టెహ్రాన్: ఎర్ర సముద్రంలో హౌతీ మిలిటెంట్ల దాడులు తప్పించుకోవడానికి వాణిజ్య నౌకలు కొత్త టెక్నిక్‌ను వాడుతున్నట్లు తెలుస్తోంది. చైనాతో సంబంధాలున్నట్లుగా సంకేతాలిస్తూ నౌకలు హౌతీల దాడుల నుంచి తప్పించుకుంటున్నాయి. నౌకలో అందరూ చైనా సిబ్బంది ఉన్నట్లు లేదంటే నౌక చైనాకు వెళుతోందని సంకేతాలిస్తే హౌతీలు దాడి చేయకుండా విడిచి పెడుతుండడంతో వాణిజ్య నౌకలు ఈ టెక్నిక్‌ను వాడుతుండటం విశేషం.
ఎలాంటి ఆటంకాలు లేకుండా తాజాగా ఎర్ర సముద్రాన్ని దాటిన ఐదు వాణిజ్య నౌకలు ఇదే టెక్నిక్‌ను వాడాయని సమాచారం. నిజానికి గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌తో లింకులున్న దేశాలకు చెందిన నౌకలపై మాత్రమే దాడి చేస్తామని ప్రటించిన హౌతీలు ఇజ్రాయెల్‌తో ఎలాంటి లింకులేని దేశాల వాణిజ్య నౌకలపైనా దాడులకు తెగబడుతున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం హౌతీలపై అమెరికా, బ్రిటన్‌లకు చెందిన బలగాలు వైమానిక దాడులకు దిగాయి. ఈ దాడులు ఇక ముందు కూడా కొనసాగుతాయని అమెరికా హెచ్చరించింది. ఆసియా నుంచి అమెరికా, యూరప్‌లకు వెళ్లేందుకు కీలక మార్గంగా ఉన్న ఎర్ర సముద్రంలో హౌతీలు దాడులకు దిగుతుండడంతో నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి గమ్యస్థానాలకు వెళుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment