సుడాన్‌లో కూలిన విమానం;18 మంది మృతి | 18 People Died In Sudan Military plane crash | Sakshi
Sakshi News home page

సుడాన్‌లో కూలిన విమానం;18 మంది మృతి

Published Fri, Jan 3 2020 2:18 PM | Last Updated on Fri, Jan 3 2020 2:26 PM

18 People Died In Sudan Military plane crash - Sakshi

ఖార్తూమ్‌ : ఎయిర్‌పోర్ట్‌ నుంచి టేకాఫ్‌ అయిన ఐదు నిమిషాలకే విమానం కుప్పకూలి 18 మంది మృతి చెందిన ఘటన సుడాన్‌లో చోటుచేసుకుంది. కాగా కుప్పకూలిన విమానం రష్యాకు చెందిన ఆంటోనోవ్‌ ఎన్‌-12 గా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఏడుగురు సిబ్బంది, 11 మంది పౌరుల్లో నలుగురు చిన్నారులు, ముగ్గురు న్యాయమూర్తులున్నట్లు అధికారులు ధృవీకరించారు. సుడాన్‌ రాజధాని వెస్ట్ డార్ఫర్లోని ఈఐ జెనీనియా ఎయిర్‌పోర్ట్‌ నుంచి గురువారం రాత్రి ఆంటోనోవ్‌ ఎన్‌-12 మిలటరి విమానం బయలుదేరింది. అయితే టేకాఫ్‌ తీసుకున్న ఐదు నిమిషాలకే ఇంజిన్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement