Global economic uncertainty
-
భారత్ ఎగుమతులు విస్తరించాయ్!
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ, మార్చితో ముగిసిన గత 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతులు విస్తరించాయి. వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం, 115 దేశాలకు భారత్ ఎగుమతులు పెరిగాయి. భారత్ మొత్తం ఎగుమతుల్లో 46.5 శాతం వెయిటేజ్ కలిగిన ఈ దేశాల్లో అమెరికా, యూఏఈ, నెథర్లాండ్స్, చైనా, బ్రిటన్, సౌదీ అరేబియా, సింగపూర్, బంగ్లాదేశ్, జర్మనీ, ఇటలీ ఉన్నాయి. కాగా మొత్తం ఎగుమతులు 2022–23తో పోలి్చతే 2023–24లో 3 శాతం పతనమై 437.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే సేవల రంగం ఎగుమతులు ఇదే కాలంలో 325.3 బిలియన్ డాలర్ల నుంచి 341.1 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఈ ప్రాతిపదిన మొత్తం ఎగుమతులు స్వల్పంగా 0.23 శాతం పెరిగి 776.4 బిలియన్ డాలర్ల నుంచి 778.2 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రపంచ వస్తు వాణిజ్యంలో భారత్ వాటా 2014లో 1.70 శాతం ఉంటే, 2023లో 1.82 శాతానికి ఎగశాయి. భారత్ ర్యాంక్ సైతం ఈ విషయంలో 19 నుంచి 17 శాతానికి మెరుగుపడింది. -
అనిశ్చితిలోనూ ఎకానమీ శుభ సంకేతాలు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ భారత్ ఎకానమీ తగిన సానుకూల గణాంకాలను చూస్తోంది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 5.6 శాతంగా (2022 ఫిబ్రవరితో పోల్చి) నమోదయ్యింది. విద్యుత్, మైనింగ్, తయారీ రంగాలు మంచి పనితీరును ప్రదర్శించినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం లెక్కలు వెల్లడించాయి. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్షకు ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 5.66 శాతం పెరిగింది. అంటే 2022 ఇదే నెలతో పోల్చితే ఈ ఉత్పత్తుల బాస్కెట్ ధర 5.66 శాతమే పెరిగిందన్నమాట. గడచిన 15 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపు ఉండాలి. అయితే 2022 నవంబర్, డిసెంబర్ మినహా 2022 జనవరి నుంచి 6 శాతం ఎగువనే కొనసాగుతోంది. కూరగాయల ధరలు కూల్... వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత గణాంకాల ప్రకారం మార్చిలో కూరగాయలు, ప్రొటీన్ రిచ్ ఆహార పదార్థాల ధరలు తగ్గాయి. కూరగాయల ధరలు 8.51 శాతం తగ్గాయి (2022 ఇదే నెలతో పోల్చి). ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ధరలు 7.86 శాతం దిగిరాగా, చేపల ధర 1.42 శాతం దిగివచ్చింది. అయితే సుగంధ ద్రవ్యాల ధరలు మాత్రం భారీగా 18.2 శాతం ఎగశాయి. తృణ ధాన్యాలు–ఉత్పత్తుల ధరలు 15.27 శాతం ఎగశాయి. పండ్ల ధరలు కూడా పెరిగాయి. ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 2023 ఫిబ్రవరిలో 5.95 శాతం వద్ద ఉంటే, మార్చిలో 4.79 శాతానికి తగ్గింది. 2022 ఇదే నెల్లో ఈ ద్రవ్యోల్బణం రేటు 7.68 శాతంగా ఉంది. -
మళ్లీ పసిడి మెరుపులు...
న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు పసిడిని హఠాత్తుగా మెరిసేలా చేస్తున్నాయి. రెండురోజులుగా కొంచెం వెనక్కు తగ్గిన్నట్లు కనిపించిన పసిడి మళ్లీ బుధవారం పరుగులు పెడుతోంది. అంతర్జాతీయ నెమైక్స్ మార్కెట్లో చురుగ్గా ట్రేడవుతున్న ఏప్రిల్ కాంట్రాక్ట్ ధర ఔన్స్ (31.1గ్రా)కు క్రితం ముగింపుతో పోల్చితే కడపటి సమాచారం అందేసరికి 27 డాలర్ల లాభంతో 1,250 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది. కడపటి సమాచారం అందే సరికి 10 గ్రాముల ధర క్రితంతో పోల్చితే రూ. 500 లాభంతో రూ. 29,800 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే గురువారం స్పాట్ మార్కెట్లో ధర మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా బుధవారం ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్లో పసిడి 10 గ్రాములు 99.9 స్వచ్ఛత ధర క్రితం ముగింపుతో పోల్చితే... రూ.365 లాభంతో రూ.29,235కు చేరింది. 99.5 స్వచ్ఛత పసిడి ధర సైతం ఇదే స్థాయిలో ఎగసి రూ.29,085కు ఎగసింది. -
భారత్ పై ‘విదేశీ’ ప్రభావం తక్కువే..
♦ ఎస్ అండ్ పీ విశ్లేషణ ♦ దేశీయ డిమాండ్ కారణమని వెల్లడి ♦ ద్రవ్యలోటు, వృద్ధి రికవరీపై మరో ♦ ఆర్థిక సేవల దిగ్గజం డీబీఎస్ హెచ్చరిక న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల ప్రభావం భారత్‌పై తక్కువగానే ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం- స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ అండ్ పీ) పేర్కొంది. దీనికి దేశీయంగా పటిష్టంగా ఉన్న ప్రజా వినియోగం, ప్రభుత్వ వ్యయాలు కారణమని ఎస్ అండ్ పీ ఇండియా సావరిన్ అనలిస్ట్ కిర్యాన్ క్యూరీ పేర్కొన్నారు. కాగా ద్రవ్యలోటు, ఆర్థికాభివృద్ధి రికవరీలో వేగం ప్రస్తుత సమస్యలని మరో ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీబీఎస్) అభిప్రాయపడింది. ఎస్ అండ్ పీ.. విశ్లేషణాంశాలు... భారత్ డిమాండ్ దేశీయంగా పటిష్టంగా ఉంది. దేశం నుంచి వేగంగా వెనక్కు వెళ్లిపోయే నిధులపై పూర్తిగా ఆధారపడి ఆర్థికవ్యవస్థ లేదు. విదేశీ మారకద్రవ్యం రాక, పోకల మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించి కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 1.4 శాతం వద్ద (స్థూల దేశీయోత్పత్తితో పోల్చితే) ఉండే అవకాశం ఉంది. 2018 వరకూ ఇదే పరిస్థితి కొనసాగే వీలుంది. ఎగుమతులు పెరక్కపోవడం కరెంట్ అకౌంట్ లోటు 1.4 శాతం స్థాయిలోనే కొనసాగడానికి కారణం. అయితే దేశంలోకి పసిడి దిగుమతులు పెరిగితే... కరెంట్ అకౌంట్ లోటు మరికొంత పెరిగే అవకాశం ఉంది. 2014-15లో క్యాడ్ 1.3 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16) ముగిసిన ఆరు నెలల కాలంలో ఈ లోటు 1.4 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో క్యాడ్ 1.8 శాతంగా నమోదైంది.అదే విధంగా తన వృద్ధి నిధికి విదేశీ పొదుపుపై ఆధారపడ్డం చాలా తక్కువ. బ్యాంకింగ్‌కు దేశీయ డిపాజిట్ బేసే ప్రధానంగా అధికంగా ఉంది. భారత్ క్యాపిటల్ మార్కెట్లు వివిధ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కంపెనీల నిధుల సమీకరణకు ఇది తగిన పరిస్థితి. రేటింగ్ అప్‌గ్రేడ్‌పై ద్రవ్యలోటు ప్రభావం: డీబీఎస్ ప్రభుత్వ రాబడి-వ్యయాల మధ్య వ్యత్యాసమైన ద్రవ్యలోటు తీవ్రత రేటింగ్ అప్‌గ్రేడ్‌కు ఇబ్బంది కలిగించే అంశమని మరో ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- డన్ అండ్ బ్రాడ్స్ట్రీస్ (డీబీఎస్) తన తాజా నివేదికలో పేర్కొంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు ప్రభుత్వ లక్ష్యం స్థూల దేశీయోత్పత్తిలో 3.5 శాతం కాగా 3.7 శాతం కన్నా అధికంగా ఉండే వీలుందని విశ్లేషించింది. దీనివల్ల రేటింగ్ అప్‌గ్రేడ్ ఆలస్యం అయ్యే వీలుందని అభిప్రాయపడింది. అయితే కేవలం దీని ప్రాతిపదికన ఇన్వెస్టర్లు, రేటింగ్ ఏజెన్సీలు ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగే నిర్ణయాలు ఏవీ చేపట్టబోరని కూడా విశ్లేషించింది. విదేశీ చెల్లింపుల పరిస్థితి బాగుండడం, వృద్ధి అవకాశాలు, దిగువ స్థాయి ద్రవ్యోల్బణం వంటి అంశాలన్నింటినీ ఇన్వెస్టర్లు, రేటింగ్ ఏజెన్సీలు పరిగణనలోకి తీసుకుంటాయన్నది తమ అంచనా అని తెలిపింది. ప్రస్తుతం విదేశీ రేటింగ్ ఏజెన్సీలు భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి స్టేబుల్ అవుట్‌లుక్‌తో బీబీబీ- గ్రేడ్‌ను ఇస్తున్నాయి. జంక్ స్టేటస్‌కు ఇది ఒక మెట్టు ఎక్కువ. ద్రవ్యలోటు తీవ్రతరమైతే... జంక్ స్టేటస్‌కు రేటింగ్‌ను దించుతామని ఇటీవల విదేశీ రేటింగ్ ఏజెన్సీలు హెచ్చరించాయి. ఫిబ్రవరి 29న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టే 2016-17 బడ్జెట్‌పై ఈ సంస్థలు దృష్టి సారించాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీ దిశలో సైతం భారత్ వేగంగా అడుగులు వేయడం లేదన్నది డీ అండ్ బీ అభిప్రాయం.