సనా : ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడుల తీవ్రతను పెంచే ఉద్దేశం లేదని, కేవలం ఇజ్రాయెల్‌తో సంబంధమున్న నౌకలే తమ లక్ష్యమని యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ గ్రూపు ప్రకటించింది. అదే సమయంలో అమెరికా, బ్రిటన్‌లు తమపై చేస్తున్న దాడులకు స్పందిస్తామని స్పష్టం చేసింది.
ఈ మేరకు హౌతీల అధికార ప్రతినిధి మహ్మద్ అబ్దుల్‌సలామ్ ఓ వార్తా సంస్థకు ఈ విషయాలు వెల్లడించాడు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)ని తాము లక్ష్యంగా చేసుకోమని చెప్పారు. ‘మేం కొన్ని రూల్స్ పెట్టుకున్నాం. ఒక్క చుక్క రక్తం చిందవద్దని, ఎలాంటి ఆస్తి నష్టం జరగకూడదని నిర్ణయించుకున్నాం.
ఒక్క ఇజ్రాయెల్‌పైనే మా ఒత్తిడి. మిగిలిన ఏ దేశంపైనా ఒత్తిడి పెట్టడం మా ఉద్దేశం కాదు’అని సలామ్ స్పష్టం చేశాడు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన తర్వాత పాలస్తీనాకు మద్దతుగా ఎర్ర సుముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీలు డ్రోన్‌లు, మిసైళ్లతో దాడులకు దిగారు. తాజాగా అమెరికా, బ్రిటన్‌లు సంయుక్తంగా యెమెన్‌లోని హౌతీల స్థావరాలపై వైమానిక దాడులు చేశాయి. ఈ నేపథ్యంలో హౌతీలు తాము ఎవరిపైనా దాడులు చేయబోమని ప్రకటించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment