ఢిల్లీ: దేశంలో ఉల్లి ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని సడలించింది. మార్చి 31 వరకు బంగ్లాదేశ్, మారిషస్, బెహ్రెయిన్, భూటాన్‌లకు 54,760 టన్నుల ఉల్లిపాయల్ని ఎగుమతి చేసేందుకు వ్యాపారులకు అనుమతిస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్ సింగ్ ప్రకటన విడుదల చేశారు.
బంగ్లాదేశ్‌కు 50 వేల టన్నులు, మారిషస్‌కు 1,200 టన్నులు, బహ్రెయిన్‌కు 3 వేల టన్నులు, భూటాన్‌కు 560 టన్నుల చొప్పున ఉల్లిని ఎగుమతి చేసేందుకు అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు.. కానీ మార్చి 31 వరకు మాత్రమే నిర్దేశించిన విధంగా ఉల్లిని ఎగుమతి చేసేందుకు వ్యాపారులకు అనుమతి ఉందని, దీనికి సంబంధించిన విధివిధానాల్ని రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
కాగా, దేశంలో ఉల్లి ధరల పెరుగుదలను నియంత్రించి దేశీయంగా సరఫరా పెంచేందుకు కేంద్రం గతేడాది డిసెంబర్ 8న ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ నిషేధం మార్చి 31 వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో విదేశాంగ శాఖ చేసిన సూచన మేరకు తాజాగా నాలుగు దేశాలకు ఎగుమతి చేసేందుకు రైతులకు అవకాశం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి: బ్లూ ఆధార్ కార్డు ఎవరికిస్తారు? ఎలా దరఖాస్తు చేయాలి?
Comments
Please login to add a commentAdd a comment