ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్(బెల్-212) ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పరం ప్రతీకార దాడులు జరుపుకుంటున్న నేపథ్యంలో ఇరు దేశాలు భారత్‌తో జరుపుతున్న వాణిజ్యం ఏమేరకు ప్రభావం పడుతుందోననే ఆందోళనలు నెలకొంటున్నాయి. ఇప్పటివరకైతే రెండు దేశాలతో భారత్ మెరుగైన సంబంధాలను కలిగి ఉంది. ఏటా ఆయా దేశాలతో చేసే వాణిజ్యాన్ని పెంచుకుంటుంది. ప్రధానంగా వాటి నుంచి జరిపే దిగుమతులు, ఎగుమతులు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
2022-23లో 2.33 బిలియన్‌డాలర్ల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అది 21.7 శాతం అధికం. భారత్ నుంచి ఇరాన్‌కు చేసే ఎగుమతులు 1.66 బి.డాలర్లు(ముందు ఏడాదితో పోలిస్తే 14.34శాతం అధికం)గా ఉన్నాయి. ఇరాన్ నుంచి భారత్ చేసుకునే దిగుమతులు 672 మిలియన్ డాలర్లు(ముందు ఏడాదితో పోలిస్తే 45.05 శాతం)గా ఉన్నాయి.
భారత్ నుంచి ఇరాన్ వెళ్తున్న వాటిలో ప్రధానంగా బాస్మతి బియ్యం, టీ పౌడర్, షుగర్, పండ్లు, ఫార్మా ఉత్పత్తులు, కూల్‌డ్రింక్స్, పప్పుదినుసులు ఉన్నాయి. ఇరాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల్లో మిథనాల్, పెట్రోలియం బిట్యుమెన్, యాపిల్స్, ప్రొపేన్, డ్రై డేట్స్, ఆర్గానిక్ కెమికల్స్, ఆల్మండ్స్ ఉన్నాయి.
ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ 15 బీటా 2లోని కొత్త ఫీచర్లు
ఇజ్రాయెల్‌తోనూ భారత్‌కు మెరుగైన సంబంధాలే ఉన్నాయి. ఇబ్రాయెల్‌కు భారత్ ఎగుమతుల్లో ప్రధానంగా ఆటోమేటివ్ డీజిల్, కెమికల్ ఉత్పత్తులు, ఎలక్ట్రికల్ వస్తువులు, ప్లాస్టిక్, టెక్స్ట్‌టైల్, మెటల్ ఉత్పత్తులు ఉన్నాయి ఫెర్టిలైజర్ ఉత్పత్తులు, రంగురాళ్లు, పెట్రోలియం ఆయిల్స్, డిఫెన్స్ పరికరాలను భారత్ దిగుమతి చేసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment