న్యూఢిల్లీ : ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అది చాలా ముఖ్యమైన నౌకామార్గం అయినందున ఎర్ర సముద్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి రన్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ విషయమై గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘మాకు వాణిజ్య స్వేచ్ఛ, రవాణా స్వేచ్ఛ రెండూ ముఖ్యమే. ఎర్ర సముద్రంలో జరుగుతున్న ఘటనలు కేవలం మమ్మల్నే కాదు. ప్రపంచంలోని చాలా దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి’అని జైస్వాల్ అన్నారు. డ్రోన్ దాడి కారణంగా గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో చిక్కుకున్న భారత్‌కు చెందిన వాణిజ్య నౌకలోని సిబ్బందిని భారత నేవీకి చెందిన ఐఎన్‌ఎస్ విశాఖపట్నం బుధవారం రాత్రి కాపాడింది.
ఈ నేపథ్యంలో ఎర్ర సముద్ర ఘటనలపై భారత్ స్పందించడం గమనార్హం. గాజాపై ఇజ్రాయెల్ దాడికి నిరసనగా గత కొద్ది రోజులుగా ఎర్ర సముద్రం నుంచి వెళుతున్న వాణిజ్య నౌకలపై హౌతీ మిలిటెంట్లు డ్రోన్‌లు, మిసైళ్లతో దాడి చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆసియా నుంచి యూరప్, ఆసియా వెళ్లే వాణిజ్య నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కంపెనీలకు షిప్పింగ్ ఖర్చు ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఇదీచదవండి.. ట్రంప్ చేతిపై ఎర్రమచ్చలేంటి.. ఫ్యాన్స్‌లో జోరుగా చర్చ
Comments
Please login to add a commentAdd a comment