సాక్షి, న్యూఢిల్లీ : వేగంగా విస్తరిస్తున్న కోవిడ్-19ను నిలువరించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. చైనా సహా కరోనా ప్రభావిత దేశాల నుంచి నౌకల్లో భారత్‌కు వచ్చిన 16.075 మంది ప్రయాణీకులు, నౌకా సిబ్బందిని భారత పోర్టుల్లోకి అనుమతించడం లేదని నౌకాయాన మంత్రిత్వ శాఖ అధికారి వెల్లడించారు. 452 నౌకల్లో భారత్‌కు చేరుకున్న ప్రయాణీకులు, సిబ్బందికి అవసరమైన సాయం చేస్తున్నామని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా వీరికి ఆయా పోర్టుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నౌకల్లో తరలివచ్చిన వారికి జ్వరం ఇతర లక్షణాలు బయటపడితే ప్రోటోకాల్‌ను అనుసరించి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు. పారదీప్ పోర్టులో ఓ నౌక ఉద్యోగి జ్వరంతో బాధపడుతుంటే అతడితో పాటు భార్యను కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీకి తరలించి పరీక్షలు చేస్తున్నారని చెప్పారు. చైనాలోని జపు నుంచి ఫిబ్రవరి 10న బయలుదేరిన ఈ నౌక మార్చి 1 పారదీప్‌కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment