న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల జోరుతో.. సర్వీసుల రంగం ఆరోగ్యకర వృద్ధితో 2023–24లో 400 బిలియన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేస్తుందని సర్వీసెస్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. ‘2022–23లో పరిశ్రమ 42 శాతం ఎగసి 322.72 బిలియన్ల విలువైన ఎగుమతులను సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో సర్వీసుల రంగం 350 బిలయన్ డాలర్లుగా ఉంటుంది.
యాత్రలు, రవాణా, వైద్యం, ఆతిథ్యం సహా పలు రంగాలు గతేడాది వృద్ధికి దోహదం చేశాయి. ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతులు బలంగా సాగుతున్నాయి. వృద్ధి వేగం కొనసాగనుంది. యాత్రల రంగం త్వరలో వృద్ధి బాట పట్టనుంది. మహమ్మారి అనంతర ఆర్థిక పునరుద్ధరణ విదేశీ మార్కెట్ల నుండి వస్తువులు, సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను సృష్టించింది. సరుకు రవాణా ఛార్జీల స్థిరీకరణ, సరఫరా వ్యవస్థ సాధారణీకరణ రవాణా రంగానికి సానుకూల పరిణామాలు’ అని కౌన్సిల్ తెలిపింది.
ప్రోత్సాహకాలు అవసరం..
ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, లీగల్, అకౌంటింగ్ సేవలు, పరిశోధన, మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ వంటి వ్యాపార సేవలు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అందించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో ప్రయోజనం పొందుతాయి. ప్రధాన ఎగుమతి గమ్యస్థానాల విషయానికొస్తే భారతదేశ సేవా ఎగుమతులు చారిత్రాత్మకంగా ఉత్తర అమెరికా, యూరప్‌లో కేంద్రీకృతమై ఉన్నాయి. అయితే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వృద్ధికి గణనీయమైన అవకాశం ఉంది.
ఎగుమతి గమ్యస్థానాల వైవిధ్యం సంప్రదాయ మార్కెట్లపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, ఎగుమతులకు కొత్త అవకాశాలను తెరవడానికి సాయపడుతుంది. వృద్ధి రేటును మరింత పెంచేందుకు కొన్ని ప్రోత్సాహకాలు అవసరం. ప్రభు త్వం సరైన సహాయంతో గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌లు చాలా బాగా పని చేస్తాయి. ఇది వారికి ధర, డెలివరీ పోటీగా, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవే శించడంలో సహాయపడుతుంది. కాబట్టి వృద్ధికి ప్రోత్సాహకాలు అందించడం గురించి ప్రభుత్వం ఆలోచించాలి’ అని కౌన్సిల్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment