న్యూఢిల్లీ: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 16 కవాతు బృందాలు, 17 మిలటరీ బాండ్లు, వివిధ రాష్ట్రాలు–కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 25 శకటాలు రిపబ్లిక్ డే పెరేడ్‌లో పాల్గొంటాయని ఇండియన్ ఆర్మీ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. రిపబ్లిక్ డే పెరేడ్‌లో సైనిక విన్యాసాలు, తేలికపాటి హెలికాఫ్టర్ల విన్యాసాలు కూడా ఉంటాయని తెలిపింది. మన దేశ సైనిక సత్తాని చాటి చెప్పేలా పిటి–76 ట్యాంకు, ఒక సెంచురీయన్ ట్యాంకు, రెండు ఎంబిటి అర్జున్ ఎంకే–1 ట్యాంకులు, ఒక ఓటీæ–62తో పస్ ఆర్మర్డ్ పర్సనల్ కేరియల్, ఒక బీఎంపీ–1 ఇన్‌ఫాంటరీ ఫైటింగ్ వెహికల్‌ను ప్రదర్శించనున్నారు. ఇవే కాకుండా క్షిపణి వ్యవస్థల్ని కూడా ప్రదర్శిస్తారు. సరిహద్దు భద్రతా సిబ్బంది మహిళా బృందం చేసే బైక్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రతీ ఏడాది సంప్రదాయంగా నిర్వహించినట్టే విజయ్‌చౌక్ నుంచి నేషనల్ స్టేడియం వరకు ఈ ప్రదర్శన ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment