చైనాపై ఫిలిప్పీన్స్కు అండగా జపాన్
టోక్యో: చైనాతో దక్షిణ చైనా సముద్ర ప్రాదేశిక జలాల విషయంలో పోరాడుతున్న ఫిలిప్పీన్స్కు జపాన్ బాసటగా నిలిచింది. దక్షిణ చైనా సముద్రంపై తన వాటా కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ఫిలిప్పీన్స్కు అండగా ఉంటామని, వారి సేనలకు తాము యుద్ధ నౌకలతోపాటు నిఘా విమానాలను పంపిస్తామని చెప్పింది. ఈ మేరకు జపాన్ ప్రధాని షింజో అబే మంగళవారం ఒక ప్రకటన కూడా చేశారు.
రెండు పెట్రోల్ యుద్ధ నౌకలను, ఐదు నిఘా యుద్ధ విమానాలను ఫిలిప్పీన్స్కు సహాయంగా పంపించేందుకు తాము అంగీకరిస్తున్నట్లు జపాన్ ప్రధాని తెలిపారు. దక్షిణ చైనా సముద్రంపై చైనాతో ఉన్న వివాదాన్ని శాంతియుత పరిష్కరించే క్రమంలో భాగంగా ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డుటెర్టీ, జపాన్ ప్రధాని షింజో ఒక ఒప్పందానికి వచ్చినట్లు జపాన్ డిప్యూటీ కేబినెట్ చీఫ్ సెక్రటరీ కోయిచి హగుదా చెప్పారు.