Military aircraft
-
సైనిక విమాన తయారీకి ఊపు
మూడేళ్ల క్రితం యూరప్ కంపెనీ ‘ఎయిర్‌బస్’తో 56 సి–295 రవాణా విమానాలను కొనడానికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 16 స్పెయిన్‌లో తయారవుతాయి, మిగతా 40 ఇండియాలో ‘టాటా’(టీఏఎస్ఎల్) తయారు చేస్తుంది. సైనిక రవాణా విమానాల తయారీకి ఈ తరహా సహకారం ఇదే మొదటిది. స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో కలిసి మోదీ అక్టోబర్ 28న వడోదరలో టీఏఎస్ఎల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ తొలి ప్రైవేట్ సైనిక విమాన తయారీ కేంద్రం ఉపాధికి కూడా తోడ్పడుతుంది. ‘మేక్ ఇన్ ఇండియా’ కింద తొలి సి–295 విమానం 2026లో అందుబాటులోకి రానుంది. మొత్తం 40 విమానాలను 2031కల్లా అందించడం ద్వారా టీఏఎస్ఎల్ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.భారత వైమానిక దళానికి చెందిన పాత అవ్రో విమానాల స్థానంలో 56 సి–295 రవాణా విమానాలను కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ 2021 సెప్టెంబర్ లో రూ. 21,935 కోట్ల ఒప్పందంపై సంతకాలు చేసింది. ‘ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్’తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ప్రకారం, మొదటి 16 విమానాలను స్పెయిన్‌లోని సెవిల్లెలో దాని తుది అసెంబ్లింగ్ (విడిభాగాల కూర్పు) కేంద్రం నుంచి సరఫరా చేయాల్సి ఉంది. మిగతా 40 విమానాలను భారత్, స్పెయిన్ కుదుర్చుకున్న పారిశ్రామిక భాగస్వామ్య ఒప్పందం ప్రకారం మన దేశానికి చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) తయారు చేస్తుంది. భారత్‌లో రవాణా విమానాల తయారీకి ఈ తరహా సహకారం ఇదే మొదటిది. ప్రధాని మోదీ 2022 అక్టోబర్ 30న గుజరాత్‌లోని వడోదరలో టీఏఎస్ఎల్ చివరి దశ విడిభాగాల కూర్పు సదుపాయానికి శంకు స్థాపన చేశారు. అప్పటి ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌధురీకి 2023 సెప్టెంబర్ 13న స్పెయిన్‌లోని సెవిల్లెలో తొలి విమానాన్ని అందజేశారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ విమానం 2023 సెప్టెంబర్ 25న హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో లాంఛనంగా భారత వైమానిక దళంలో చేరింది. ‘రైనోస్’ అని కూడా పిలిచే ఐఏఎఫ్ 11 స్క్వాడ్రన్ ఇప్పటికే ఆరు సి–295 విమానాలను నడుపుతోంది.తొలి ప్రైవేట్ సైనిక విమాన తయారీసి–295 బహుళ ప్రాయోజక సైనిక రవాణా విమానంగా రుజువు చేసుకుంది. 9.5 టన్నుల పేలోడ్, 70 మంది ప్రయాణికులు లేదా 49 మంది పారాట్రూపర్లను తీసుకెళ్లగల సామర్థ్యంతో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) శక్తిని గణనీయంగా పెంచింది. పగలు, రాత్రి తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ నడిచే సామర్థ్యం ఉన్న ఈ విమానాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ వైమానిక దళాలు ఉప యోగిస్తున్నాయి. ఇంకా పలు సామర్థ్యాలు ఎయిర్‌బస్ సి–295 సొంతం. సైనిక రవాణా, ఆకాశమార్గంలో రవాణా, పారాట్రూపింగ్, వైద్య సహాయం కోసం తరలింపు, సముద్రప్రాంత గస్తీ, జలాంత ర్గాములను ఎదుర్కొనే యుద్ధ పరికరాలు, పర్యావరణ పర్యవేక్షణ, సరిహద్దు పహారా, వాటర్ బాంబర్, గాలి పరంగా ముందస్తు హెచ్చరి కలు వంటి విస్తృత శ్రేణి మిషన్ లలో ఇది సమర్థంగా పని చేస్తుంది.స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్‌తో కలిసి మోదీ అక్టోబర్ 28న వడోదరలో టీఏఎస్ఎల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. దేశంలో ఇదే తొలి ప్రైవేట్ సైనిక విమాన తయారీ కేంద్రం. మేక్ ఇన్ ఇండియా కింద తయారు చేసే తొలి సి–295 విమానం 2026 సెప్టెంబర్‌లో అందుబాటులోకి రానుంది. చివరి విమానం 2031 ఆగస్టు నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా. ఈ ప్రాజెక్ట్ దేశంలో విమాన రంగ అభివృద్ధికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇందులో దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న అనేక ఎంఎస్ఎంఈలు విమానాల విడి భాగాలను అందిస్తాయి. ఇప్పటికే 33 ఎంఎస్ఎంఈలను ఎయిర్‌బస్ గుర్తించింది. హైదరాబాద్‌లోని టీఏఎస్ఎల్ ప్రధాన కేంద్రంలో విమా నాల విడిభాగాల తయారీ ప్రారంభమైంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమి టెడ్ (బీఈఎల్), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అందించిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ (ఈడబ్ల్యూ) వ్యవస్థలను ఇప్పటికే విమానంలో అనుసంధానం చేశారు. అయితే, ఒప్పంద చర్చల తుది దశలో ఎక్కువ కాలం జాప్యం కావడంతో వీటిని అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. పెరిగే ఉపాధి కల్పనతాజా ప్రయత్నం వైమానిక రంగంలో ఉపాధి కల్పనను పెంచు తుందని రక్షణ శాఖ చెబుతోంది. దేశంలో ఏరోస్పేస్, రక్షణ రంగంలో 42.5 లక్షలకు పైగా పనిగంటలతో ప్రత్యక్షంగా 600 అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగాలకు, 3,000కు పైగా పరోక్ష ఉద్యోగాలకు, అదనంగా 3,000 మధ్యతరహా నైపుణ్య ఉపాధి అవకా శాలకు వీలు కలుగుతుంది. ఇతర ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ దారుల (ఓఈఎం) నుంచి ఎయిర్‌బస్ తెప్పించే ఏరో ఇంజిన్, ఏవి యానిక్స్ మినహా అధిక శాతం నిర్మాణ భాగాలు భారత్‌లోనే తయారవుతాయి. ఒక విమానంలో ఉపయోగించే 14,000 విడి భాగాలలో 13,000 భాగాలు దేశంలోని ముడిసరుకుతోనే తయారవుతాయి. అయితే టీఏఎస్ఎల్ సకాలంలో 40 విమానాలను తయారు చేయడమే అసలైన పరీక్ష. ఇప్పటివరకు చాలా కార్యకలాపాలు ఎయిర్‌బస్ ద్వారా జరుగుతున్నాయి. టీఏఎస్ఎల్ కేవలం వాటిని అమలు చేస్తోంది. భారత వైమానిక రంగ సుస్థిర వృద్ధి కోసం స్థానిక ఉత్పత్తి, డీజీ ఏక్యూఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ ఎష్యూరెన్స్) ద్వారా నాణ్యత నియంత్రణ, ‘సెమిలాక్’ ద్వారా భవిష్యత్తు ధ్రువీకరణ, దేశీయ తనిఖీ పరీక్షలు, మూల్యాంకనంపై దృష్టి సారించాలి.