మదర్లోడ్ ఒకటి. బంగారం, వెండి, నీలిమందు, రాగి, ఇతర ఆభరణాలతో కలిపి ఈ కార్గోషిప్‌ను నింపారు. ఇది ఎంత పెద్దదంటే ఈ మొత్తం నిధులతో కలిపి కార్గోను నింపేందుకే దాదాపు రెండు నెలల సమయం పట్టింది. 1622లో ఈ పడవ ఫ్లోరిడా తీరాన అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయింది. అప్పటినుంచి సముద్రగర్భంలో కలిసిన ఈ పడవను కనుగొనేందుకు చాలా అన్వేషణలే జరిగాయి. ఈ విషయంలో స్పెయిన్ తీవ్ర ప్రయత్నాలే చేసింది. అయితే సముద్రంలో అన్వేషణ సాగించడం అంత సత్ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కానీ మెల్ ఫిషర్ అనే ఓ అన్వేషకుడు మాత్రం దాదాపు పదిహేడేళ్లు శ్రమించి ఈ నౌక జాడను కనుగొన్నాడు. అతడి శ్రమ ఫలితంగా 1985 జూలైలో ఈ నౌక వెలుగులోకొచ్చింది. నౌకలో మునిగిపోయినట్లు భావిస్తున్న పూర్తి సంపదమాత్రం ఇంకా దొరకలేదు. కానీ ఈ నౌకలో ఉన్న మొత్తం సంపద విలువ నేటి కాలమానం ప్రకారం మూడు వేల కోట్లకుపైగా ఉంటుంది. పడవలోని కొద్దిపాటి నిధి మాత్రమే దొరకడంతో ఇంకా దీనిపై అన్వేషణ కొనసాగుతోంది. ఎస్.ఎస్. రిపబ్లిక్.. అమెరికాకు చెందిన ఈ నౌక 1865లో జార్జియా తీరంలో భారీ తుపాను కారణంగా మునిగిపోయింది. ఈ పడవలో 14,000 వరకు వివిధ కళాఖండాలు, 51,000కు పైగా అమెరికాకు చెందిన వెండి, బంగారు నాణేలు, ఖరీదైన గ్లాసులు, బాటిళ్లు సహా భారీ సంపద ఉండేది. విలువైన నిధులతో ముగినిపోయిన దీన్ని కనుగొనేందుకు ఒడిస్సీ సంస్థ రంగంలోకి దిగింది. చివరకు ఈ నిధిని ఆ సంస్థ కనుగొంది. కానీ ఆ పడవ ఎక్కడుందో కనుగొన్నది తన దగ్గరున్న సమాచారం ఆధారంగానే అని, అందుకే ఆ నిధి తనకే దక్కాలని ఓ వ్యక్తి ఒడిస్సీ సంస్థపై కేసు దాఖలు చేశాడు. కానీ 2004లో ఈ నిధి మొత్తం ఒడిస్సీకే దక్కేలా కోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్.ఎస్. గారిసోపా.. దాదాపు రెండు లక్షల కిలోలకు పైగా వెండి కలిగిన ఎస్.ఎస్.గారిసోపా నౌక 1941లో సముద్రంలో మునిగిపోయింది. జర్మన్‌కు చెందిన మరో నౌక జరిపిన దాడిలో గారిసోపా సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఇందులో ఉన్న మొత్తం వెండి విలువ దాదాపు పదమూడు వేలకోట్ల రూపాయల కంటే ఎక్కువే ఉంటుంది. సముద్రాల్లో నిధుల కోసం అన్వేషణ సాగించే ఒడిస్సీ మెరైన్ అనే సంస్థ దీన్ని కనుగొంది. సముద్రంలో లభించిన వాటిలో అతిపెద్ద లోహపు సంపద కలిగిన పడవ ఇదే. అయితే ఈ సంపద ఎవరికి దక్కాలనే విషయంలో ఒడిస్సీ సంస్థకూ, బ్రిటన్‌కు మధ్య కొంతకాలం వివాదం తలెత్తింది. చివరకు ఒప్పందం ప్రకారం ఒడిస్సీ సంస్థ 80 శాతం, బ్రిటన్ 20 శాతం నిధిని పంచుకున్నాయి. బెలిటంగ్.. భారీ సంపదతో లభించిన తొలి అరేబియన్ ఓడ ఇదే. దీన్ని 1998లో ఇండోనేషియా సముద్ర తీరంలో కనుగొన్నారు. ఈ నౌకలో విలువైన సామగ్రిని అన్వేషకులు గుర్తించారు. ఇందులో వెండి జాడులు, బంగారు కప్పులు, వెండితో తయారైన గిఫ్ట్ బాక్సులు, గిన్నెలు, వివిధ రత్నాలు, కెంపులువంటి అరుదైన ఆభరణలు ఎన్నో లభించాయి. వీటి మొత్తం విలువ దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. ఈ ఓడను సింగపూర్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. -
తీరానికి మృత దేహాలతో పడవలు
టోక్యో: మృత దేహాలతో తమ దేశ సముద్రతీరంలోకి వస్తున్న పడవలతో జపాన్ కలవరపడుతోంది. మృతదేహాలతో నిండిన పడవలు జపాన్ సముద్ర తీరంలోకి గత రెండు నెలలుగా కొట్టుకు వస్తున్నాయి. ఇప్పటి వరకు 12 చెక్క పడవల్లో మృతదేహాలు కొట్టుకు వచ్చాయి. కుళ్లి పోయిన స్థితిలో ఉన్న మొత్తం 22 మృతదేహాలను అందులోంచి వెలికి తీశారు. ఒక పడవలో లభించిన రెండు మృత దేహాలకు తలలు కూడా లేవు. మరో పడవలో మొత్తం 6 పుర్రెలు లభ్యమయ్యాయి. మొదటి పడవ అక్టోబర్‌లో సముద్రతీరంలోకి రాగా, నవంబర్, డిసెంబర్లో మరిన్ని వచ్చాయి. ఈ మిస్టరీ బోట్లకు సంబంధించి..అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, అందులోని వారంతా ఎలా మరణించారు, అన్న కోణంలో జపాన్ కోస్ట్ గార్డు అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. ఒక బోటు పై ఉత్తర కొరియా అక్షరాల్లో 'కొరియన్ పీపుల్స్ ఆర్మీ' అని రాసిఉంది. మరో బోటులో చినిగి పోయి, చీకిపోయి ఉన్న ఒక గుడ్డ ముక్క లభించింది. అది ఉత్తర కొరియా జాతీయ జెండాగా భావిస్తున్నారు. దీంతో ఈ బోట్లన్ని ఉత్తర కొరియా నుంచి వచ్చినట్టు జపాన్ అధికారులు భావిస్తున్నారు.