south china sea dispute
-
Melbourne: ‘డ్రాగన్’కు చెక్..! సింగపూర్ కీలక నిర్ణయం
మెల్బోర్న్: ఆస్ట్రేలియాకు చెందిన కొత్త న్యూక్లియర్ సబ్మెరైన్లు సింగపూర్‌లోని చాంగీ నావల్ బేస్‌లో మోహరించేందుకు సింగపూర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మెల్బోర్న్లో జరుగుతున్న స్పెషల్ ఆసియాన్ సదస్సులో ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో సింగపూర్ ప్రధాని లీ లుంగ్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. భద్రత అంశంలో మా దేశంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నందుకుగాను ఆస్ట్రేలియాకు సింగపూర్ ప్రధాని లీ కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో సింగపూర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా నేవీ యుద్ధనౌకలు, సబ్ మెరైన్ల మోహరింపు గత ఏడాదితో పోలిస్తే 35 శాతం పెరిగిందని వాషింగ్టన్కు చెందిన ఆసియా మారిటైమ్ ట్రాన్స్పరెన్సీ ఇనిషియేటివ్ అనే సంస్థ వెల్లడించింది. దక్షిణ తూర్పు ఏసియాలో ఆస్ట్రేలియా న్యూక్లియర్ సబ్ మెరైన్లు మోహరించేందుకు అంగీకరించే విషయంలో ఈ ప్రాంతంలోని మిగతా దేశాలతో పోలిస్తే సింపూర్ వేగంగా సాహసోపేత నిర్ణయం తీసుకుందన్న వాదన వినిపిస్తోంది. ఇదీ చదవండి.. అమెరికా, సౌత్‌కొరియాకు నార్త్ కొరియా వార్నింగ్ -
చైనాకు ‘ఆసియాన్’ హెచ్చరిక!
న్యూఢిల్లీ: చైనాకు భారత్–ఆసియాన్ దేశాలు గట్టి సందేశమిచ్చాయి. దక్షిణ చైనా సముద్ర వివాదంపై భాగస్వామ్య పక్షాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని సమర్థంగా పకడ్బందీగా అమలుచేయాలని తీర్మానించాయి. క్లిష్టమైన సముద్ర తీర ప్రాంతాల్లో భద్రత, స్వేచ్ఛా నౌకాయానానికి అధిక ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని నిర్మూలించడానికి సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని అంగీకరించాయి. అలాగే భారత ప్రధాని మోదీ ఆసియాన్ దేశాధినేతలతో సముద్ర తీర రక్షణ, అనుసంధానత, వాణిజ్యం తదితరాలపై చర్చలు జరిపారు. 10 ఆసియాన్ దేశాధినేతలు పాల్గొన్న ఇండియా–ఆసియాన్ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ పేరిట ఏడు పేజీల ప్రకటనను గురువారం విడుదల చేశారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి దక్షిణ చైనా సముద్ర ఒప్పందాన్ని అమలుచేయాలని తీర్మానించారు. ఉగ్రవాదుల స్థావరాలు, నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయడానికి ఆసియాన్ నేతృత్వంలోని యంత్రాంగాన్ని అనుసరించి సామర్థ్యాలను పెంచుకోవాలని నిర్ణయించారు. ఉగ్ర కట్టడికి సీమాంతర ఉగ్రవాదుల కదలికలను నియంత్రించడంతో పాటు ఇంటర్నెట్, సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని అంగీకరించారు. భారత్–ఆసియాన్ దేశాల మధ్య సంబంధాలు ప్రారంభమై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ స్మారక స్టాంపులు విడుదల చేసి సదస్సును ప్రారంభించారు. ప్లీనరీ సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ..ఉమ్మడి సముద్ర తీరాల భద్రత కోసం భారత్ ఆసియాన్ దేశాలతో కలసి పనిచేయడానికి కట్టుబడి ఉందన్నారు. నేడు జరిగే గణతంత్ర దినోత్సవంలో ఆసియాన్ దేశాల నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. -
చైనా ఆధిపత్యానికి భారత్ బ్రేక్?
-
చైనా ఆధిపత్యానికి భారత్ బ్రేక్?
