భారతదేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. దీనిపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి 'పియూష్ గోయల్' అన్నారు. ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి, ఇందులో దేశం సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోందని అన్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతమని వెల్లడించారు.
2024-25 ఆర్ధిక సంవత్సరంలో.. భారతదేశ ఎగుమతులు మొదటిసారి రికార్డు స్థాయిలో 800 బిలియన్ డాలర్లకు చేరువలో ఉంది. గత నాలుగేళ్లుగా ఎగుమతులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఎగుమతులు గణనీయంగా ఉంటాయని గోయల్ అన్నారు. జూన్ 2025తో ముగిసే ఆర్ధిక సంవత్సరంలో ఉల్లి, టమోటా, బంగాళాదుంప ఉత్పత్తులు పెరిగే అవకాశం ఉందని కేంద్రం స్పష్టం చేసింది.
మన ఎగుమతులు దేశ చరిత్రలోనే తొలిసారి 800 బిలియన్ డాలర్లను దాటుతుందని పియూష్ గోయల్ రాజ్యసభలో తెలిపారు. విదేశీ మారకద్రవ్య నిల్వలు చాలా నెలలుగా 600 బిలియన్ డాలర్ల వద్దనే స్థిరంగా ఉన్నాయి.
ఎగుమతులు మాత్రమే కాకుండా.. దిగుమతుల అవసరం కూడా చాలా ఉంది. అయితే దిగుమతులు అనేవి కొరత, డిమాండ్ వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఇందులో పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గు, పప్పుధాన్యాలు, నూనెలు వంటివి ఉన్నాయి. ఎగుమతులు, దిగుమతుల వల్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరుగుతాయని గోయల్ అన్నారు.
ఇదీ చదవండి: టెక్ కంపెనీ భారీ లేఆఫ్స్: ఒకేసారి 3000 మంది బయటకు!
భారతదేశంలో ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసి, అందులో ఉత్పత్తులను ప్రారంభించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంతవరకు దిగుమతులు పెరుగుతాయి. ఒక ప్రాంతంలో దిగుమతులు పెరిగితే.. పరిశ్రమల చూపుకూడా అటువైపు పడుతుంది. దీంతో అక్కడ కంపెనీలు ఏర్పడతాయి. ఇది ఎంతోమంది ఉపాధి కల్పిస్తుందని పియూష్ గోయల్ అన్నారు. మొత్తం మీద దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment