మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాకు చెందిన కొత్త న్యూక్లియర్ సబ్‌మెరైన్లు సింగపూర్‌లోని చాంగీ నావల్ బేస్‌లో మోహరించేందుకు సింగపూర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న స్పెషల్ ఆసియాన్ సదస్సులో ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో సింగపూర్ ప్రధాని లీ లుంగ్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
భద్రత అంశంలో మా దేశంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నందుకుగాను ఆస్ట్రేలియాకు సింగపూర్ ప్రధాని లీ కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో సింగపూర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా నేవీ యుద్ధనౌకలు, సబ్ మెరైన్ల మోహరింపు గత ఏడాదితో పోలిస్తే 35 శాతం పెరిగిందని వాషింగ్టన్‌కు చెందిన ఆసియా మారిటైమ్ ట్రాన్స్‌పరెన్సీ ఇనిషియేటివ్ అనే సంస్థ వెల్లడించింది. దక్షిణ తూర్పు ఏసియాలో ఆస్ట్రేలియా న్యూక్లియర్ సబ్ మెరైన్లు మోహరించేందుకు అంగీకరించే విషయంలో ఈ ప్రాంతంలోని మిగతా దేశాలతో పోలిస్తే సింపూర్ వేగంగా సాహసోపేత నిర్ణయం తీసుకుందన్న వాదన వినిపిస్తోంది.
ఇదీ చదవండి.. అమెరికా, సౌత్‌కొరియాకు నార్త్ కొరియా వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment