భారత్, టర్కిష్, లిబయాన్ సిబ్బందితో వెళ్తున్న రెండు నౌకలు నడి సంద్రంలో అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 11 మంది మరణించిగా.. 9 మంది గల్లైంతనట్లు రష్యా న్యూస్ ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి. రష్యా నుంచి క్రిమియా ద్వీపకల్పాన్ని వేరు చేసే కెర్చ్ జలసంధి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. వివరాలు.. సోమవారం ప్రమాదానికి గురైన రెండు షిప్పుల్లో ఒకటి సహజవాయువును మోసుకువెళ్తుండగా.. మరొకటి ట్యాంకర్ నౌక అని స్థానిక మీడియా తెలిపింది. ఒక నౌక నుంచి మరొక నౌకలోకి ఇంధనం మార్చుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.