
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆర్థికవేత్తలలో అధికశాతం మంది 2025లో బలహీన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నారు. అయితే కొంత మందగమన సంకేతాలు ఉన్నప్పటికీ, భారతదేశం బలమైన వృద్ధిని కొనసాగించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ మేరకు విడుదలైన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) చీఫ్ ఎకనమిస్ట్ అవుట్‌లుక్‌లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. సర్వేలో అభిప్రాయం వ్యక్తం చేసిన ఆర్థికవేత్తలో 56 శాతం 2025లో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉంటాయని భావిస్తున్నారు. కేవలం 17 శాతం మెరుగుదల ఉంటుందని అభిప్రాయపడ్డారు. 2025లో భారత్, అమెరికాలు మాత్రం చక్కటి పురోగతి సాధిస్తాయని అంచనా. యూరోప్ ఎకా నమీ బలహీనంగా ఉంటుందని సర్వేలో పాల్గొన్న వారిలో 74 శాతం మంది అభిప్రాయడ్డారు. చైనా వృద్ధిపై కూడా అనుమానాలే వ్యక్తం మయ్యాయి.