న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ, మార్చితో ముగిసిన గత 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతులు విస్తరించాయి. వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం, 115 దేశాలకు భారత్ ఎగుమతులు పెరిగాయి. భారత్ మొత్తం ఎగుమతుల్లో 46.5 శాతం వెయిటేజ్ కలిగిన ఈ దేశాల్లో అమెరికా, యూఏఈ, నెథర్లాండ్స్, చైనా, బ్రిటన్, సౌదీ అరేబియా, సింగపూర్, బంగ్లాదేశ్, జర్మనీ, ఇటలీ ఉన్నాయి.
కాగా మొత్తం ఎగుమతులు 2022–23తో పోలి్చతే 2023–24లో 3 శాతం పతనమై 437.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే సేవల రంగం ఎగుమతులు ఇదే కాలంలో 325.3 బిలియన్ డాలర్ల నుంచి 341.1 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఈ ప్రాతిపదిన మొత్తం ఎగుమతులు స్వల్పంగా 0.23 శాతం పెరిగి 776.4 బిలియన్ డాలర్ల నుంచి 778.2 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రపంచ వస్తు వాణిజ్యంలో భారత్ వాటా 2014లో 1.70 శాతం ఉంటే, 2023లో 1.82 శాతానికి ఎగశాయి. భారత్ ర్యాంక్ సైతం ఈ విషయంలో 19 నుంచి 17 శాతానికి మెరుగుపడింది.
Comments
Please login to add a commentAdd a comment