రక్షణ రంగం అంచెలంచెలుగా ఎదగడానికి గత పదేళ్లలో భారత ప్రభుత్వం చేసిన కృషి దోహదపడింది. రూ. 43,726 కోట్ల నుంచి రూ. 1,27,265 కోట్లకు పెరిగిన రక్షణ ఉత్పత్తుల్లో 21 శాతం వాటా ప్రైవేటు రంగానిదే. పదేళ్ల క్రితం రూ.1,000 కోట్ల లోపు ఉన్న రక్షణ ఎగుమ తులు గత ఏడాది రూ. 21,000 కోట్లకు పైగా పెరిగాయి. కొన్ని విధాన సంస్కరణలతో పాటు మూలధన పరికరాల కొనుగోలు కోసం డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్స్ – 2020లో స్వదేశీ డిజైన్, డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఐడీడీఎం) కేటగిరీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ఈ గణాంకాలను సాధించడానికి దోహదపడింది. కొత్తగా కేటాయించిన రక్షణ బడ్జెట్లో 75 శాతాన్ని దేశీయ పరిశ్రమల ద్వారా కొనుగోళ్లకు కేటాయించారు. జాయింట్ యాక్షన్ (శ్రీజన్) పోర్టల్ ద్వారా స్వయం సమృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, సానుకూల స్వదేశీకరణ జాబితాలు (పీఐఎల్), ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్స్‌లెన్స్ (ఐడీఈఎక్స్) ఏర్పాటు, 2024 సెప్టెంబర్ నాటికి రూ. 50,083 కోట్ల పెట్టుబడి అంచనాతో ఉత్తరప్రదేశ్, తమిళనాడుల్లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు వంటి అనేక ఇతర చర్యలను ప్రభుత్వం తీసుకుంది. 2013 మేలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) జారీ చేసిన తరువాత ఎయిర్‌బస్‌తో ఒప్పందం కుదుర్చు కోవడానికి రక్షణ మంత్రిత్వ శాఖకు ఆరేళ్ళు పట్టింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడానికి, ఒప్పందం తదుపరి చర్చలకు ఇంకా చాలా చేయాల్సి ఉంది.దేశంలో సి –295 సైనిక రవాణా విమానాల ఉమ్మడి తయారీలో ఎయిర్‌బస్ – టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) భాగ స్వామ్యం ఇప్పటివరకు సవాళ్లను ఎదుర్కొంటున్న భారత వైమానిక రంగానికి ఆశ, ప్రేరణగా నిలుస్తోంది. అయితే సివిల్ సర్టిఫైడ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉన్నందున ఈ ఎయిర్ క్రాఫ్ట్ వెర్షన్లను టీఏఎస్ఎల్ విస్తరిస్తుందో లేదో చూడాలి. ఈ భాగస్వామ్యం పూర్తి ప్రయోజనాలను పొందడానికి దేశంలో ఉత్పత్తి, భవిష్యత్తు ఎగుమ తులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆత్మనిర్భరత సాధన దిశగా భవిష్యత్ ప్రయాణం క్లిష్టంగా అనిపించినప్పటికీ, ఎయిర్‌బస్, టీఏ ఎస్ఎల్ మధ్య ఈ భాగస్వామ్యం ద్వారా అడుగులు ముందుకు పడ్డాయి. టీఏఎస్ఎల్ నిర్ణీత సమయానికి 40 విమానాలను తయారు చేయడం ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే ఈ తరహా భాగస్వామ్యాల విషయంలో ప్రభుత్వ రంగం ఐఏఎఫ్ అంచనాలను అందుకోలేదన్నది గత అనుభవాలు చెబుతున్న పాఠం. మరి ఈ ఒప్పందం సఫలమైతే దేశంలో ప్రైవేట్ రంగ భాగ స్వామ్యం మరింత ప్రబలమవుతుంది. వాటి సహకారం లేకుండా 2047 నాటికి ‘వికసిత్ భారత్’ కల నెరవేరదు.అనిల్ గోలానిఎయిర్ వైస్ మార్షల్ (రిటైర్డ్) వ్యాసకర్త సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్అడిషనల్ డైరెక్టర్ జనరల్ -
భారత డిఫెన్స్ ఉత్పత్తులు ఎగుమతయ్యే టాప్ 3 దేశాలు
భారత్ దేశీయ రక్షణ పరికరాల ఎగుమతులను పెంచుతోంది. ప్రధానంగా యూఎస్, ఫ్రాన్స్, అర్మేనియా దేశాలకు ఈ ఎగుమతులు అధికంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలకు భారత రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోందని అధికారులు పేర్కొన్నారు.ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..దేశీయ, అంతర్జాతీయ అవసరాలను తీర్చడానికి, భారత్‌లో ఉత్పత్తిని మెరుగుపరచడానికి రక్షణ మంత్రిత్వ శాఖ స్థానికంగా ఈ విభాగంలో తయారీని ప్రోత్సహిస్తోంది. దేశీయంగా తయారు చేస్తున్న పరికరాలను యూఎస్‌లోని లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్ వంటి సంస్థలు విమానాలు, హెలికాప్టర్ల తయారీలో వాడుతున్నారు. ఫ్రాన్స్‌కు జరిగే ఎగుమతుల్లో సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. అర్మేనియాకు ఎగుమతి చేసే వాటిలో అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్లు, పినాకా మల్టీ-బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్‌లు, వెపన్ లొకేటింగ్ రాడార్లు ఉన్నాయి.ఇదీ చదవండి: రోజూ 50 కోట్ల లావాదేవీలు‘దేశంలో 16 ప్రభుత్వ సంస్థలు రక్షణ రంగంలో సేవలందిస్తున్నాయి. లైసెన్స్‌లు కలిగిన 430 సంస్థలు మరో 16 వేల చిన్న, మధ్య తరహా కంపెనీలతో కలిసి పని చేస్తున్నాయి. 2014-15 నుంచి దేశంలో రక్షణ ఉత్పత్తుల తయారీ, వాటి విలువ దాదాపు మూడు రెట్లు పెరిగింది. భారతీయ సంస్థలు 2014-15లో రూ.46,429 కోట్ల విలువైన పరికరాలను ఉత్పత్తి చేయగా, గత ఆర్థిక సంవత్సరంలో అది రూ.1.27,265 కోట్లకు చేరుకుంది. ఈ ఉత్పత్తి విలువలో ప్రైవేట్ రంగం సహకారం 21 శాతంగా ఉంది. తేజస్ ఫైటర్ జెట్లు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు, ఆర్టిలరీ గన్ సిస్టమ్, హై మొబిలిటీ వాహనాలు, ఆయుధాలను గుర్తించే వాహనాలు, రాడార్లు..వంటివి దేశంలో ఉత్పత్తి చేస్తున్నారు’ అని అధికారులు పేర్కొన్నారు. -
మిజోరాంలో ప్రమాదానికి గురైన మయన్మార్ సైనిక విమానం..
ఐజ్వాల్: మిజోరంలో మయన్మార్ ఆర్మీకి చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. మయన్మార్ నుంచి వచ్చిన సైనిక విమానం రన్‌వేపై దిగుతుండగా అదుపు తప్పి కొంత దూరంలో ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. మిజోరాంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మయన్మార్ సిబ్బంది గాయపడ్డారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 13 మంది ఉన్నట్లు తెలుస్తోంది. తమ దేశంలో జరుగుతున్న అతర్యుద్ధం కారణంగా సరిహద్దుల దాటి భారత్‌లోని మిజోరం రాష్ట్రంలోకి చొరబడిన మయన్మార్ సైనికులను స్వదేహానికి తీసుకెళ్లేందుకు ఈ విమానం వచ్చిన సమయంలో ప్రమాదం జరిగింది. కాగా టేబుల్‌టాప్ రనేవేలు (పీఠభూమి లేదా ఎత్తైన కొండ పైభాగం ప్రాంతాల్లో నిర్మించిన రన్‌వే) సవాలుతో కూడుకొని ఉన్నాయి. ఇలాంటి రన్‌వేలో భారత్‌లో ఆరు మాత్రమే ఉన్నాయి. వీటి వల్ల విమానాలు ల్యాండింగ్ అవుతున్న సమయాల్లో రన్‌వే నుంచి జారిపోయే ప్రమాదం ఉంటుంది. చదవండి: భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేదు.. ఐక్యరాజ్య సమితిపై మస్క్ కీలక వ్యాఖ్యలు ఇక మయన్మార్‌లో తిరుగుబాటు గ్రూపులతో జరుగుతోన్న తీవ్ర ఘర్షణల నేపథ్యంలో ఆ దేశం నుంచి భారీగా సైనికులు భారత్‌లోకి చొరబడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత వారం మొత్తం 276 మంది మయన్మార్ సైనికులు మిజోరాంలోకి ప్రవేశించారని, వీరిలో 184 మంది సైనికులను భారత్ సోమవారం వెనక్కి పంపినట్లు అస్సాం రైఫఙల్స్ సోమవారం పేర్కొంది. స్వతంత్ర రాఖైన్ రాష్ట్ర కోసం పోరాటం చేస్తున్న మయన్మార్ తిరుగుబాటు బృందం ‘అరాకన్ ఆర్మీ’ సాయుధులు గతవారం దేశ సైనిక క్యాంప్‌పై దాడి చేసి ఆక్రమించుకున్నారు. దీంతో మయన్మార్ సైనికులు మిజోరాంలోని లాంగ్ట్లై జిల్లాలోని భారత్-మయన్మార్-బంగ్లాదేశ్ ట్రైజంక్షన్ వద్ద ఉన్న బందుక్‌బంగా గ్రామం ద్వారా దేశంలోకి ప్రవేశించి అస్సాం రైఫిల్స్ క్యాంప్‌లో లొంగిపోయారు. వీరి వద్ద ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా ఉన్నాయి. మయన్మార్ సైనికులను పర్వాలోని అస్సాం రైఫిల్స్ శిబిరానికి తరలించారు. అనంతరం వారిని లుంగ్లీకి మకాం మార్చారు. ఐజ్వాల్ సమీపంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయం నుండి మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలోని సిట్వేకు మయన్మార్ వైమానిక దళానికి చెందిన విమానాల్లో సైనికులను స్వదేశానికి పంపే ప్రక్రియ ప్రారంభించినట్లు అస్సాం రైఫిల్స్ అధికారి ఒకరు తెలిపారు. మిగిలిన 92 మంది సైనికులను నేడు మయన్మార్ తరలిస్తామని చెప్పారు. -
ప్రపంచంలోని టాప్ 10 మిలటరీ ఎయిర్ ఫోర్స్స్స్
-
16 కవాతు బృందాలు, 25 శకటాలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 16 కవాతు బృందాలు, 17 మిలటరీ బాండ్లు, వివిధ రాష్ట్రాలు–కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 25 శకటాలు రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొంటాయని ఇండియన్ ఆర్మీ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. రిపబ్లిక్ డే పెరేడ్లో సైనిక విన్యాసాలు, తేలికపాటి హెలికాఫ్టర్ల విన్యాసాలు కూడా ఉంటాయని తెలిపింది. మన దేశ సైనిక సత్తాని చాటి చెప్పేలా పిటి–76 ట్యాంకు, ఒక సెంచురీయన్ ట్యాంకు, రెండు ఎంబిటి అర్జున్ ఎంకే–1 ట్యాంకులు, ఒక ఓటీæ–62తో పస్ ఆర్మర్డ్ పర్సనల్ కేరియల్, ఒక బీఎంపీ–1 ఇన్ఫాంటరీ ఫైటింగ్ వెహికల్‌ను ప్రదర్శించనున్నారు. ఇవే కాకుండా క్షిపణి వ్యవస్థల్ని కూడా ప్రదర్శిస్తారు. సరిహద్దు భద్రతా సిబ్బంది మహిళా బృందం చేసే బైక్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రతీ ఏడాది సంప్రదాయంగా నిర్వహించినట్టే విజయ్‌చౌక్ నుంచి నేషనల్ స్టేడియం వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. -
విమానంలోనే అఫ్గన్ మహిళ ప్రసవం
కాబూల్: అమెరికా మిలటరీ విమానంలో అఫ్గన్ మహిళ ప్రసవించింది. కాబూల్ నుంచి జర్మనీ వెళుతుండగా విమానంలోనే మహిళకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. జర్మనీలోని రామ్‌స్టెయిన్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం కాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా.. ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు అమెరికన్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. విమానం రన్‌వేపై దిగిన వెంటనే తల్లీ బిడ్డను కార్గో 17లో మిలటరీ ఆసుపత్రికి తరలించారు. అఫ్గనిస్తాన్ తాలిబన్ల వశమైనప్పట్నుంచి ప్రతిరోజు హృదయవిదారక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కాబూల్ విమానాశ్రయంలో దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రతీ ఒక్కరి గుండెల్ని పిండేస్తున్నాయి. తాలిబన్ల అరాచక పాలనకి భయపడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవడానికి కాబూల్ విమానాశ్రయానికి వేలాదిగా తరలివస్తూ ఉండడంతో వారిని అడ్డగించడానికి తాలిబాన్లు ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ఈ కంచెకి ఒకవైపు అమెరికా, బ్రిటన్ సైనిక దళాలు, మరోవైపు మూటా ముల్లె, పిల్లాపాపల్ని చేతపట్టుకున్న అఫ్గాన్ ప్రజలు.. ఇక వారిని అడ్డగిస్తూ గాల్లోకి కాల్పులు జరుపుతున్న తాలిబన్లు.. ఇవే దృశ్యాలు, దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. చదవండి: కంచెకి ఇరువైపులా.. గుండెల్ని పిండేస్తున్న దృశ్యాలు తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు -
అపాచీకి దీటుగా స్వదేశీ హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్‌కు చెందిన అపాచీ హెలికాప్టర్లకు దీటుగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మధ్య తరహా మిలటరీ హెలికాప్టర్లను తయారు చేయడానికి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) సన్నాహాలు చేస్తోంది. 2027 కల్లా ఈ సైనిక హెలికాప్టర్లను తయారు చేసి భారత అమ్ముల పొదిలో చేర్చడానికి క్షేత్రస్థాయిలో పని ప్రారంభించినట్టు హాల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మాధవన్ వెల్లడించారు. రానున్న సంవత్సరాల్లో భారత్‌లోని త్రివిధ బలగాలకు అవసరమైన హెలికాప్టర్లను తామే రూపొందించడానికి కృషి చేస్తున్నట్టు ఆదివారం పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ హెలికాప్టర్ల డిజైన్ల రూపకల్పన ఇప్పటికే పూర్తయింది. ప్రభుత్వం అనుమతినిస్తే 500 యూనిట్లలో హెలికాప్టర్‌కు సంబంధించిన తొలి నమూనా పని 2023 నాటికి పూర్తయ్యేలా హాల్ లక్ష్యంగా నిర్ణయించింది. మి–17 స్థానంలో 10–12 టన్నుల కేటగిరీలో హెలికాప్ట్టర్ల తయారీపై హాల్ దృష్టి పెట్టింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 500 హెలికాప్టర్ల తయారు చేయగలిగితే విదేశాల నుంచి రూ. 4 లక్షల కోట్లకు పైగా విలువైన దిగుమతుల్ని నిరోధించవచ్చునని మాధవన్ వెల్లడించారు. తేజస్ తర్వాత అతి పెద్ద ప్రాజెక్టు తేజస్ యుద్ధ విమానాల తయారీ తర్వాత హాల్ చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టు ఇదే. హెలికాప్టర్ల డిజైన్ల తయారీకి, నమూనా హెలికాప్టర్ తయారీకి రూ.9,600 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ‘‘ఈ ఏడాది ప్రభుత్వం నుంచి ప్రాథమిక డిజైన్‌కు అనుమతి లభిస్తే 2027 నాటికి 500 హెలికాప్టర్లను తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. వాయుసేన, నేవీతో కూడా చర్చిస్తున్నాం. ఆర్మీ, వాయుసేనకు ఒక తరహా హెలికాప్టర్లు రూపొందిస్తే, నేవీ కోసం భిన్నమైన డిజైన్‌తో రూపొందించాల్సి ఉంటుంది. ఈ దిశగా నావికా, వైమానిక దళాధికారులతో చర్చలు కొనసాగిస్తున్నాం’అని మాధవన్ వెల్లడించారు. రెండు శక్తిమంతమైన ఇంజిన్లతో నడిచే ఈ హెలికాప్టర్ యుద్ధ నౌకలపై నుంచి కార్యకలాపాలు నడిపేలా బ్లేడ్ ఫోల్డింగ్ ఫీచర్‌తో రూపొందించనున్నారు. వీటికి భారీ డిమాండ్ ఉంటుందని మాధవన్ అంచనా. -
సుడాన్లో కూలిన విమానం;18 మంది మృతి
ఖార్తూమ్ : ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే విమానం కుప్పకూలి 18 మంది మృతి చెందిన ఘటన సుడాన్లో చోటుచేసుకుంది. కాగా కుప్పకూలిన విమానం రష్యాకు చెందిన ఆంటోనోవ్ ఎన్-12 గా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఏడుగురు సిబ్బంది, 11 మంది పౌరుల్లో నలుగురు చిన్నారులు, ముగ్గురు న్యాయమూర్తులున్నట్లు అధికారులు ధృవీకరించారు. సుడాన్ రాజధాని వెస్ట్ డార్ఫర్‌లోని ఈఐ జెనీనియా ఎయిర్పోర్ట్ నుంచి గురువారం రాత్రి ఆంటోనోవ్ ఎన్-12 మిలటరి విమానం బయలుదేరింది. అయితే టేకాఫ్ తీసుకున్న ఐదు నిమిషాలకే ఇంజిన్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
మిషన్ ఇంపాజిబుల్..
భూమికి 5 వేల అడుగుల ఎత్తులో సైనిక విమానంపై హీరో సాహసోపేతమైన స్టంట్స్.. చూస్తేనే రోమాలు నిక్కబొడుస్తాయి.. మరి అవి నిజంగా చేస్తేనో.. ఈ ఫొటోలోని సీన్ అదే. హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్-5 చిత్రం కోసం డూప్ లేకుండా చేసిన స్టంట్స్ తాలూకు ఫొటో ఇది. వేగంగా దూసుకుపోతున్న సైనిక విమానంపై కేవలం రెండు తాళ్ల సపోర్టుతో నిలబడి స్టంట్స్ చేయడమంటే మాటలా మరి. ఈ మధ్య బ్రిటన్‌లో ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. సినిమాల్లో ఓ నటుడు డూప్ లేకుండా చేసిన అత్యంత సాహసవంతమైన స్టంట్ ఇదేనని చెబుతున్నారు. -
స్వాతి కల నెరవేరింది!
విచిత్రం ఇక్కడున్న సైనికురాలిపేరు కెప్టెన్ స్వాతీ సిన్హా. భారతదేశానికి, చైనాకి మధ్యనున్న సరిహద్దు నాథూలా ప్రాంతంలో సైనికవిమానంలో కెప్టెన్‌గా పనిచేస్తోంది. సరిహద్దుల్లో పనిచేస్తున్న మొదటి మహిళా సైనిక విమాన కెప్టెన్‌గా స్వాతీ సిన్హా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా ఆమె తోటి మహిళలకు తన వృత్తి ప్రత్యేకత గురించి చెబుతూ...అందరికీ ఆహ్వానం పలుకుతోంది. చుట్టూ చూద్దామంటే ఒక్కరంటే ఒక్క మహిళ కూడా ఉండని కార్యాలయంలో ఎంతో స్వేచ్ఛగా పనిచేస్తున్న స్వాతీ సిన్హాని పలకరిస్తే... ‘‘నాకు చిన్నప్పటి నుంచి సైనికులంటే చాలా ఇష్టం. ఎనలేని గౌరవం కూడా. ఒక్కసారైనా వారున్న ప్రాంతాలకు వెళ్లి చూడాలనే కోరిక బలంగా ఉండేది. ఆ విషయం గురించి అమ్మానాన్నలకు చాలాసార్లు చెప్పాను. వినీ విననట్టు ఊరుకున్నారు. వాళ్లు నా ముందుంచిన అవకాశాలు రెండే. ఒకటి ఇంజనీర్, రెండోది డాక్టర్. చేసేది లేక ఇంజనీరింగ్ చదివాను. వెంటనే ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం వచ్చింది. ఓ ఏడాది ఉద్యోగం చేశాక.. భారత సైనికదళానికి సంబంధించిన పరీక్షలేవో రాసే అవకాశం కలిగింది. అంతే పరీక్ష రాశాను. రెండేళ్లలో లక్నోలోని సైనిక విభాగ కార్యాలయంలో ఉద్యోగం వచ్చింది. ఇంట్లోవాళ్లు, బంధువులు అందరూ... నేను ఆ ఉద్యోగంలో చేరడాన్ని ఇష్టపడలేదు. ‘పోనీ మామూలు విమాన పెలైట్ కూడా కాదు...సైనిక విమానంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఏంటో...ఎందుకొచ్చిన గొడవే..’అంటూ ఎవరికి తోచినట్టు వారు మాట్లాడారు. నేను ఎవరి మాటలు లెక్కచేయలేదు. సైనికురాలిగా పనిచేయడం కంటే గొప్ప ఉద్యోగం మరొకటి ఉండదని నా అభిప్రాయం’’ అంటూ చెప్పుకొచ్చింది స్వాతి. తోటివారికి ఆహ్వానం... బెంగుళూరులో ఒక ఇంజినీర్ కుటుంబంలో జన్మించిన స్వాతీ సిన్హా తన వృత్తి గురించి ఇంకా చెబుతూ...’’అందరూ ఊహించుకుంటున్నట్టు ఇక్కడ ప్రతిరోజు శత్రువులపై దాడి ఉండదు. అలాగే శత్రువులు కూడా అదేపనిగా మమ్మల్ని చంపే ప్రయత్నాలు చేయరు. దేశ సరిహద్దుల్లోని మన ప్రాంతాన్ని ఎవరూ ఆక్రమించకుండా కాపలా కాయడమే మా ఉద్యోగం. అందులో భాగంగా గగనతలంలో విమానాలపై చక్కర్లు కొడుతుంటాం. ప్రస్తుతం నేను ఇక్కడి కార్యాలయంలో సిగ్నల్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నాను. సైనిక వృత్తిని ఇష్టపడే ప్రతి ఒక్క మహిళకూ ఇక్కడ స్థానం ఉంటుంది. ఇక తోటి ఉద్యోగులంటారా... దేశ భద్రతకోసం తమ ప్రాణాలను పణంగా పెట్టినవారు మహిళకు భద్రత ఇప్పించలేరా...ఒక్కమాటలో చెప్పాలంటే నాతో పనిచేసేవారంతా ప్రాణమిచ్చే తోబుట్టువులు’ అని ఎంతో గర్వంగా చెప్పింది స్వాతి సిన్హా. మహిళలు చాలా రంగాలను దూరం నుంచి చూసే భయపడిపోతుంటారు. స్వాతి సిన్హా అనుభవం తోటి మహిళలకు కొత్త ధైర్యాన్ని ఇస్తుందని భావిద్దాం.