చైనా ఆ బడ్జెట్ను పెంచుతోంది! | China to raise 2016 defence budget by 7-8 percent . | Sakshi
Sakshi News home page

చైనా ఆ బడ్జెట్ను పెంచుతోంది!

Published Fri, Mar 4 2016 10:48 AM | Last Updated on Sun, Sep 3 2017 7:00 PM

చైనా ఆ బడ్జెట్ను పెంచుతోంది!

చైనా ఆ బడ్జెట్ను పెంచుతోంది!

బీజింగ్: చైనా తన రక్షణ బడ్జెట్ను ఏ ఏటికాఏడూ పెంచుకుంటూ పోతోంది. గత సంవత్సరం రక్షణ బడ్జెట్ను 10.1 శాతం పెంచిన చైనా.. ఈ ఆర్థిక సంవత్సరం కూడా రక్షణ రంగానికి భారీగానే కెటాయింపులు జరపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

చైనా పార్లమెంట్.. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్లో వార్షిక బడ్జెట్ నివేదికను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అధికార ప్రతినిధి ఫు ఇంగ్ మీడియా సమావేశంలో  మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. రక్షణ శాఖ అవసరాలకు అనుగుణంగా ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో 7 నుంచి 8 శాతం వరకు రక్షణ బడ్జెట్ పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ పెరుగుదలకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు శనివారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ నివేదికలో వెల్లడి కానున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement