జెనీవా/న్యూఢిల్లీ: ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల పరిమిత పాత్ర, తక్కువ వేతనాల కారణంగా ప్రపంచ లింగ వ్యత్యాస సూచీలో భారత్ 108వ స్థానంలో నిలిచింది. 2016 నాటి ర్యాంకింగ్‌తో పోల్చితే 21 స్థానాలు దిగజారిన భారత్ పొరుగు దేశాలు బంగ్లాదేశ్(47), చైనా(100) కన్నా వెనకబడింది. ప్రపంచ ఆర్థిక ఫోరం(డబ్ల్యూఈఎఫ్) గురువారం విడుదల చేసిన ఈ నివేదిక భారత్‌లో ఆర్థిక, విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, రాజకీయాల్లో మహిళల స్థితిగతులను పూసగుచ్చింది. డబ్ల్యూఈఎఫ్ లింగ వ్యత్యాసాన్ని గణించడం ప్రారంభించిన 2006 నాటితో పోల్చితే ఈ ఏడాది భారత్ పది ర్యాంకులు నష్టపోవడం గమనార్హం. విద్యలో ఎంతో పురోగతి సాధించినా, ఆరోగ్యం, ఆయుః ప్రమాణాల్లో లింగ వ్యత్యాసం ఎక్కువగా ఉండటం భారత్ వెనకబాటుతనాన్ని సూచిస్తోంది. జాబితాలో ఐస్‌లాండ్ తొలి స్థానంలో నిలవగా, తర్వాత నార్వే(2), ఫిన్‌లాండ్(3), రువాండా(4), స్వీడన్(5) ఉన్నాయి.
నివేదిక ముఖ్యాంశాలు:
► మొత్తం మీద 108వ ర్యాంకు సాధించిన భారత్ ఆర్థిక కార్యకలాపాలు, అవకాశాలు... ఆరోగ్యం విషయంలో మహిళల పాత్రకు సంబంధించి వరసగా 139, 141వ స్థానాల్లో నిలిచింది.
► ఇక పనిచేసే చోట లింగ వ్యత్యాసం, మహిళలకు వేతన చెల్లింపుల్లో 136వ స్థానంలో ఉంది.
► భారత్‌లో సగటున 66 శాతం మంది మహిళలకు వేతనాలు చెల్లించడం లేదు. పురుషుల్లో అయితే ఈ రేటు 12 శాతంగా ఉంది.
► రాజకీయ సాధికారత, ఆయుః ప్రమాణం, అక్షరాస్యతలో లింగ వ్యత్యాసం పెరగడమే భారత్ ఈ ర్యాకింగ్‌లో వెనకబడటానికి ప్రధాన కారణం
► భారత్ లింగ వ్యత్యాసాన్ని 67% పూరించింది. ఇది బంగ్లాదేశ్, చైనాలతో పోల్చితే తక్కువే
► ప్రాథమిక, మాధ్యమిక విద్యలో లింగ వ్యత్యాసాలు తగ్గడం భారత్‌లో ఒక సానుకూల అంశం. ఉన్నత విద్యలో తారతమ్యాలు తొలిసారి దాదాపు శూన్య స్థాయికి చేరుకోవడం విశేషం.
► ఆరోగ్యం విషయంలో లింగ వ్యత్యాసానికి సంబంధించి భారత్ చివరి నుంచి నాలుగో స్థానంలో నిలవడం ఆందోళన కలిగించేదే. గత దశాబ్ద కాలంలో ఈ ఉపసూచీలో భారతే అతి తక్కువగా అభివృద్ధి చెందింది.
► ప్రపంచ వ్యాప్తంగా కూడా లింగ వ్యత్యాస స్థితిగతుల్లో పెద్దగా పురోగతి లేకపోగా తొలిసారి తారతమ్యాలు పెరిగాయి.
► ప్రపంచ వ్యాప్తంగా 68 శాతం లింగ వ్యత్యాసాన్ని పూరించారు. 2016లో ఇది 68.3 శాతంగా ఉంది.
► ఇలాగే వృద్ధి జరిగితే సగటున లింగ సమా నత్వం సాధించాలంటే మరో వందేళ్లు పడుతుంది.
► ఇక పనిచేసే చోట తారతమ్యాలు తొలగించాలంటే 217 ఏళ్లు పడుతుంది.
► అధ్యయనం చేపట్టిన 144 దేశాల్లో సగం దేశాలు ఏడాది కాలంలో మెరుగైన స్కోరు సాధించాయి.
సమానత్వానికి సుదూరంలో...
Published Fri, Nov 3 2017 1:01 AM | Last Updated on Mon, Jul 23 2018 9:11 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment