‘నౌక’ చిచ్చు | Sri Lanka, the conflict will lead to the distribution of warships | Sakshi
Sakshi News home page

‘నౌక’ చిచ్చు

Published Wed, Sep 11 2013 6:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM

Sri Lanka, the conflict will lead to the distribution of warships

సాక్షి, చెన్నై: శ్రీలంకలో యుద్ధం పేరుతో జరిగిన మారణ హోమంలో వేలాదిగా ఈలం తమిళులు హతమయ్యారు. లక్షలాది మంది స్వదేశంలోనే శరణార్థులుగా మిగిలారు. వీరిని ఆదుకోవాలన్న డిమాండ్‌తో తమిళనాట ఆందోళనలు సాగుతున్నారుు. కేంద్రం తీరు మాత్రం మరోలా ఉంది. శ్రీలంకపై ఒత్తిడి పెంచుతున్నామని తమిళ ప్రజలకు భరోసా ఇస్తోంది. మరోవైపు శ్రీలంకకు ఆపన్న హస్తం అందిస్తోంది. అక్కడి అధికారులకు ఏకంగా తమిళనాడులోనే శిక్షణ ఇప్పిస్తోంది. ఈ చర్యలకు వ్యతిరేకంగా తరచూ ఆందోళనలు జరుగుతున్నారుు. నవంబర్‌లో శ్రీలంకలో జరగనున్న కామన్వెల్త్ సమావేశాలను భారత్ బహిష్కరించాలని అన్నాడీఎంకే, డీఎంకే, డీఎండీకే, పీఎంకే, సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే తదితర పార్టీలు డిమాండ్ చేస్తున్నారుు. ఈ విషయమై ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఒత్తిడి పెంచే విధంగా భారీ ఆందోళనలకు వివిధ పార్టీలు సమాయత్తమవుతున్నారుు. తాజాగా శ్రీలంకకు యుద్ధ నౌకలను భారత్ అందించనుందన్న వార్త కలకలం సృష్టిస్తోంది.
 
 యుద్ధ నౌకలు
 శ్రీలంకకు భారత్ యుద్ధ నౌకలను అందించే విధంగా గతంలో ఒప్పందం జరిగింది. కేంద్ర రక్షణశాఖ నేతృత్వంలో భారత్‌లో రూపొందించిన యుద్ధనౌకల్ని శ్రీలంకకు మరికొన్ని రోజుల్లో అందించనున్నారు. ఈ విషయం బయటకు రావడంతో తమిళనాట ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నారుు. పెరియార్ ద్రావిడ కళగం, నామ్ తమిళర్ ఇయక్కం, ఎండీఎంకే తదితర పార్టీలు కోయంబత్తూరులోని ఐఎస్‌ఎస్ అక్రానీ నౌకా కేంద్రం వద్ద ఆందోళనలు చేస్తున్నారుు. ఆందోళనలను ఉద్ధ­ృతం చేసే దిశగా రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నారుు.
 
 ప్రధాని దృష్టికి తీసుకెళతా
  శ్రీలంకకు యుద్ధ నౌకల పంపిణీ వివాదాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ దృష్టికి తీసుకెళతానని కేంద్ర సహాయమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. మంగళవారం చెన్నై నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఆయన మీనంబాకం విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. శ్రీలంకకు యుద్ధనౌకల పంపిణీని తమిళనాడులోని అన్ని పక్షాలూ (కాంగ్రెస్‌తో సహా) వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. అరుుతే ఇది కొత్తగా జరుగుతున్న పంపిణీ కాదన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఎప్పుడో శ్రీలంకతో కుదుర్చుకున్న ఒప్పందం ఆధారంగా ఈ పంపిణీ జరుగుతోందని వెల్లడించారు. దీన్ని ఉన్నట్లుండి నిలుపుదల చేయడం అనేది కొన్ని సమస్యలకు తావ్విచ్చే అవకాశం ఉందన్నారు. అరుుతే సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళతానని చెప్పారు. కామెన్వెల్త్ సమావేశాలకు వెళ్లాలా వద్దా అనే అంశంపై ప్రధాని ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement