వాషింగ్టన్ : భారత సంతతికి చెందిన కశ్యప్ ప్రమోద్ పటేల్ (కాష్ పటేల్‌ను) అమెరికా రక్షణ కార్యదర్శి క్రిస్ మిల్లర్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ప్రకటించారు. ఈ మేరకు పెంటగాన్ ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎస్ రక్షణ కార్యదర్శిగా మార్క్ ఎస్పర్‌ను ట్రంప్ తొలిగించిన ఒకరోజు తర్వాత ఈ నియాయకం జరిగింది. ‘మార్క్ ఎస్పర్‌ని తొలగిస్తున్నాం. ఆయన దేశానికి అందించిన సేవలకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్క్ స్థానంలో క్రిస్ మిల్లర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జెన్ స్టీవర్ట్ స్థానంలో ఇండో-అమెరికాన్ కశ్యప్ పటేల్‌ను నియమించారు. గతంలో వైట్‌హౌస్ పర్మనెంట్ సెలెక్ట్ కమిటీలో జాతీయ ఉగ్రవాద నిరోధక సీనియర్ న్యాయవాదిగా పటేల్ పనిచేశారు. 2019 జూన్‌లో జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్‌సీ) సీనియర్ డైరెక్టర్‌గానూ సేవలందించారు. (రక్షణ శాఖా మంత్రి మార్క్ ఎస్పర్ తొలగింపు! )
న్యూయార్క్‌లో జన్మించిన కశ్యప్ పటేల్‌కు భారత్‌లోని గుజరాత్ మూలాలున్నాయి. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాకు చెందినవారు. 1970లో కెనడా నుంచి వచ్చి అమెరికాలోని న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. స్కూలింగ్ అనంతరం ఫ్లోరిడాలో పై చదువులు అభ్యసించిన కశ్యప్ పటేల్ వాషింగ్టన్ డీసీకి ప్రాసిక్యూరట్‌గా పనిచేశారు. ఆ తర్వాత తూర్పు ఆఫ్రికా, కెన్యా, అమెరికా సహా పలు ప్రాంతాల్లో పనిచేశారు. ఈ క్రమంలోనే ఆయనను డిఫెన్స్ విభాగంలోని స్పెషల్ ఆపరేషన్ కమాండో సభ్యునిగా యూఎస్ ప్రభుత్వం నియమించింది. (అధికార మార్పిడికి ట్రంప్ మోకాలడ్డు! )
Comments
Please login to add a commentAdd a comment