న్యూఢిల్లీ: అణు సరఫరా బృందం(ఎన్ఎస్ జీ)లో భారత్ సభ్యత్వానికి చైనా అడ్డు పుల్ల వేయడంతో భారత్-చైనాల మధ్య దౌత్య వాతావరణం వేడిక్కింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాద సంస్ధ జైష్-ఈ-మొహమ్మద్(జేఈఎమ్) చీఫ్ మసూద్ అజర్ పై అంతర్జాతీయ నిషేధం విధించాలని యూఎన్ లో భారత్ చేసిన ప్రపోజల్ కూ చైనా ససేమీరా అనడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు సన్నగిల్లాయి. దీంతో దక్షిణ చైనా సముద్రంపై హక్కులన్నీ తమవేనంటూ ఆధిపత్యాన్ని చెలాయించాలని చైనాకు షాక్ ఇవ్వాలని భారత్ నిర్ణయించుకుంది. దక్షిణ చైనా సముద్రంపై తమకూ హక్కులు ఉన్నాయని పేర్కొన్న ఇతర ఆసియా దేశాలతో( వియత్నాం, మలేసియా, ఫిలిప్పైన్స్, బ్రూనై) భారత్ సంబంధాలను బలపర్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. ఈ మేరకు అక్టోబర్ లో అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం దక్షిణ చైనా సముద్రంపై సంయుక్త ప్రకటన చేయాలని సింగపూర్ ను భారత్ కోరినట్లు తెలిసింది. అయితే అందుకు ఆ దేశం అందుకు ససేమీరా అన్నట్లు సమాచారం. దక్షిణ చైనా సముద్రంపై తమకూ హక్కు ఉందని సింగపూర్ ఎన్నడూ ప్రకటించలేదు. భూభాగాల వివాదాల్లోకి ప్రవేశించడానికి ఆ దేశం అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో దక్షిణ చైనా సముద్రం ప్రాంతంపై హక్కు గురించి జపాన్ తో భారత్ సంయుక్త ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో సమావేశానంతరం ఈ ప్రకటన వెలువడొచ్చు. వియత్నాంతో కలిసి కూడా భారత్ సంయుక్త ప్రకటన చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, సంయుక్త ప్రకటన చేయాలనే మనవిపై జపాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. దక్షిణ చైనా సముద్రంపై భారత్ తన అభిప్రాయాన్ని చెప్పాలని గత నెలలో జపాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. తూర్పు చైనా సముద్రంలో చైనా మాటను కాదని జపాన్ శరవేగంగా ఎదుగుతోంది. దీంతో జపాన్-చైనాల మధ్య కూడా దౌత్యపరంగా వాతావరణం వేడెక్కింది. చైనాపై ఎలాగైనా ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్న జపాన్ యూఎస్-2ఐ విమానాల ధరను తగ్గించి భారత్ కు విక్రయించాలని నిర్ణయించింది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న డ్రాగన్ దేశం ఇది మంచి విషయం కాదని వ్యాఖ్యానించింది. యాక్ట్ ఈస్ట్ పాలసీ జపాన్, వియత్నాంలతో సంబంధాలను బలపర్చుకోవడానికి భారత్ ప్రయత్నిస్తుండటం శుభపరిణామం. చైనా బాధిత దేశాలైన కొన్ని ఆసియా దేశాలతో రక్షణ, భద్రత అంశాల్లో కీలక ఒప్పందాలు చేసుకోవడానికి భారత్ యత్నిస్తోంది. జపాన్ కూడా వియత్నాంతో సంబంధాలను బలపర్చునే యత్నాలు చేస్తుండటంతో దక్షిణ చైనా సముద్రం తమదేనన్న చైనా ఆటలు సాగకపోవచ్చు. -
చైనాపై ఫిలిప్పీన్స్‌కు అండగా జపాన్
టోక్యో: చైనాతో దక్షిణ చైనా సముద్ర ప్రాదేశిక జలాల విషయంలో పోరాడుతున్న ఫిలిప్పీన్స్‌కు జపాన్ బాసటగా నిలిచింది. దక్షిణ చైనా సముద్రంపై తన వాటా కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ఫిలిప్పీన్స్‌కు అండగా ఉంటామని, వారి సేనలకు తాము యుద్ధ నౌకలతోపాటు నిఘా విమానాలను పంపిస్తామని చెప్పింది. ఈ మేరకు జపాన్ ప్రధాని షింజో అబే మంగళవారం ఒక ప్రకటన కూడా చేశారు. రెండు పెట్రోల్ యుద్ధ నౌకలను, ఐదు నిఘా యుద్ధ విమానాలను ఫిలిప్పీన్స్‌కు సహాయంగా పంపించేందుకు తాము అంగీకరిస్తున్నట్లు జపాన్ ప్రధాని తెలిపారు. దక్షిణ చైనా సముద్రంపై చైనాతో ఉన్న వివాదాన్ని శాంతియుత పరిష్కరించే క్రమంలో భాగంగా ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డుటెర్టీ, జపాన్ ప్రధాని షింజో ఒక ఒప్పందానికి వచ్చినట్లు జపాన్ డిప్యూటీ కేబినెట్ చీఫ్ సెక్రటరీ కోయిచి హగుదా చెప్పారు. -
చైనా.. భారత్‌ని చూసి నేర్చుకో!
న్యూఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పరోక్షంగా మన పొరుగుదేశం చైనాకు చురకలు అంటించారు. అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పులను ఏ విధంగా గౌరవించాలో భారత్‌ను చూసి చైనా నేర్చుకోవాలని హితవు పలికారు. దక్షిణ చైనా సముద్రంపై గుత్తాధిపత్యం తనకే ఉందని మొండిగా వాదిస్తున్న చైనా.. ఈ విషయంలో హెగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును బాహాటంగా ధిక్కరించిన సంగతి తెలిసిందే. కానీ, దక్షిణ సముద్రం తరహా వివాదమైన బంగ్లాదేశ్‌తో సముద్ర జలాల సరిహద్దుల విషయంలో భారత్ అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పును గౌరవించింది. తీర్పు ప్రకారం నడుచుకొని వివాదాన్ని ముగించింది. ఢిల్లీ ఐఐటీలో విద్యార్థులతో ముచ్చటిస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించిన జాన్ కెర్రీ భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. భారత్ చట్టానికి కట్టుబడే దేశమని కితాబిచ్చారు. (చదవండి: చైనాకు భారీ ఎదురుదెబ్బ!) ’బంగ్లాదేశ్‌తో సముద్ర జలాల సరిహద్దుల విషయంలో అంతర్జాతీయ తీర్పును ఒప్పుకోవడం ద్వారా భారత్ తన విశిష్టతను చాటుకుంది. వివిధ ప్రాంతాల్లో ప్రమాదకరంగా పరిణమిస్తున్న వివాదాల్లో పరిష్కరానికి ఇది నమూనాగా నిలుస్తుంది. దక్షిణ చైనా సముద్రం సహా పలు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఈ విధానం అనుసరణీయం’ అని కెర్రీ కొనియాడారు. దక్షిణ చైనా సముద్రం వివాదం విషయంలో సైనిక పరిష్కారానికి తావు లేదని ఆయన అన్నారు. అయితే, కష్టకాలంలో తన మిత్రదేశాలకు అమెరికా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. -
సముద్రం పై స్వరం పెంచిన చైనా
-
యుద్ధం దిశగా చైనా...
బీజింగ్: దక్షిణ చైనా సముద్రం విషయంలో అంతర్జాతీయ ట్రిబ్యునల్‌లో తమకు వ్యతిరేకత ఎదురైన నేపథ్యంలో యుద్ధాల్లో విజయాలు సాధించేలా తమ దేశ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)ని బలోపేతం చేసేందుకు చైనా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే హైటెక్ యుద్ధ పరికరాలు కలిగిన చైనా.. 23 లక్షల మందితో ప్రపంచంలోనే అతిపెద్దదైన తన ఆర్మీలో అధ్యక్షుడు జిన్‌పింగ్ సంస్కరణలు చేపడుతున్నారు. ఆదివారం పీఎల్ఏ 89 ఏట అడుగుపెడుతున్న తరుణంలో తమ ఆర్మీ సిబ్బందికి విజయం సాధించే దిశగా కఠినతరమైన శిక్షణ ఇవ్వడానికి నిర్ణయించారు. విప్లవాత్మకమైన, సమగ్రమైన మార్పులు చేయడానికి సంస్కరణలు తప్పనిసరి అని, వాటికి ఉన్న అడ్డంకులను తొలగించాల్సిందేనని ఈ సందర్భంగా జిన్‌పింగ్ చెప్పారు. అంతర్జాతీయంగా తమ ఖ్యాతికి తగ్గట్లు ఆర్మీని తయారు చేయడానికి సంస్కరణలు తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. 2013లో అధికారం చేపట్టినప్పటినుంచి పీఎల్ఏపై దృష్టి పెట్టిన జిన్‌పింగ్.. దానికి భారీఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. ఏటా 9.6లక్షల కోట్లు అమెరికా డాలర్లు కేటాయిస్తూ.. ఆర్మీకి పెద్ద మొత్తం ఖర్చు చేస్తున్న దేశాల్లో అమెరికా తర్వాతి స్థానంలో నిలిచారు. అంతేగాక తన నేతృత్వంలో పనిచేసే కేంద్రీయ మిలిటరీ కమిషన్‌ను ఏర్పాటు చేసి ఆర్మీపై నియంత్రణను తన చేతుల్లోకి తీసుకున్నారు. 40 మంది అత్యున్నత స్థాయి కమాండర్లతో పాటు ఇద్దరు రిటైర్డు మిలిటరీ చీఫ్‌లపై విచారణకు ఆదేశాలిచ్చారు. ఏ క్షణంలోనైనా, ఎలాంటి యుద్ధాన్ని అయినా ఎదుర్కొనేలా తమ ఆర్మీకి తర్ఫీదునిస్తున్నారు.