
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. సైబర్ నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో నూతన సైబర్ సెక్యూరిటీ పాలసీను రూపొందిస్తున్నట్లు జాతీయ సైబర్ సెక్యూరిటీ కోఆర్డీనేటర్ రాజేష్ పంత్ తెలిపారు. సైబర్ సెక్యూరిటీ సమ్మిట్ 2020లో రాజేష్ పంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మూడు నెలల్లో సైబర్ పాలసీకి చెందిన విధానాల రూపకల్పన పూర్తవుతుందని తెలిపారు. సైబర్ నేరాలు జరిగే అవకాశాలు ఉన్న దేశాలలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.
సైబర్ నేరాలు ఎక్కువయితే జీడీపీపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలోని ప్రజలకు మెరుగైన సేవలందిస్తు సమాచారాన్ని భద్రపరచడం అంత సులువు కాదని రైల్వే ఉన్నతాధికారి విజయ్ దేవ్‌నాథ్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని రక్షణశాఖ సలహాదారు అమిత్ శర్మ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment